'టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి' | TRS president elections process completed, says Naini Narasimha reddy | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి'

Published Mon, Apr 20 2015 5:14 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

'టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి' - Sakshi

'టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి'

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున 6 సెట్ల నామినేషన్ దాఖలు కావడంతో టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక లాంఛనమైందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్లో నాయిని మీడియాతో మాట్లాడారు. 24 సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించనున్నట్టు చెప్పారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకుంటాడని నాయిని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశంలో కేసీఆర్దే నిర్ణయమని తెలిపారు. ఆంధ్రా ప్రాంతంవారు కూడా ఈసారి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రాంత ప్రజలతో మాకు ఇబ్బంది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతంగా నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement