కేంద్ర నుంచి కరవు నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రాలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.
- కేంద్రం నుంచి కరువు నిధులు పూర్తి స్థాయిలో రాలేదన్న నాయిని
హైదరాబాద్
కేంద్ర నుంచి కరవు నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రాలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. కరవు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో దత్తాత్రేయకు ఎలా తెలుస్తుందని, ఆయన ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాడని ఎద్దేవా చేశారు. సోమవారం మంత్రి నాయిని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. తాను రాజ్యసభలో రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగించినంత కాలం ఉంటానని, అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు.
ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో జరగనున్న టీఆర్‌ఎస్ 15న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి 500 మందికి పైగా ప్రజాప్రతినిధులు వెళ్లనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని వివరించారు. సీఎం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.