సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 సదస్సును ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇదే ప్రాంగణలోన టీ- ఎయిర్ సమ్మిట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్‌నెట్, రోబోటిక్స్‌పై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment