- కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువే
- ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామన్న మంత్రి నాయిని
హైదరాబాద్
రాష్ట్రంలో కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ఇక్కడ తెలిపారు.
‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగనే ఉంటుంది. మేడే సందర్భంగా ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరు లోగా తీపి కబురు వింటారు’’ అని నాయిని వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంత్రి నాయిని ముఖ్య అథితిగా పాల్గొన్నారు.