కార్మిక సంక్షేమానికి కృషి | Home Minister is in the may day celebrations | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమానికి కృషి

Published Wed, May 2 2018 2:28 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Home Minister is in the may day celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, అందు కోసం అహర్నిశలు పని చేస్తుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. యాజ మాన్యం– కార్మికుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడితే ఆర్థిక వృద్ధిని సాధిం చవచ్చన్నారు. మంగళవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని రవీంద్రభారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అని అన్నారు.

రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రూ. 10 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో కార్మికులు చనిపోతే రూ. 2 లక్షలే ఇచ్చేవారని, ప్రస్తుతం రూ. 6 లక్షలు ఇస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశాంక్‌ గోయెల్‌ అన్నారు. కార్మికులకు న్యాయం జరగాలన్న తలంపుతో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగం, వేతనం, సామాజిక భద్రత విషయంలో కార్మికులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

2020 నాటికి భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక శాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీమ్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొలుత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం 8 మందికి అత్యుత్తమ యాజమాన్య అవార్డులు, 30 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్‌ డైరెక్టర్‌ కె.వై.నాయక్, ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, మినిమం వేజస్‌ చైర్మన్‌ జేసీఎల్‌ చంద్రశేఖర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.

అవార్డులు అందుకుంది వీరే: జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ లిమిటెడ్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, టాటా కాఫీ లిమిటెడ్, యశోద హాస్పిటల్, ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, మైలాన్‌ ల్యాబోరేటరీస్‌ లిమిటెడ్, ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement