Minimum wage
-
విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు
సాక్షి, అమరావతి: విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ రేపు(శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. ఈ నెల 20వ తేదీ, శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు. చదవండి: వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే.. -
కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త. ఆ దేశంలో పని చేసే భారత కార్మికులకు కనీస వేతనంగా నెలకు వంద దినార్లు అంటే మన కరెన్సీలో రూ.24,700 ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం)కు అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. కువైట్‌లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన ఆంశంపై అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల కార్మిక శాఖలతో చర్చలు జరిపింది. ప్రధానంగా భారత్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌ల కార్మిక శాఖలతో కువైట్ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ మేరకు భారత వలస కార్మికులకు కనీస వేతనంగా రూ.24,700 చెల్లించాలనే ప్రతిపాదన సిద్ధమైంది. గతంలో కనీస వేతనంగా నెలకు 45 దినార్లు చెల్లించాలని విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో కార్మికులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా కరోనా కష్టాల సమయంలో కువైట్.. వలస కార్మికులకు కనీస వేతనం పెంచే విషయంపై ఆలోచన చేయడం హర్షణీయమని కార్మికులు అంటున్నారు. (క్లిక్: ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం) 60 ఏళ్లు నిండిన కార్మికులకు ఊరట.. 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపాలన్న నిర్ణయంపై కువైట్ వెనక్కు తగ్గింది. డిగ్రీ అర్హత లేదా 60 ఏళ్లు దాటినవారి వీసాలు, వర్క్పర్మిట్లను కొంతకాలం రెన్యూవల్ చేయలేదు. దీంతో నిపుణులైన కార్మికులు డిగ్రీ పట్టా లేక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులకు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిగ్రీ పట్టా లేనివారి నుంచి 250 దినార్లను ఫీజుగా వసూలు చేసి వర్క్పర్మిట్లను రెన్యూవల్ చేస్తోంది. (క్లిక్: అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్) -
గల్ఫ్ వలస కార్మికులకు ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికుల కనీస వేతనం (మినిమమ్ రెఫరల్ వేజెస్) కుదింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంది. ఈ విషయంలో గల్ఫ్ దేశాలకు జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వల్ల గల్ఫ్ వలస కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, వారి శ్రమకు తగ్గ వేతనం దక్కడం లేదని గల్ఫ్ జేఏసీ సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పాత వేతనాలనే భారత కార్మికులకు వర్తింప చేయాలని గల్ఫ్ దేశాలకు సూచించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం గతంలో జారీ చేసిన సర్క్యుల ర్ను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. వలస కార్మికులకు ఎప్పుడైనా వేతనాలు పెంచే విధంగానే విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలి. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు -
ఖతర్‌లో కనీస వేతన పరిమితి పెంపు
మోర్తాడ్(బాల్కొండ): విదేశీ వలస కార్మికుల కష్టాలను గుర్తించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచుతూ కొత్త చట్టం రూపొందిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రతి కంపెనీ వలస కార్మికులకు నెలకు వెయ్యి రియాళ్ల కనీస వేతనం (మన కరెన్సీలో రూ.20 వేలు) చెల్లించడంతో పాటు భోజనం, వసతి కోసం మరో ఎనిమిది వందల రియాళ్లు ఇవ్వాలని ఖతర్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక శాఖ జారీ చేసింది. ప్రస్తుతం ఖతర్‌లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికులకు నెలకు 500 రియాళ్ల నుంచి 700 రియాళ్ల వరకు వేతనం చెలిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ క్యాంపులలో కార్మికులకు వసతి కల్పిస్తుండగా మరి కొన్ని కంపెనీలు మాత్రం కార్మికుల వసతి, ఇతర సదుపాయాల గురించి పట్టించుకోవడంలేదు. కాగా, వలస కార్మికులకు తక్కువ వేతనం చెల్లించడం వల్ల వారి శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచింది. 2020 ఆగస్టులోనే కనీస వేతన పరిమితి పెంచిన ఖతర్ ప్రభుత్వం, ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఈనెల 20 నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు ఆయా కంపెనీలు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తే ప్రతి నెలా వెయ్యి రియాళ్ల కనీస వేతనం చెల్లించాలి. ఒక వేళ వసతి, భోజన సదుపాయాలను కల్పించకపోతే అదనంగా 800 రియాళ్లను చెల్లించాలని ఖతర్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఖతర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కొన్ని కంపెనీలు అమలులోకి తీసుకువచ్చాయి. కాగా ఇప్పటి వరకు కనీస వేతన పరిమితిని అమలు చేయని కంపెనీలు ఈనెల 20 నుంచి కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కనీస వేతన పరిమితిని పెంచుతూ ఖతర్ ప్రభుత్వం చట్టం రూపొందించడం వల్ల వలస కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: పది నెలలుగా ఇంటి కూరగాయలే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేస్తోంది.. -
ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : వారు తల్లికాని తల్లులు. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మలు. పాఠాలు చెప్పే పంతులమ్మలు. వారే అంగన్వాడి కార్యకర్తలు. పట్టణ ప్రాంతాల్లో ఏమోగానీ పల్లె ప్రాంతాల్లో వారంటే తెలియని వారు ఎవరుండరు. పిల్లలకు వేలకింత ముద్ద పడేయలేని, వారిని బడికి పంపలేని, కూలి నాలి చేసుకొని బతికే పేద ప్రజలు ఎంతో మంది తమ పిల్లలను అంగన్వాడిలో వదిలేసి వెళతారు. వారందరికి ఆపద్బంధువు అంగన్వాడి కార్యకర్తలే. సకాలంలో నిధులు అందకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం సజావుగా అమలవుతుందంటే అది వారి సామాజిక సేవా దృక్పథం, వృత్తి పట్ల వారికున్న అంకిత భావం కారణం. వారు నెలవారిగా అందుకునే గౌరవ వేతనం అతి తక్కువే అయినా, అదీ రెండు, మూడు నెలలకోసారి అందుతున్నా వారిలో అంకిత భావం చెక్కు చెదరడంలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నెలవారిగా రావాల్సిన రేషన్ సరుకులు ఆర్నెళ్లకోసారో, ఏడాదికోసారో వచ్చినా సర్దుకుపోతున్నా, చేతి నుంచి డబ్బులు ఖర్చుపెట్టి పేద పిల్లలకు పౌష్టికాహారం సకాలంలో సరఫరా చేస్తున్న సామాజిక కార్యకర్తలు వారు. ఒక్కో అంగన్వాడి కార్యకర్త 25 నుంచి 30 మంది పేద పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వారందరికి పౌష్టికాహారం అందించడంతోపాటు వారిలో ఎవరికి జబ్బు చేసినా సమీపంలోని సర్కారు దవఖానాకు స్వయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే. అద్దె తక్కువగా ఉండాలి కనుక చిట్టి గదిలోనో, చీకటి కొట్టులోనో, రేకుల షెడ్డులోనో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తాయి. ముంబైలోని ధారవి మురికి వాడలో కూడా 50 చదరపు మీటర్ల ఓ చిట్టి గదిలో ‘శివశక్తి చావల్ అంగన్వాడి’ని రేఖా భాగ్లే నిర్వహిస్తున్నారు. ఆమెకు హేమా కదమ్ సహాయకారి (హెల్పర్)గా పనిచేస్తోంది. ఆ గది అద్దె నెలకు 750 రూపాయలు. సమగ్ర శిశు అభివద్ధి కింద వారు అనేక విధులను నిర్వహించాల్సి ఉంటుంది. శిశువులకు, గర్భవతులకు పౌష్టికాహార పొట్లాలను పంచాలి. వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆదివాసీ మహిళలకు పిల్లల పోషణ గురించి వివరించి చెప్పాలి. గర్భవతి స్త్రీలతోపాటు ఆరేళ్ల లోపు పిల్లలకు వేడి వేడి అన్నం వండి వడ్డించాలి. 25 నుంచి 30 మంది పిల్లలకు ప్రాథమిక విద్యను బోధించాలి. శివశక్తి చావల్ అంగన్వాడికి ఉదయం పదింటికల్లా 25 నుంచి 30 మంది పిల్లలు వస్తారు. వారు సాయంత్రం మూడున్నర గంటలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రేఖా భాగ్లే, హేమా కదమ్‌లు బండెడు రిజిస్టర్లు రాయడానికి రోజూ రెండు, మూడు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంటికెళుతూ తమ ప్రాంతంలోని పేద గర్భవతి స్త్రీల ఆరోగ్యం గురించి వాకబు చేసి వెళతారు. అంగన్వాడి కార్యకర్తగా రేఖా భాగ్లేకు నెలకు ఏడు వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తుండగా, హెల్పర్ హేమకు నెలకు మూడున్నర వేల రూపాయలు లభిస్తుంది. ఈ ఏడు వేల రూపాయల్లో కేంద్రం మూడు వేల రూపాయలను కనీస గౌరవ వేతనంగా నిర్దేశించింది. అందులో కేంద్రం 60 శాతం వేతనాన్ని భరిస్తుండగా రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. కేంద్రం నిర్దేశించిన కనీస వేతనానికి మించి చెల్లించే రాష్ట్రాలు ఆ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంగన్వాడీలకు కేంద్రం నిర్దేశించిన కనీస గౌరవ వేతనం మూడు వేల రూపాయలను, నాలుగున్నర వేల రూపాయలను పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చాలా గొప్పగా ప్రకటించారు. పెంచిన సొమ్మును కూడా అక్టోబర్ నెల నుంచే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దష్ట్యా ప్రకటించారు. అయితే మోదీ ప్రకటన రేఖా భాగ్లే లాంటి అంగన్వాడీలను ఏమాత్రం ఆకట్టులేక పోయింది. కేంద్ర ఏడవ వేతన సంఘం నిర్ధేశించిన కనీస కార్మిక వేతనం 18 వేల రూపాయలను తమకు కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా అంగన్వాడీలకు భిన్న గౌరవ వేతనాలు ఉన్నాయి. హర్యానాలో నెలకు 11,400 రూపాయలు, తెలంగాణలో 10,500 రూపాయలు, కేరళ 10,000 రూపాయలు చెల్లిస్తుండగా, అన్ని రాష్ట్రాలకన్నా తక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4,000 రూపాయలను చెల్లిస్తోంది. చిల్లర డబ్బులను పెంచడం కన్నా హర్యానా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం 11,400 రూపాయలను అన్ని రాష్ట్రాలకు వర్తింపచేసి ఉండాల్సిందని అభిల భారత అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధూ వ్యాఖ్యానించారు. ఈ సంఘం సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తోంది. కనీస వేతనాన్ని నెలకు 18వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఐదవ తేదీన ఢిల్లీలో నిర్వహించిన ‘కిసాన్ మజ్దూర్ సంఘర్శ్ ర్యాలీలో’ లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28 లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలుంటే 11 లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ‘అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్ (ఏఎస్హెచ్ఏ)’ను ఆశాగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఓ ప్రసవం చేసినందుకు 200 రూపాయలు, శిశువుకు టీకా వేయించినందుకు వంద రూపాయల చొప్పున ఆశా కార్యర్తలకు రాయితీగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను మోదీ రెండింతలు చేశారు. -
రూ.22 వేలు ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంపై ఉద్యోగ సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)కు ప్రతిపాదనలను అందజేశాయి. కొద్దిపాటి తేడాతో అన్ని సంఘాలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందులో కింది స్థాయి ఉద్యోగుల నుంచి మొదలయ్యే మాస్టర్ స్కేల్లో కనీస మూల వేతనం రూ.22 వేలుగా నిర్ణయించాలని కొన్ని సంఘాలు పేర్కొంటే, రూ.23 వేలు ఉండాలని, రూ.24 వేలుగా నిర్ణయించాలని మరికొన్ని సంఘాలు ప్రతిపాదించాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 150 వరకు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు తెలంగాణ మొదటి పే రివిజన్ కమిషన్‌కు తమ ప్రతిపాదనలను అందజేశాయి. గురువారంతో సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ గడువు ముగిసింది. ఒక్క గురువారమే దాదాపు 40 సంఘాల ప్రతినిధులు సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యులు మహ్మద్ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావులను కలసి తమ ప్రతిపాదనలను అందజేశారు. అలాగే శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వేతన వివరాలను కూడా ఆయా శాఖలు పీఆర్సీ కమిషన్‌కు పంపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల ప్రస్తుత ఆదాయం, పెరిగిన ఖర్చుల ప్రకారం కనీస వేతనంపై తమ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు అందజేశాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, రాజేందర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, బాపురావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, పీఆర్టీయూ, టీటీఎఫ్, టీఎస్టీయూ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘాలు ప్రత్యేకంగా తమ ప్రతిపాదనలను అందజేశాయి. ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయమే రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. కనీస మూల వేతనంలో ఒకటీ రెండు వేల రూపాయల తేడాతో ప్రతిపాదనలు మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో ఏకాభిప్రాయమే వ్యక్తం చేశాయి. ఉద్యోగుల కనీస మూల వేతనం రూ. 22 వేల నుంచి మొదలుకొని గరిష్ట వేతనం రూ. 2.19 లక్షలుగా ఉండాలని ప్రతిపాదించాయి. అలాగే ఇప్పటికిప్పుడు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి. తాము శాస్త్రీయ అంచనాల ప్రకారమే 63 శాతం ఫిట్మెంట్ కోరుతున్నామని, పెరిగిన నిత్యావసరాల ప్రకారం ఆ మేరకు ఇవ్వాలని ప్రతిపాదించాయి. మిగిలిందల్లా అధ్యయనమే ఆగస్టు 15వ తేదీ నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే పీఆర్సీ చర్యలు చేపడుతోంది. సంఘాలు, శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారంతో ప్రతిపాదనల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను చేపట్టి, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కమిషన్ భావిస్తోంది. సీపీఎస్ సంఘాల ప్రత్యేక విజ్ఞప్తులు ఉద్యోగ సంఘాలు వేతన స్కేళ్లపై ప్రతిపాదనలు అందజేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ సంఘాలు మాత్రం ఒకే అంశంపై తమ ప్రతిపాదనలను అందజేశాయి. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ గత నాలుగేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పెన్షన్లపై పెట్టే ఖర్చు 5 శాతానికి మించడం లేదని పేర్కొన్నారు. పైగా అది తగ్గుతూ వస్తోందని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు పాత పెన్షన్ విధానం లేకపోవడం వల్ల కుటుంబ పెన్షన్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, లోన్ సదుపాయం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మరో సీపీఎస్ సంఘం నాయకుడు కమలాకర్ పేర్కొన్నారు. గత పీఆర్సీ కంటే ఎక్కువ లేకపోతే ఎలా? తెలంగాణ రాష్ట్రంలో వేసిన మొదటి పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పదో పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా.. ఇపుడు అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పదో పీఆర్సీ అమలు సమయంలో 63.344 శాతం డీఏ ఉండగా, అప్పట్లో ఐఆర్ 27 శాతంగా ఉంది. అప్పటి డీఏ కలుపుకొని రూపొందించిన స్కేళ్లపై ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2017 జూలై నాటికి డీఏ 25.676 శాతంగా ఉండగా, 2018 జనవరిలో రావాల్సిన డీఏ కలిపితే 28.016 శాతం అవుతుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు 30 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిట్మెంట్ గతంలో కంటే ఎక్కువ ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు గత పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.13,000గా, గరిష్ట మూల వేతనం 1.10,850 ఉంది కాబట్టి కొత్త పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.22 వేలుగా, గరిష్ట మూలవేతనం 2.19 లక్షలతో మాస్టర్ స్కేల్‌ను నిర్ధారించాలని కోరుతున్నాయి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను ప్రస్తుతం ఉన్న 6/12/18/24 ఏళ్ల విధానాన్ని 5/10/15/20/25 ఏళ్లకు కుదించాలని కోరాయి. -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి
-
నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి
సాక్షి, అమరావతి: ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై నోరు పారేసుకున్నారు. నాకే ఎదురు చెప్తారా అంటూ రంకెలు వేశారు. ‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి’... తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్‌ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని గర్జించారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేం: కేఈ దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని అలాగే కన్సాలిడేటెడ్ పే ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టిక్కెట్‌పై 25 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో నెలకు ప్రతి క్షురకుడికి రూ. 25 వేలు వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెప్పారు. 25 రూపాయలకు అంగీకరించిన వారు ఎంతమంది వస్తే అంతమందితో పని చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ భారాన్ని దేవాలయాలే భరిస్తాయన్నారు. సమ్మె విరమించి భక్తుల మనోభావాలను కాపాడేలా నాయీ బ్రాహ్మణులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: కన్నా నాయీ బ్రాహ్మణుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసన దీక్షలను సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. నాయీ బ్రాహ్మణుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. -
మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను సవరించాలన్న విజ్ఞప్తులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. పిటిషనర్లు తిరిగి ఆయా రాష్ట్రాలకు వారం రోజుల్లోగా వినతిపత్రాలు సమర్పించాలని.. వాటిని అందుకున్న మూడు నెలల్లోగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇరు రాష్ట్రాల కార్మికశాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కనీస వేతనాలను సవరించడం లేదంటూ ఇరు రాష్ట్రాల నుంచి వేర్వేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) హైకోర్టు మంగళవారం విచారించింది. ఏపీ నుంచి ఆ రాష్ట్ర మల్టిపుల్ కాంట్రాక్టర్స్ లేబర్ యూనియన్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పావువెల్లి జీవన్రావులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. కనీస వేతనాలను ప్రతి రెండేళ్లకోసారి సవరించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1975లో, 1995లో జీవోలు జారీ చేసిందని.. కానీ ఇప్పటివరకు ఆ జీవోలు అమలు కాలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కాగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కనీస వేతన సవరణలు చేయాలని పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వాదించారు. కానీ దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. కార్మికుల సంక్షేమం కోసం పిల్ దాఖలు చేయవచ్చని ఇంతకుముందే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. -
ఖతార్ కీలక నిర్ణయం : భారతీయులకు గుడ్‌న్యూస్
దోహ : వరల్డ్ కప్ 2022ను నిర్వహించబోతున్న ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వనున్నట్టు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇదివరకే ఖతార్‌ను హెచ్చరించింది. కార్మికుల హక్కుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నవంబర్‌లోగా చెప్పాలని గడువు విధించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ)తో సమావేశం ఏర్పాటు కావడం కంటే ఒక్కరోజు ముందస్తుగానే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో పొట్టకూటి కోసం ఖతార్‌కు వెళ్లిన భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ఖతార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ కాన్ఫడరేషన్(ఐసీటీయూ) స్వాగతించింది. కనీస వేతన ఒప్పందాలను విదేశీ అధికారుల సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూయిమి ప్రకటించారు. ఈ కనీస వేతనం కార్మికుల కనీస అవసరాలను సమకూర్చేలా నిర్ణయించామని మంత్రి తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఈ కనీస వేతనాన్ని అమలు చేయనున్నారో మంత్రి తెలుపలేదు. ఖతార్‌లో వలస కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ దశాబ్దాలుగా 'ఖఫాలా' అనే కార్మిక విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం వలస కార్మికులెవరైనా ఉద్యోగం మానేయాలంటే ముందు యజమాని అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, దేశం వదిలి వెళ్లాలన్నా యజమాని పర్మిషన్ తప్పనిసరి. అయితే, గతేడాది డిసెంబర్లో 'ఖఫాలా' విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. -
‘కనీస వేతనం’పై సలహా బోర్డు: కార్మిక శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ధారించడానికి సలహా బోర్డును నియమించనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ‘జాతీయ కనీస వేతనాన్ని నిర్ధారించడానికి కేంద్రం సలహా బోర్డును ఏర్పాటుచేస్తుంది. అవసరాలు, నైపుణ్యాలు, ఉద్యోగ స్వభావం తదితరాల ఆధారంగా ఒక్కో రంగం, ప్రాంతంలో ఒక్కోలా కనీస వేతనాలు నిర్ణయిస్తాం’ అని కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్కే గుప్తా చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు జాతీయ కనీస వేతనాలను ప్రకటించలేదని, ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని అన్నారు. అది మీ పాపమే కదా.! -
‘కనీస వేతన బిల్లు’కు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కనీస వేతనాల చట్టం–1948, వేతనాల చెల్లింపు చట్టం–1936, బోనస్ చెల్లింపు చట్టం–1965, సమాన వేతనాల చట్టం–1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకు మించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
‘హెచ్–1బీ’ వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచండి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల మీద అమెరికాకు పనిచేయడానికి వచ్చే ఉద్యోగుల కనీస వేతనాన్ని 80 వేల డాలర్లకు పెంచాలని ఆ దేశ కార్మిక మంత్రి అలెగ్జాండర్ అకోస్టా సెనేట్ కమిటీకి విన్నవించారు. ప్రస్తుతం వారి కనీస వేతనం 60 వేల డాలర్లు కాగా, ఇది చాలా కాలం క్రితం నిర్ణయించిన పరిమితి అనీ, ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడే అమెరికన్ల నిరుద్యోగ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూపడానికి వీలవుతుందని అన్నారు. హెచ్–1బీ కింద ఇచ్చే సగానికిపైగా వీసాలు భారత్‌లోని రెండు ఔట్సోర్సింగ్ కంపెనీలకే వెళ్తున్నాయని సెనేటర్ రిచర్డ్ డర్బిన్ పేర్కొన్నారు. ఇటీవల షికాగోలోని ఓ ఔషధ కంపెనీ ఏళ్ల తరబడి పనిచేస్తున్న 150 మంది అమెరికా జాతీయులను ఉద్యోగాల్లోం చి తీసేసి భారత ఐటీ నిపుణులను నియమించుకుందని డర్బిన్ కమిటీకి చెప్పారు. సన్నిహితులుంటేనే అమెరికా వీసా ఆరు ముస్లిం ప్రధాన దేశాల పౌరులు అమెరికా వీసాకు దరఖాస్తుచేసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గురువారం నుంచే ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. వీసా కోరే అన్ని దేశాల శరణార్థులు, ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోని వ్యక్తులు లేదా సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని వాటిలో పేర్కొన్నారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ల నుంచి వచ్చే వారికి అమెరికాలో తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, కోడలు, అల్లుడు, తోబుట్టువు ఇలా ఎవరో ఒకరు సన్నిహితమైన సంబంధమున్న వారు ఉండాలి. -
త్వరలో అమల్లోకి ‘కనీస వేతనం’!
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న అన్ని రకాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సార్వత్రిక కనీస వేతనం అందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. శ్రామికులకు లాభసాటిగా ఉండేలా వేతనాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ముసాయిదాను రూపొందించిందని ఓ అధికారి పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ ముసాయిదాను ఇప్పటికే ఆమోదించి మార్పులు, చేర్పుల కోసం న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిందని ఆయన చెప్పారు. ఈ నెలలోనే ముసాయిదాను మంత్రివర్గం ముందుకు తీసుకొస్తారనీ, ఆమోదం పొందిన అనంతరం త్వరలో ప్రారంభంకానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారని అధికారి వివరించారు. ప్రస్తుతం కనీస వేతన నిబంధనలు రూ.18 వేల లోపు జీతం అందుకునే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్నాయి. జీతంతో సంబంధం లేకుండా కార్మికులందరికీ కనీస వేతన నిబంధనలు వర్తించేలా ముసాయిదాలో పేర్కొన్నారు. -
పొట్ట నింపని ‘ఉపాధి’
► పనులు చేసినా గిట్టుబాటుకాని కూలి ►సగటు వేతనం రూ.116 మాత్రమే ►ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి.. ►కొన్ని చోట్ల రోజు కూలి రూ.50 లోపే! ►వలసలే శరణ్యమంటున్న కూలీలు కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో కూలీలకు ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకం వారి కడుపు మాడుస్తోంది. మండే ఎండల్లో.. కాలే కడుపులతో పనులు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. గట్టిపడిన నేలలో చేతులు బొబ్బలు ఎక్కేలా పని చేస్తున్నా గిట్టుబాటు కూలి అందడం లేదు. ప్రభుత్వం కనీస వేతనం రూ.194 ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కొందరు కూలీలకు వారం రోజులు పని చేసినా రూ.500 కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 30 శాతం అలవెన్స్‌గా ఇస్తున్నా కూలీల జీవనోపాధి కష్టంగా మారుతోంది. అందువల్లే వలసలు అనివార్యంగా మారాయి. – అనంతపురం టౌన్ అనంతపురం టౌన్: జిల్లాలో 7,77,830 జాబ్‌కార్డులు జారీ చేశారు. 48,243 శ్రమశక్తి సంఘాల్లో 7,68,709 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కూలి మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.13 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మామూలు రోజుల్లో చేసినట్లుగా వేసవిలో ఉపాధి పనులను కూలీలు చేయలేరు. ఎండవేడిమికి కూలి గిట్టుబాటు కాక పూటగడవని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వేసవిలో అదనపు కూలిని ముందుగానే ప్రకటించింది. ఉపాధి కింద రోజువారీ వేతనం రూ.194 ఉండగా అదనపు కూలి కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్/మే నెలల్లో 30 శాతం అందించారు. ఇక జూన్‌లో 20 శాతం అందించనున్నారు. అంటే ఒక్క రోజు కూలి కింద రూ. 235 నుంచి రూ.280 వరకు రావాల్సి ఉంది. అయితే చాలా గ్రామాల్లో గిట్టుబాటు కూలి అందడం లేదు. గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఈనెల 1వ తేదీ(గురువారం) ఏకంగా ఉపాధి పనులనే బహిష్కరించారు. ఇక్కడ సగటున రోజు కూలి రూ.50లోపే వస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా సగటు వేతనం రూ.116 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధి పనులకు కోసం వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బెంగళూరు, తమిళనాడు, తెలంగాణకు వలస వెళ్లారు. గత ఏడాది అధికారులు కేవలం సేద్యపు కుంటలతోనే నెట్టుకు వచ్చారు. ఈ ఏడాది ఇతర పనులు కూడా కల్పిస్తామని చెబుతున్నా కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కొలతల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. చేతులు బొబ్బలెక్కుతున్నాయ్ డగౌట్ పాండ్స్ పనులు చేస్తున్నాం. పైన ఒక అడుగు వరకు మెత్తగా వచ్చినా ఆ తర్వాత గునపం దింపాలంటే కష్టమే. చేతులు బొబ్బలెక్కుతున్నాయి. పోనీ చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందా అంటే అదీ లేదు. ఆరు రోజులకు గాను రూ.300లోపే కూలి పడింది. పేరుకే వేసవి అలవెన్సులు. మా కష్టానికి తగ్గ గిట్టుబాటు కూలి రావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పనులకు వెళ్లేది లేదు. వలసలే శరణ్యం. – తిప్పేస్వామి, ఉపాధి కూలీ, కలుగోడు ఆరు రోజులు చేస్తే రూ.280 ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నా... అందరితో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నా. చాలా మంది కూలీలు ఆరు రోజులు పనులు చేస్తే రూ.260 నుంచి రూ.280లోపే పడింది. రోజుకు సగటున రూ.50 లోపు కూలి వస్తే ఎలా బతకాలి? ప్రభుత్వం చెప్పేదొకటి.. ఇక్కడ జరుగుతుందొకటి. ఈ విషయంపై అధికారులతో చర్చించినా ఫలితం లేదు. అందుకే గురువారం (ఈనెల 1న) అందరం కలిసి ఉపాధి పనులను బహిష్కరించాం. గిట్టుబాటు కూలి, మెత్తటి నేలలో పనులిస్తేనే ఉపాధికి వెళ్తాం. – టి.సుకన్య, కలుగోడు ఎంపీటీసీ సభ్యురాలు, గుమ్మఘట్ట మండలం -
అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం
ఆలయాల ఉద్యోగులకు కూడా... - ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు - గ్రామాల్లో రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10–12 వేల వరకు - ఆలయ నిధులు సరిపోకుంటే ప్రభుత్వ గ్రాంటుతో భర్తీ - మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలను మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలుగా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతి పాదించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల అంశంపై ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యం లో నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ప్రభుత్వానికి ప్రతి పాదనలు సమర్పించింది. మంగళవారం తుది దఫా భేటీ అయి ప్రభుత్వానికి మరిన్ని సిఫార్సులు చేయనుంది. చాలా కాలంగా ఎదురుచూపులు తగిన ఆదాయం లేని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు ప్రస్తుతం నామమా త్రపు వేతనాలే అందుతున్నాయి. దాంతో తమ జీవనం దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో.. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ సబ్ కమిటీ అర్చకులు, ఉద్యోగులు, దేవా దాయశాఖ అధికారులతో పలు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే దేవాలయాల్లోనూ కనీస వేతనాలు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. అయితే ఓ పద్ధతంటూ లేకుండా, అర్హతలేమీ పట్టించుకోకుండా పాలక మండళ్లే అర్చకులు, ఉద్యోగుల నియామకాలు చేస్తున్నందున.. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ గుర్తించిన ఆలయాలకే కనీస వేతనాలను పరిమితం చేశారు. 3,300 మందికి లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,500 వరకు ఆల యాలు ఉన్నాయి. వాటిలో కనీస వార్షికా దాయం రూ.50 వేలు, ఆపైన ఉన్న ఆలయా లుగా దేవాదాయశాఖ గుర్తించినవి 650 వరకు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ఈవోలు, క్లర్కులను నియమించి పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయాలన్నింటిలో కలిపి 6 వేల మంది అర్చకులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2,700 మంది ఎక్కువ ఆదాయమున్న ఆలయాల్లో నిర్ధారిత స్కేల్‌కు సమంగా వేతనాలు పొందుతున్నారు. మిగతా 3,300 మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో తాత్కాలిక పద్ధతిలో (రోజుకు మూడు నాలుగు గంటల పాటు) పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రూ.8 వేలు... పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.10 వేలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక పట్టణ ప్రాంతా ల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.12 వేలు చొప్పున చెల్లించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం వీరందరి వేతనాల కింద ఆయా దేవాలయాలు రూ.28 కోట్లు చెల్లిస్తున్నాయి. ఇప్పుడా మొత్తం సుమారు రూ.68 కోట్లకు పెరగనుంది. అంటే మిగతా రూ.40 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇచ్చే నిధి నుంచి చెల్లిస్తారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లిం చాలనే విషయాన్ని దేవాదాయ శాఖ త్వరలో సర్వే చేసి నిర్ధారిస్తుంది. మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ కొత్తగా మరో 1,200 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కిందకు తేవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ పథకం కింద ఆ ఆలయాలకు నెలకు రూ.6 వేలు చొప్పున అందజేస్తారు. ప్రస్తుతం 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇక ఆలయాల భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని.. అన్ని ఆలయాల కైంకర్యాల వివరాలను భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక నుంచి కమిషనర్ అనుమతి లేకుండా ఆలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకుండా నిబంధన తీసుకురావాలని, వారసత్వ అర్చక నియామకాలను చట్ట ప్రకారం చేపట్టాలని, సిటీ సివిల్ కోర్టు ఇచ్చే డిక్రీ తరహాలో దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ప్రతిపాదించింది. ఆలయాల్లో ఖాళీల భర్తీ, వీలైనంత త్వరలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలని సూచించింది. అర్చకులు, ఉద్యోగుల హర్షం ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలన్న మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలాకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఇక మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు మంత్రులను కలసి హర్షం వ్యక్తం చేశారు. -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం
రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రాన్ని కోరిన కాప్సీ, ఐఐఎస్‌ఎస్‌ఎం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవారికి కనీస వేతనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కేంద్రాన్ని ‘ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కాప్సీ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ, సెఫ్టీ మేనేజ్మెంట్(ఐఐఎస్‌ఎస్‌ఎం)లు కోరాయి. ఈ మేరకు కాప్సీ ప్రతినిధులు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘అభినందన్ సమారోహ్’ కార్యక్రమంలో కాప్సీ అధ్యక్షులు వి. విశ్వనాథ్, కాప్సీ, ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ కున్వర్ విక్రంసింగ్ తదితరులు దత్తాత్రేయను సత్కరించారు. కార్యక్రమంలో ఐఐఎస్‌ఎస్‌ఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎంపీ అయిన ఆర్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం 10,500కు పెంచండి
గ్రామ పంచాయతీ, సర్పంచ్ల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.10,500లకు పెంచాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చక్రధర్, సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి చెల్లాపురం వెంకట్ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అటవీశాఖ మంత్రి జోగు రామన్నను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో కరెంట్, వీధిలైట్లు, రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరపాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. -
కనీస వేతనం ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రోజులు గడుస్తున్నా కనీస వేతనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కార్మికులు నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన రూ. 10 వేల కనీస వేతనం కంటే కాస్త ఎక్కువగానే రాష్ట్రంలో ఉండేలా చూస్తామని ‘మే డే’ సందర్భంగా రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. దీన్ని జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రకటిస్తామని చెప్పారు. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు కనీస వేతన అంశాన్ని వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం కనీస వేతనం కింద చాలా వాటిల్లో రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నైపుణ్య రహిత కార్మికులకు కనీస వేతనం రూ. 10 వేలకు పైగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. అందుకు అనుగుణంగా రూ. 10,700 ఉండేలా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ భావించింది. ఈ నిర్ణయం వెలువడితే దాదాపు రాష్ట్రంలో 4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. -
కార్మికుల శ్రమను సర్కారు దోచుకుంటోంది
కనీస వేతనాన్ని రూ.18వేలు చేస్తూ చట్టాన్ని తేవాలి: సీఐటీయూ సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లు, యాజమాన్యాలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ విమర్శించింది. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.18వేలు ఇచ్చేలా తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విజయవాడలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే కార్మికుల సమస్యలపై ప్రవేశపెట్టిన 28 తీర్మానాలకు మహాసభ ఆమోదం తెలిపింది. అనంతరం సీఐటీయూ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మీడియాతో మాట్లాడుతూ.. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడంతో కార్మికులు ప్రతి నెలా రూ.వేల కోట్లు నష్టపోతున్నారని మండిపడ్డారు. కనీస వేతన అమలుపై జూలై నెలాఖరున కలెక్టరేట్లను దిగ్భంధించనున్నట్లు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సి.హెచ్ నర్సింగరావు మాట్లాడుతూ..కనీస వేతన సలహా సంఘాన్ని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. -
వేతనాల బొనాంజా
ఏడో వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం 23.5 శాతం పెరగనున్న జీతభత్యాలు - కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి - 2016 జనవరి 1 నుంచే వర్తింపు.. ఈ ఏడాదిలోనే బకాయిల చెల్లింపు - ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల భారం - ఇకపై కనీస వేతనం రూ.18 వేలు. గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు - అలవెన్సుల్లో కోతలపై నిర్ణయం పెండింగ్ - వేతనాలు బాగానే పెంచాం: అరుణ్‌జైట్లీ - ఏ మూలకూ సరిపోవు: ఉద్యోగ సంఘాలు.. సమ్మె చేస్తామనిహెచ్చరిక న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏడో వేతన సంఘం సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తమ్మీద జీతభత్యాలు 23.5 శాతం మేర పెరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే సిఫారసులను అమలు చేయనున్నారు. అప్పట్నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ఈ ఏడాదిలోనే చెల్లించనున్నారు. వేతన సంఘం సిఫారసుల అమలుతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరగబోయే వేతనాలతో ప్రభుత్వ ఖజానాపై 2016-17లో 1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.65 శాతం) భారం పడనుంది. ఇందులో వేతనాల వాటా రూ.39,100 కోట్లు, పెన్షన్ల వాటా రూ.33,700 కోట్లు ఉండనుంది. అలవెన్సుల రూపంలో ఖజానాపై అదనంగా రూ.29,300 కోట్ల భారం పడనుంది. ఆరో వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై అదనంగా పడిన భారం జీడీపీలో 0.77 శాతంగా నమోదైంది. ఇప్పుడు అది 0.7 శాతంగా ఉంటుందని అంచనా. కేంద్రం ప్రతీ పదేళ్లకు వేతన సంఘాన్ని నియమిస్తుంది. కనీస వేతనం రూ.18 వేలు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుంది. ప్రస్తుతం రూ.7 వేల కనీస వేతనం ఉండగా.. దాన్ని రూ.18 వేలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసు ఆమోదం పొందింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గరిష్ట వేతనాన్ని రూ.2.5 లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం కేబినెట్ కార్యదర్శి నెలకు రూ.90 వేల (గరిష్ట వేతనం) వేతనం అందుకుంటున్నారు. వేతన సంఘం సిఫారసులతో ఈ మొత్తం రూ.2.5 లక్షలకు పెరగనుంది. గతేడాది నవంబర్లోనే జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉద్యోగుల మూలవేతనంలో సగటున 14.27 శాతం పెంచాలని సిపారసు చేసింది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత 70 ఏళ్లలో వేతనాలు ఇంత తక్కువగా ఎన్నడూ పెంచలేదంటూ మండిపడ్డాయి. 14.27 శాతానికి ఇతర అలవెన్సులు కలపడంతో మొత్తంగా పెంపు 23.55 శాతానికి చేరింది. దీనికి బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. అలవెన్సుల్లో కోతలపై చేసిన కొన్ని సిఫారసులను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. వీటిపై ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలన జరుపుతోంది. వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై పడే అదన పు భారంలో రూ.60,608 కోట్లను వార్షిక బడ్జెట్ నుంచి తీసుకోనున్నారు. మరో రూ.24,325 కోట్లను రైల్వే బడ్జెట్ నుంచి ఖర్చుచేయనున్నారు. వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయి ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయని ఆర్థికమంత్రిజైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేతనాలు, పెన్షన్లపై వేతన సంఘం చేసిన దాదాపు అన్ని సిఫారసులను ఆమోదించినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచే పెరిగిన వేతనాలు ఇస్తామని, బకాయిలను ఇదే ఏడాదిలో చెల్లిస్తామన్నారు. వేతనభారంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందన్న భయాలేవీ లేవని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేతనాల పెంపుతో మార్కెట్లోకి డబ్బు వస్తుందని, అందులో పన్నుల రూపంలో కొంత మొత్తం మళ్లీ ప్రభుత్వానికే చేరుతుందన్నారు. అయితే ద్రవ్యోల్బణంపై మాత్రం ఒత్తిడి ఉంటుందంటూ మున్ముందు ధరల పెరుగుదల తప్పకపోవచ్చన్న సంకేతాలిచ్చారు. ఏడో వేతన సంఘం సిఫారసులతో తలెత్తే లోటుపాట్లను సరిచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పెంపు చాలదు : కాంగ్రెస్ వేతనాల పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ పెంపు అల్పమని విమర్శించింది. ‘‘ చాలీచాలని పెంపుతో కేంద్రం ఉద్యోగులను మోసగించింది. ఇది వారిలో నిరుత్సాహానికి దారితీస్తుంది. ’’ అని కాంగ్రెస్ దుయ్యబట్టింది. 98 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని, గత ఏడు దశాబ్దాల్లో ఈ పెంపు అత్యల్పం అని పేర్కొంది. వేటిని ఆమోదించారు.. వేటిని పక్కనపెట్టారు? ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం రూ.7.5 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునేందుకు వీలుంది. ఈ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసుకు ఆమోదం లభించింది. ► ఉద్యోగుల స్థాయిని బట్టి గ్రూప్ ఇన్సూరెన్స కోసం వారి వేతనంలో రూ.1,500-రూ.5 వేలు కోత పెట్టాల న్న ప్రతిపాదనను పక్కనపెట్టారు. ► ఏటా ఇస్తున్న 3 శాతం ఇంక్రిమెంట్‌ను యథాతథంగా ఉంచారు. ► వైద్య చికిత్స కోసం ఇచ్చే వడ్డీలేని అడ్వాన్సులు, ట్రావెల్ అలవెన్స్, ఎల్టీసీలు కూడా ఎప్పట్లాగే కొనసాగుతాయి. ఇతర వడ్డీ లేని అడ్వాన్సు లను రద్దు చేశారు. ► రక్షణ దళాలతోపాటు ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. డీఏ 50 శాతం పెరిగిన ప్రతీసారి ఈ గ్రాట్యుటీ 25 శాతం మేర పెరుగుతుంది. ► ఉద్యోగులు విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబీకులు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో రూ.10లక్షలు-రూ.20 లక్షలు ఉంది. దాన్ని రూ.25 లక్షలు-రూ.45 లక్షలకు పెంచారు. ► ఉద్యోగుల స్థాయిని ప్రస్తుతం గ్రేడ్ పే ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఇకపై పే మ్యాటిక్స్ ్రఆధారంగా నిర్ణయిస్తారు. అలవెన్సుల కోతపై ఏంచేస్తారో? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మొత్తంగా 196 రకాల అలవెన్సులు ఇస్తున్నారు. వాటిలో 53 అలవెన్సులను రద్దు చేయాలని వేతన సంఘం సిఫారసు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. అప్పటిదాకా అలవెన్సులు ప్రస్తుత రేట్ల ప్రకారమే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందా? వేతన సంఘం సిఫారసుల అమలుతో వస్తు వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మార్కెట్లోకి ఒక్కసారిగా అదనంగా డబ్బు వచ్చి పడడం, ద్రవ్య చలామణి పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. సమ్మె చేస్తాం: ఉద్యోగ సంఘాల హెచ్చరిక వేతన సంఘం సిఫారసులు పెరిగిపోయిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా లేవని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే సవరణ చేసి వేతనాలను మరింత పెంచాలని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చేనెల 8న దేశవ్యాప్త ఆందోళలు చేస్తామని ప్రకటించింది. పెంపుపై పునఃసమీక్ష చేయకుంటే వచ్చేనెల 11న తలపెట్టిన నిరవధిక సమ్మెను వారం ముందు నుంచే ప్రారంభిస్తామని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.దురైపాండియన్ హెచ్చరించారు. అంతకుముందు సమాఖ్య ఆధ్వర్యంలో చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం రాజాజీ భవన్ ముందు ధర్నా చేశారు. -
మేడే నాడు తీపి కబురు
- కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువే - ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామన్న మంత్రి నాయిని హైదరాబాద్ రాష్ట్రంలో కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ఇక్కడ తెలిపారు. ‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగనే ఉంటుంది. మేడే సందర్భంగా ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరు లోగా తీపి కబురు వింటారు’’ అని నాయిని వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంత్రి నాయిని ముఖ్య అథితిగా పాల్గొన్నారు. -
2022 నుంచి గంటకు వెయ్యిరూపాయల జీతం!
లాస్ ఎంజెల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు అమాంతం పెరగనున్నాయి. గంటకు కనీసం చెల్లించాల్సిన మొత్తాన్ని పదిహేను డాలర్లు చెల్లించాలని నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీలో గంటకు రూ.994 అన్నమాట. అంటే ఇంచుమించూ వెయ్యి రూపాయలు. దీనిని 2022 నుంచి అమలు చేయాలని చట్ట ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో గంటకు పది డాలర్లు చెల్లిస్తున్నారు. మస్సాచుస్సెట్స్లో కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా మొత్తంలో కూడా అత్యధిక జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లిస్తున్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం విశేషం. ఈ బిల్లును గురువారం రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశ పెట్టగా 26మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 12 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు చట్టంగా ఏప్రిల్ 4న గవర్నర్ సంతకంతో రూపొందనుంది. -
కనీస వేతనాల కోసం ధర్నా చేయడం తప్పా!
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏపీ గోపాలమిత్రల సంఘం డిమాండ్ విజయవాడలో భారీ ర్యాలీ విజయవాడ (గాంధీనగర్) : కనీస వేతనం రూ.13 వేలు ఇవ్వాలని గోపాలమిత్రల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు బీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గోపాలమిత్రల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు గోపాలమిత్రలను నియమించినా ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. వీరికి ప్రభుత్వం నామమాత్రపు వేతనం చెల్లిస్తోందని తెలిపారు. టార్గెట్లతో జీతంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీలతో గోపాలమిత్రల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన గోపాలమిత్రలను వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, గోపాలమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
- ఏపీ సాక్స్ కార్యాలయం, కలెక్టరేట్ల ముట్టడి - కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని ఏపీ సాక్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ నలుమూల నుంచి వందలాదిగా ఆశవర్కర్లు వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ర్ట నాయకురాలు కె.నిర్మల మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆశ వర్కర్లలకు వెట్టిచాకిరీ ఉండదని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు విస్మరించారన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆశ నోడల్ అధికారి జనార్దన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే ఆశా కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలివచ్చి ప్రవేశద్వారాల వద్ద బైఠాయించారు.ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో పలువురు ఆశవర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద ముగ్గురు వర్కర్లు కిందపడిపోయారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆశవర్కర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
'కనీస వేతనం అమలు చేయాలి'
వరంగల్ జిల్లా : కనీస వేతనం అమలు చేయాలంటూ ఆరోగ్యశ్రీ సిబ్బంది శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్కు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, వివేక్ తదితరులు మద్దతు తెలిపారు. -
ఫేస్ బుక్ కీలక నిర్ణయం
న్యూయార్క్: తమ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కరుణ చూపింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్న అత్యధిక మంది కాంట్రాక్టు కార్మికులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజం చేకూరనుంది. తాజా నిర్ణయం ప్రకారం గంటకు సుమారు రూ.1000 కనీస వేతనం లభిస్తుంది. ఏడాదికి 15 వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇక ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. ప్రత్యేకంగా తమ సంస్థ తరపున అమెరికాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఫేస్ బుక్ వెల్లడించింది. విశాల దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ప్రకటించామని ఫేస్ బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు పోత్సాహకాలు ప్రకటిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫలితంగా పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. మహిళలతో పాటు పురుషులకు పెరేంటల్ లీవు ఇస్తామని ప్రకటించడం విశేషం. -
కలెక్టరేట్ ముట్టడి
నేటి నుంచి అంగన్వాడీ వర్కర్ల సమ్మె చిత్తూరు (సెంట్రల్) : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో తాము ఆందోళన బాట పట్టాల్సివచ్చిందన్నారు. కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, వర్కర్‌కు లక్ష రూపాయలు, హెల్పర్‌కు 50వేల రూపాయలకు తగ్గకుండా గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగాను, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఐసీడీఎస్‌లో స్వచ్ఛంద, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల జోక్యం ఉండరాదని, ప్రభుత్వమే అంగన్వాడీ కేంద్రాలను నడపాలన డిమాండ్ చేశారు. మినీఅంగన్వాడీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను బీఎల్వో డ్యూటీల నుంచి మినహాయించాలన్నారు. అన్న అమృతహస్తం పథకంలో ఈవోల జోక్యం తొలగించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు, కట్టెల బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, వేసవి సెలవులను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజిని అధ్యక్షత వహించగా, సీఐటీయూ చిత్తూరు డివిజన్ కార్యదర్శి గణపతి, నాయకులు సురేంద్రన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు శైలజ తదితరులు కలెక్టరేట్లోని కార్యాలయ పరిపాలనాధికారి ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. నేటి నుంచి సమ్మెలోకి... రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజిని తెలిపారు. -
కోర్టు తీర్పు ప్రజా విజయం
కొత్తవలస, న్యూస్‌లైన్ : మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ సామాజిక భవనంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, కార్మిక సంఘ నాయకులు ఎం. గోపాలం, కె. సన్యాసిరావు మాట్లాడుతూ, కొత్తవలస మేజర్‌పంచాయతీ పరిధిలోని చింతలదిమ్మసమీపంలో ఉన్న ఉమాజూట్ ప్రొడక్టు కర్మాగారంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ వర్కర్స్ యూనియన్ జూట్ మిల్లు ను కొత్తగా ఏర్పాటు చేశారన్నారు. ఈ మిల్లులో పనిచేస్తున్న ఏడుగురు మహిళా కార్మికుల జీతంలో యాజ మాన్యం కోత విధించిందని తెలిపారు. 2010 అక్టోబర్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు లక్షా 43 వేల 774 రూపాయలు కోత విధించడంపై కోర్టు నాశ్రయించినట్లు చెప్పారు. దీంతో వాదోపవాదాలు తర్వాత కోత విధించిన సొమ్ముకు రెట్టింపు కార్మికులకు అందజేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. కార్మికుల శ్రమను దోచుకోవడానికి చూసిన ఏ యాజమాన్యానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు డి.శ్రీనివాస్, సీహెచ్.లక్ష్మి, లెంక శ్రీనివాస్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
టీచర్లకు కనీసం రూ. 24,810 చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు కనీస వేతనంగా రూ. 24,810 చెల్లించాలని పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) కమిషనర్ అగర్వాల్‌కు యూటీఎఫ్ ప్రతిపాదించింది. సచివాలయంలో కమిషనర్‌ను యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, వెంకటేశ్వర్రావు గురువారం కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఉన్నత పాఠశాలలకు అసిస్టెంట్ హెడ్మాస్టర్ పోస్టులను, మండలాలకు అసిస్టెంట్ ఎంఈఓ పోస్టులను ఇవ్వాలని కోరారు. ప్రధానోపాధ్యాయులతో సమానంగా ఎంఈఓలకు పేస్కేలు చెల్లింపు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలన్నారు. ఫిట్మెంట్ బెనిఫిట్ 60 శాతం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉపాధ్యాయుల స్కేళ్లు నాలుగు రకాలుగా అమలు చేయాలని సూచించారు. ఎస్జీటీలకు కనీస వేతనం రూ. 24,810, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 33,480, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రూ. 35,880, అసిస్టెంట్ ఎంఈఓలకు, హై స్కూల్ హెడ్మాస్టర్లకు రూ. 35,880 కనీస వేతనాన్ని సిఫారసు చేయాలని కోరారు. వేతనంతో కూడిన సెలవులివ్వాలి: పీఆర్టీయూ-టి కుటుంబ సభ్యుల కర్మకాండలు 11 రోజుల పాటు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని రోజులూ వేతనంతో కూడిన సెలవులను ఇచ్చేలా సిఫారసు చేయాలని పదో పీఆర్సీ కమిషనర్ అగర్వాల్‌కు తెలంగాణ పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హర్షవర్ధన్‌రెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు పీఆర్సీ కమిషనర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. కుటుంబీకులు చనిపోయినప్పుడు కర్మకాండలు చేసే వారు 11 రోజులపాటు బయటకు వెళ్లే పరిస్థితి లేనందున వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఆర్జిత సెలవులను 20 పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2013 జూన్ నుంచే అమలు చేయాలి: ఏపీటీఎఫ్ పదో పీఆర్సీ సిఫారసు చేసే నూతన వేతన సవరణ ఆర్థిక లబ్ధిని 2013 జూన్ నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్సీ కమిషనర్‌కు ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘురామిరెడ్డి, పాండురంగవరప్రసాద్ తదితరులు ఈమేరకు పీఆర్సీ కమిషనర్‌కు ప్రతిపాదనలను అందజేశారు. ఇంక్రిమెంట్ రేటు 3 శాతం ఉండాలని కోరారు. ఇంటి అద్దె అలవెన్సు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 40 శాతం చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో 30 శాతం ఇవ్వాలని కోరారు. 14.5 శాతం చెల్లిస్తున్న పట్టణాల్లో 25 శాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజప్తి చేశారు. ఇతర గ్రామాలు, పట్టణాల్లో 20 శాతం ఇచ్చేలా సిఫారసు చేయాలన్నారు.