
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం
రాష్ట్రాలను ఆదేశించాలని కేంద్రాన్ని కోరిన కాప్సీ, ఐఐఎస్‌ఎస్‌ఎం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవారికి కనీస వేతనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కేంద్రాన్ని ‘ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కాప్సీ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ, సెఫ్టీ మేనేజ్‌మెంట్(ఐఐఎస్‌ఎస్‌ఎం)లు కోరాయి. ఈ మేరకు కాప్సీ ప్రతినిధులు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఢిల్లీలో నిర్వహించిన ‘అభినందన్ సమారోహ్’ కార్యక్రమంలో కాప్సీ అధ్యక్షులు వి. విశ్వనాథ్, కాప్సీ, ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ కున్వర్ విక్రంసింగ్ తదితరులు దత్తాత్రేయను సత్కరించారు. కార్యక్రమంలో ఐఐఎస్‌ఎస్‌ఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎంపీ అయిన ఆర్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు.