
ప్రతీకాత్మక చిత్రం
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికుల కనీస వేతనం (మినిమమ్ రెఫరల్ వేజెస్) కుదింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంది. ఈ విషయంలో గల్ఫ్ దేశాలకు జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వల్ల గల్ఫ్ వలస కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, వారి శ్రమకు తగ్గ వేతనం దక్కడం లేదని గల్ఫ్ జేఏసీ సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పాత వేతనాలనే భారత కార్మికులకు వర్తింప చేయాలని గల్ఫ్ దేశాలకు సూచించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు.
కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
కేంద్రం గతంలో జారీ చేసిన సర్క్యుల ర్‌ను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. వలస కార్మికులకు ఎప్పుడైనా వేతనాలు పెంచే విధంగానే విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలి.
– మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment