
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ధారించడానికి సలహా బోర్డును నియమించనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ‘జాతీయ కనీస వేతనాన్ని నిర్ధారించడానికి కేంద్రం సలహా బోర్డును ఏర్పాటుచేస్తుంది. అవసరాలు, నైపుణ్యాలు, ఉద్యోగ స్వభావం తదితరాల ఆధారంగా ఒక్కో రంగం, ప్రాంతంలో ఒక్కోలా కనీస వేతనాలు నిర్ణయిస్తాం’ అని కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్కే గుప్తా చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు జాతీయ కనీస వేతనాలను ప్రకటించలేదని, ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని అన్నారు.
అది మీ పాపమే కదా.!