సాక్షి, హైదరాబాద్: రోజులు గడుస్తున్నా కనీస వేతనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కార్మికులు నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన రూ. 10 వేల కనీస వేతనం కంటే కాస్త ఎక్కువగానే రాష్ట్రంలో ఉండేలా చూస్తామని ‘మే డే’ సందర్భంగా రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. దీన్ని జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రకటిస్తామని చెప్పారు. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు కనీస వేతన అంశాన్ని వాయిదా వేస్తున్నారు.
ప్రస్తుతం కనీస వేతనం కింద చాలా వాటిల్లో రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నైపుణ్య రహిత కార్మికులకు కనీస వేతనం రూ. 10 వేలకు పైగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. అందుకు అనుగుణంగా రూ. 10,700 ఉండేలా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ భావించింది. ఈ నిర్ణయం వెలువడితే దాదాపు రాష్ట్రంలో 4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
కనీస వేతనం ఇంకెప్పుడు?
Published Wed, Oct 5 2016 12:08 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement