ఫేస్ బుక్ కీలక నిర్ణయం
న్యూయార్క్: తమ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కరుణ చూపింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్న అత్యధిక మంది కాంట్రాక్టు కార్మికులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజం చేకూరనుంది.
తాజా నిర్ణయం ప్రకారం గంటకు సుమారు రూ.1000 కనీస వేతనం లభిస్తుంది. ఏడాదికి 15 వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇక ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. ప్రత్యేకంగా తమ సంస్థ తరపున అమెరికాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఫేస్ బుక్ వెల్లడించింది.
విశాల దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ప్రకటించామని ఫేస్ బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు పోత్సాహకాలు ప్రకటిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫలితంగా పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. మహిళలతో పాటు పురుషులకు పెరేంటల్ లీవు ఇస్తామని ప్రకటించడం విశేషం.