ఫియాన్సికి ఫేస్‌బుక్‌ సీఓఓ భావోద్వేగ లేఖ | Facebook COO Sheryl Sandberg Thanks Fiance Tom Bernthal | Sakshi
Sakshi News home page

‘నా భర్త తర్వాత అంత ప్రేమను పంచింది నువ్వే టామ్‌’

Published Fri, Feb 26 2021 1:26 PM | Last Updated on Fri, Feb 26 2021 2:13 PM

Facebook COO Sheryl Sandberg Thanks Fiance Tom Bernthal - Sakshi

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ రెండో అత్యున్నత అధికారి షెరిల్‌ శాండ్‌బర్గ్‌ తన కాబోయే భర్త టామ్ బెర్న్తాల్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మొదటి భర్త చనిపోయిన బాధలో ఉన్న తనకు తోడుగా నిలిచి.. తన జీవితంలో మరో సారి ప్రేమను వికసింపజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు షెరిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘2015లో నా భర్త డేవ్‌ చనిపోయారు. దాంతో నా ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. డేవ్‌ నన్ను ఎంతో ప్రేమించాడు. నా జీవితంలో అంతలా ప్రేమించే వ్యక్తిని మళ్లి కలుస్తానని అనుకోలేదు. కానీ డేవ్‌ సోదరుడు రాబ్‌ నా గురించి చాలా ఆలోచించాడు. దానిలో భాగంగానే తన స్నేహితుడు టామ్‌ బెర్న్తాల్‌ని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది’’ అన్నారు. 

‘‘డేవ్‌ని కోల్పోయి బాధపడుతున్న నన్ను టామ్‌ ఓదార్చాడు. నాకు ధైర్యం చెప్పాడు. డేవ్‌ నన్ను ఎంతలా ప్రేమించేవాడో.. టామ్‌ అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచాడు. టామ్‌తో కలిసి ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. తన ప్రేమ నాలో ఉన్న పాత ఆలోచనల్ని తప్పని నిరూపించింది. మనల్ని ప్రేమించిన వారు దూరమైతే బాధపడటం సహజం. కానీ వారి కన్నా అధికంగా ప్రేమించే వారు తారసపడితే.. వారితో ముందుకు సాగడం ఎంతో ఉత్తమం. వారి ప్రేమ మన సంతోషాల్ని తిరిగి తెస్తుంది. నా విషయంలో ఇదే జరిగింది. రెండు కుటుంబాల ఆమోదంతో మేం కొత్త మార్గంలో ముందుకు సాగనున్నాం. ఈ దారి కృతజ్ఞతలు, ఆశవాదంతో నిండింది. జీవితంలో ప్రేమించిన వారిని కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన వారిలో ఈ లెటర్‌ నమ్మకం నింపుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

తన బహిరంగ లేఖలో షెరిల్‌ శాండ్‌బర్గ్ తన కాబోయే భర్త టామ్‌కు గల అనేక మంచి లక్షణాలను వివరించారు. భాగస్వామిగా, తన బిడ్డలకు మంచి తండ్రిగా ఉంటాడని తెలిపారు. తన పిల్లల జీవితాలలో పాలుపంచుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. "నిజం, నువ్వు నా జీవితంలోకి రాక ముందు నేను చాలా అలసిపోయాను టామ్... కానీ నిన్ను కలిశాక మనం ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాము" అంటూ రాసుకొచ్చారు. మొదటి భర్తను కోల్పోయిన బాధ తన హృదయంలో అలాగే ఉంటుందని ఒప్పుకున్నారు షెరిల్‌. "మీకు నా బాధ తెలుసు, మీరు దానిని అర్థం చేసుకుని, గౌరవించారు. ఈ విషయం మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేసింది" అన్నారు షెరిల్‌.  

ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అయిన షెరిల్‌ శాండ్‌బర్గ్‌, టామ్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గతేడాదే ప్రకటించారు. టామ్‌ బెర్న్తాల్‌ మార్కెటింగ్ సంస్థ కెల్టన్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 

చదవండి: 
సోషల్‌మీడియాకు భారీ షాక్‌! కొత్త నిబంధనలు
ఫేస్‌బుక్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement