సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ శుక్రవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా వేదికపైన ఆటపాటలతో కళాకారులు, ప్లీనరీకి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. పార్టీ ప్లీనరీకి అనుకున్నట్లుగానే వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీ ప్రాంగణమంతా అంతా గులాబీమయం అయింది. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేదికపైకి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు.
ప్లీనరీకి సుమారు 2 వేల పోలీసులతో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారులపై నిఘా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్లీనరీకి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. ప్లీనరీ ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment