హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ముహుర్తం కుదిరినట్లు లేదు. ప్లీనరీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. అక్టోబరు 18, 19 తేదీల్లో జరగాల్సిన ప్లీనరీ సమావేశాలను పార్టీ నాయకత్వం వాయిదా వేసింది. ప్లీనరీని ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు కూడా ప్లీనరీ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా దీపావళి తర్వాత ప్లీనరీ జరగనున్నట్లు సమాచారం. ప్లీనరీ తేదీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ప్లీనర్ మరోసారి వాయిదా
Published Tue, Oct 14 2014 12:32 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement