18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ | TRS plenary at lb stadium on october 18th | Sakshi
Sakshi News home page

18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ

Published Thu, Oct 9 2014 9:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

TRS plenary at lb stadium on october 18th

హైదరాబాద్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడింది.  ఈనెల 11, 12 తేదీల్లో  నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను 18, 19వ తేదీలకు వాయిదా వేసింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాయిదా పడిన ప్లీనరీ ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో , 19న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ జరగనుంది. తుపాన్ నేపథ్యంలో హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున ప్లీనరీ వాయిదా వేస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా దీపావళి తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement