
సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అధికారుల నియామకం తర్వాతే మిగతా పదవులను భర్తీ చేస్తామని చెప్పినట్టు తెలిసింది.
ఏప్రిల్ లో బహిరంగ నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతున్నట్టు సమాచారం. అంతకుముందు అక్టోబరు 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలనుకున్నా హుద్ హుద్ తుఫాన్ హెచ్చరికల కారణంగా వాయిదా వేశారు.