మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం
హైదరాబాద్: ఈనెల 11, 12న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ, పరేడ్స్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో 4 వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
బడ్జెట్ తర్వాత హైదరాబాద్ లోని ఉండనని, ప్రజల మధ్యలోనే ఉంటానని వెల్లడించారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందించకపోతే మళ్లీ ఓట్లు అడగనని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.