సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వేలోని 20 ప్రధాన స్టేషన్‌లలో ఈ బృందాలను రంగంలోకి దించింది. –సాధారణంగా మహిళలు ఒంటరిగా దూరప్రయాణాలు చేయవలసి వచ్చి నప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పి0చే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చినట్లు ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్ లేఅవుట్‌పైన అవగాహన కల్పి స్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు.
ఏయే స్టేషన్లలో ఈ సేవలంటే...
సికింద్రాబాద్ డివిజన్‌లో 5 స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్‌లో 2, విజయవాడలో 4, గుంతకల్‌లో 4, గుంటూరులో ఒక స్టేషన్, నాందేడ్‌లో 4 స్టేషన్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. 2 నుంచి 24 మంది సభ్యుల బృందానికిమహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 15 రైళ్లతో పాటు, ఇతర జోన్‌లకు చెందిన మరో 35 రైళ్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సహేలీ సేవలను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment