Women passenger in train
-
ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలి’
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వేలోని 20 ప్రధాన స్టేషన్లలో ఈ బృందాలను రంగంలోకి దించింది. –సాధారణంగా మహిళలు ఒంటరిగా దూరప్రయాణాలు చేయవలసి వచ్చి నప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పి0చే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చినట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్ లేఅవుట్పైన అవగాహన కల్పి స్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు. ఏయే స్టేషన్లలో ఈ సేవలంటే... సికింద్రాబాద్ డివిజన్లో 5 స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్లో 2, విజయవాడలో 4, గుంతకల్లో 4, గుంటూరులో ఒక స్టేషన్, నాందేడ్లో 4 స్టేషన్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. 2 నుంచి 24 మంది సభ్యుల బృందానికిమహిళా సబ్ ఇన్స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 15 రైళ్లతో పాటు, ఇతర జోన్లకు చెందిన మరో 35 రైళ్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సహేలీ సేవలను ప్రశంసించారు. -
రైళ్లలో మహిళా పటాలం
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం త్వరలో మహిళా పోలీసులు రంగంలోకి దిగనున్నారు. రైల్వే రక్షక దళం మహిళా బెటాలియన్(పటాలం)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం లోక్సభలో వెల్లడించారు. వేధింపులపై మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల కార్యకలాపాలను గమనించేందుకు రైళ్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరోవైపు, రైళ్లలో ప్రయాణికులకు కనీస వసతులు కూడా లేవని ఆ శాఖ అంగీకరించింది. దూర ప్రాంత రైళ్లు కొన్నింటిలో నాణ్యతలేమి ఆహారం సరఫరాపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, బొద్దింకలు, లైట్లు వెలగకపోవడం, ఆహారం తదితర వసతులకు సంబంధించి 2012 ఏప్రిల్ నుంచి 2014 అక్టోబర్ మధ్య 5,670 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమాచారం కుప్లంగా.. - ఉద్యోగుల భవిష్యనిధి లావాదేవీల్లో ఆధార్ నెంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలేదని కార్మిక మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు. ళీఉపాధీ హామీ కూలీలకు నిధుల చెల్లింపుల్లో పోస్టాఫీసుల్లో దళారుల పాత్ర తమ దృష్టికి వచ్చిందదని, దీని నివారించేందుకు ఏపీ, తెలంగాణ, జార్ఖండ్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిపాదించామని కేంద్రం పేర్కొంది. - దేశంలో 24 శాతం గృహాలు సురక్షితం కాని మంచినీటితో కాలం వెళ్లదీస్తున్నాయని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు.