టీఆర్‌ఎస్ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్లీనరీకి ట్రాక్టర్లలో జనం తరలింపు ఏమిటని ప్రశ్నించారు. ఈ సభ నేపథ్యంలో ప్రతి పక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్ చెయ్యడం ఏం ప్రజాస్వామ్యమని నిలదీశారు.
ఉస్మానియా యూనివర్సిటీ లో పూర్వ విద్యార్థులుగా తమకు కనీసం ఆహ్వానం పంపలేదని ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అక్కడ చదువుకున్న ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. సభలో సీఎం, గవర్నర్ మాట్లాడకపోవడం అందరికీ అవమానకరమని తెలిపారు.