
రేపు టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నామినేషన్ వేయనున్నారు. ఆదివారం ఉదయం కేసీఆర్ తరఫున మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి కోసం శుక్రవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనం కానుంది.