trs president
-
Hyderabad: గ్రేటర్ టీఆర్ఎస్ సారథి ఎవరో.. రేసులో ఆ ఇద్దరు!
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తికి మరో వారం రోజులు పట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా ఈ పదవిని దక్కించుకునేందుకు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎంఎన్ శ్రీనివాస్, సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పీఎల్ శ్రీనివాస్ రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కాకుండా కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో తెరపైకి మరో కొత్త నేతపేరు కూడా అనూహ్యంగా ముందుకొచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..సెప్టెంబరు 30 లోగా గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లు, బస్తీల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించినప్పటికీ మొత్తంగా 50 శాతమే ఎంపిక పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు పలు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, అధిష్టానం నియమించిన దూతలు, కార్పొరేటర్లు, ముఖ్యనేతల మధ్య సయోధ్య కరువవడంతోనే ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్‌నగర్ నియోజకవర్గంతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలిసింది. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య ఎంపిక ప్రక్రియ కొత్త వివాదాలకు తావిస్తోంది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం కేటీఆర్ ఆదేశించినా...ఆలస్యం.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈనెలాఖరులోగా ఎట్టిపరిస్థితుల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఆదిశగా పనిచేయకపోవడం పార్టీలో సమన్వయ రాహిత్యం తేటతెల్లమౌతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. మరోమారు కేటీఆర్ జోక్యంతోనే కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా దసరాలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య సయోధ్య లేకపోవడమే ఈ ప్రక్రియ ఆలస్యానికి ప్రధాన కారణమని సుస్పష్టమౌతోంది. -
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడికి సీఎం కేసీఆర్ ప్రశంస
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరవడమే కాకుండా ఆ సమావేశాల సారాంశాన్ని పలువురికి తెలియజెప్పాలనే ప్రయత్నం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల రచించిన పుస్తకాన్ని శనివారం ప్రగతి భవన్లో కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో `తెలుగు భాష ప్రాచీనత- తెలంగాణ తెలుగు సౌరభాలు` గురించి ఎంపీ కవిత ఉపన్యాసించారు. ఈ కీలక ప్రసంగాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో నాగేందర్ రెడ్డి పుస్తక రూపం ఇచ్చారు. శనివారం ఎన్నారైలతో జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటుగా ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై నాగేందర్ రెడ్డి కాసర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. -
టీఆర్ఎస్ దళపతి కేసీఆర్
⇔ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎనిమిదోసారి ఎన్నిక ⇔ ప్లీనరీలో జయజయధ్వానాలు.. అభినందనలు తెలిపిన నేతలు ⇔ అందరికీ ధన్యవాదాలు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా ఎనిమిదోసారి గులాబీ దళపతిగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్లో ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి పార్టీ అధ్యక్ష ఎన్నికపై ప్రకటన చేశారు. అందరూ కేసీఆర్ నాయకత్వమే కావాలని కోరుకున్నారని.. అందుకే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం కొంపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో టీఆర్ఎస్ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీలో సీనియర్ నేత, సెక్రెటరీ జనరల్ ఎంపీ కె.కేశవరావు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల జయజయధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. గులాబీ దళపతిగా తిరిగి పగ్గాలు అందుకున్న తమ అధినేత కేసీఆర్‌కు ముందుగా మంత్రులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు వేదికపైకి వెళ్లి అభినందనలు తెలిపారు. నేతల ఆత్మీయ పలకరింపులు, సెల్ఫీలతో సభాప్రాంగణమంతా కోలాహ లంగా మారింది. ప్లీనరీ వేదికపై మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతం పలకగా.. శాసన మండలి పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఎంపీ కె.కేశవరావు తొలి పలుకులు అందించే ప్రసంగం చేశారు. అనుమానాల్ని పటాపంచలు చేశాం: కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ అధినేత కేసీఆర్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘‘2001లో తెలంగాణలో దిక్కుతో చని స్థితిలో సమైక్య పాలకుల అహంకార పూరిత అవమానాలతో కుంగి కృశించి పోతున్న తరుణంలో గులాబీ జెండా ఎగిరిం ది. ఈ పార్టీ ఉంటుందా అని అందరికీ అను మానం ఉండేది. కానీ అన్ని అనుమానాల్ని పటాపంచలు చేసి తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసింది’’అని అన్నారు. ప్రతి గింజపై కేసీఆర్ పేరు: పల్లా ప్రతి బియ్యపు గింజపై తినేవాడి పేరుంటుం దనే నానుడిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తిరగరాశారని పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఇకపై తినే గింజపై రైతు పేరు.. రైతుకు అండగా నిలిచిన కేసీఆర్ పేరు ఉంటుందని అన్నారు. పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభించిం దని, ఈసారి 75 లక్షలకు చేరిన తీరు దేశంలోనే అద్వితీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పండు గలు, పబ్బాలు, బతుకమ్మలు, బోనాలన్నిం టినీ ఉద్యమ రూపంగా మలిచిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలకు ఆత్మీయ బంధువుగా నిలిచాడని అన్నారు. కారణజన్ముడు..: కేకే ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని, తెలంగాణలో నూతన శకానికి నాంది పలికిన నాయకుడని సీనియర్ నేత కేకే అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకా లను రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. ఆర్థిక లక్ష్య సాధనతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం తోనే పాలనకు సార్థకత వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. -
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
-
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. పన్నెండు సెట్ల నామినేషన్లు వచ్చాయని, అయితే అందరూ కేసీఆర్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారన్నారు. ఎన్నికలకు సహకరించిన అందరికీ నాయిని ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. కాగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసిఆర్ తిరిగి ఎన్నికయిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు కేసీఆర్ ఎన్నికతో మంత్రులు, ఎంపీలు తెలంగాణ భవన్లో మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీ సమావేశాలకు కొంపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికార పీఠాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడంతో ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి నివేదికను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్లీనరీ వేదికను ఉపయోగించుకోనున్నారు. -
నేడు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
-
రేపు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నామినేషన్ వేయనున్నారు. ఆదివారం ఉదయం కేసీఆర్ తరఫున మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం శుక్రవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనం కానుంది. -
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు
హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరిస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ దాకా నామినేషన్లను స్వీకరిస్తారు. 19 న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల అధికారి నాయిని నరసింహ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి , మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. -
గులాబీ బాస్ బేగ్..?
• రాజ ధానిలో సమావేశమైనఆ పార్టీ ప్రజా ప్రతినిధులు • జిల్లా అధ్యక్ష పదవితోపాటు ఒక్కో అసెంబ్లీ నుంచి ఐదుగురి పేర్లు ప్రతిపాదన • మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోసం బేగ్ ప్రయత్నాలు • రెండు, మూడు రోజుల్లో కొత్త కమిటీని ప్రకటించనున్న టీఆర్ఎస్ అధిష్టానం సాక్షి, ఖమ్మం: జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవి మరోసారి షేక్ బుడాన్‌బేగ్‌కే దక్కనుంది. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమై జిల్లా అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. అధ్యక్ష పదవికి బేగ్ సరైనవ్యక్తి అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు,మూడు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుడితోపాటు జిల్లాకమిటీలో ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని కూడా మారుస్తారనే ప్రచారం జరిగింది.షేక్ బుడాన్‌బేగ్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన పనితీరు పట్ల అధిష్టానంతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు సంతృప్తిగా ఉన్నారు. దీంతో మరోసారి కూడా ఆయన్నే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.బుడాన్‌బేగ్ మాత్రం మైనార్టీ కార్పొరేషన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పలువురు నాయకులను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగితే...మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రాదేమోననే ఆలోచనలో బేగ్ ఉన్నారని తెలుస్తోంది. అధ్యక్ష పదవికి అంగీకారం తెలుపుతూనే.. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. తొలుత అధ్యక్ష పదవి బేగ్‌కు ఇచ్చిన తర్వాత.. మైనార్టీ కార్పొరేషన్ విషయం చర్చిద్దామని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అరుుతే బేగ్‌కు మైనార్టీ కార్పొరేషన్ ఇస్తే.. అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా ప్రాథమికంగా ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం. జిల్లా కమిటీలో అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు కలిపి మొత్తంగా 24 మంది ఉండనున్నారు. మొత్తంగా ఒక్కో నియోజకవర్గం నుంచి సమ ప్రాతిపదికన కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. -
'60 ఏళ్ల యువకుడు కేసీఆర్'
-
'60 ఏళ్ల యువకుడు కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 60 ఏళ్ల వయసులో కూడా యువకుడిగా పని చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి తారక రామారావు అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ గురించి కేటీఆర్ 'సాక్షి' మీడియాతో మంగళవారం మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే తామందరూ పని చేస్తున్నామని, అధ్యక్ష పదవికి ఆయనే సమర్థుడని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే సత్తా కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇప్పటికే వర్కింగ్‌లో ఉన్నారని.. ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అవసరం లేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని సాక్షితో కేటీఆర్ అన్నారు. -
అధినేత కేసీఆర్
టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవం 24న ప్లీన రీలో అధికారిక ప్రకటన పోటీ లేదని ప్రకటించిన మంత్రి నాయిని 27న పది లక్షల మందితో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు గడువు ముగిసే వరకు ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో కేసీఆర్ ఏకగ్రీవమయ్యారు. 24వ తేదీన జరగనున్న పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. కేసీఆర్ తరఫున పార్టీకి చెందిన నాయకులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రుల తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీల నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుల తరఫున నల్లగొండ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల పక్షాన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ల తరఫున ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్ కవిత, అడహాక్ కమిటీ నుంచి కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. ఇతర నేతలు ఆయన పేరును బలపరిచారు. గడువులోగా దాఖలైన నామినేషన్లను పరిశీలించామని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని మంత్రి నాయిని మీడియాతో చెప్పారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించుకునే విషయం అధినేత కేసీఆర్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ ఎదిగింద ని, అంతా కలసి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందని, కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించామని, వారందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మంత్రి నాయిని పేర్కొన్నారు. 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి రాజధాని నగరాన్ని గులాబీ మయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేం దర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
-
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవమే
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవమే కానుంది.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేసీఆర్ తరఫున మంత్రులు, ముఖ్య నేతలు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేనందున కేసీఆరే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పార్టీ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నాయి. గ్రేటర్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు.. ప్లీనరీ, బహిరంగసభపై పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సీనియర్ నేత కేకే నివాసంలో జరిగిన భేటీలో ప్లీనరీలో 11తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ నిర్వహించాల్సిన పాత్ర, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం, విశ్వనగరంగా హైదరాబాద్ సహా సంక్షేమ పథకాలపై తీర్మానాలు ఉంటాయి. ఎక్కువగా పార్టీ నేతలకే మాట్లాడే అవకాశమివ్వాలని నిర్ణయించారు. -
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన మంత్రులు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మంత్రులు సోమవారం నామినేషన్లు సమర్పించారు. ఈరోజు ఉదయం సీఎం కేసీఆర్ తరపున తెలంగాణ భవన్లో ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీ హరి, మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున నామినేషన్లు వేశారు. ఈనెల 21న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 23న గడువు విధించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం, పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పెద్దపల్లి ఎంపీ (టీఆర్ఎస్) బాల్క సుమన్ అన్నారు. -
టీఆర్ఎస్లో అంతర్గత ఎన్నికల హడావిడి.
-
నాయకత్వ లోపంవల్లే నష్టపోయాం
-
కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిశారు. తెలంగాణ పునర్నిర్మాణంలోను, విద్యుత్ సమస్యలను అధిగమించడంలోనూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా ప్రధాన కార్యాదర్శి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల విభజన నేపథ్యంలో అప్రమత్తంగా వుండి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో యూనియన్ నేతలు గోవింద్రావు, ఈశ్వరప్ప,లింగం, శ్రీనివాస్‌రావు, భగీరత్, శ్రీధర్ ఉన్నారు. -
‘గ్రేటర్’ గులాబీ దళపతి ఎవరో?
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య సాక్షి, హైదరాబాద్:‘గ్రేటర్’లో ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ వీడడంలేదు. ఈ పదవిలో కొనసాగిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రెండు నెలలు కావస్తున్నా ఈ పదవీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికీ కట్టబెట్టకపోవడంతో నగరంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఊపుతో ఉన్న గులాబీ దళం గ్రేటర్ పరిధిలోనూ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఉన్న ఆపార్టీ శ్రేణులు నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని పటిష్టం చేసేందుకు యువకుడు,సమర్థులైన వారికే ఈ పదవిని కేటాయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ పదవిపై కన్నేసిన పలువురు నాయకులు ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో పార్టీ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేష్, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహేందర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌కు చెందిన ఆళ్లకుంట హరి ముందున్నారు. మురుగేష్ వైపే అధిష్టానం మొగ్గు.. ఇప్పటికే గ్రేటర్ టీఆర్ఎస్ కార్యవర్గంలో చురుకుగా పనిచేస్తున్న అధికార ప్రతినిధి మురుగేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల అధినేత కేసీఆర్‌ను కలిసి తాను పార్టీ పటిష్టతకు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై వివరించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు సైతం ఆయనకే మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌తో అనుబంధం ఉన్న నాయకుడు, అందరికీ సుపరిచితుడైన వివాదరహితుడినే ఈ పదవికి ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల
నకిరేకల్, న్యూస్‌లైన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. నకిరేకల్‌లో టీఆ ర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నోముల నర్సింహయ్యకు ఆత్మీయసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో నర్సిం హయ్య మాట్లాడుతూ తాను పదవి కోసం సీపీఎంను వీడలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు టీవీ ఛానళ్లలో చర్చించిన సందర్భంగా సీపీఎం పెద్దలు తనకు నోటీసులు పంపారని, అందులో ఒకవర్గం తనను వేధింపులకు గురిచేయడంవల్ల పార్టీని వీడి తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్లో చేరానని వివరించారు. తనతోపాటు జిల్లాలో 6నుంచి 7 అసెంబ్లీ స్థానాలలో, 2 పార్లమెంట్ స్థానాలలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. నకిరేకల్ టీఆ ర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పూజర్ల శంభయ్య, నాయకులు సోమయాదగిరి, సిలివేరు ప్రభాకర్, మారం భిక్షంరెడ్డి, కనుకు సహాని, పన్నాల సావిత్రమ్మ, వీర్లపాటి రమేష్, బొజ్జ సుందర్, గార్లపాటి రవీందర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వివిధ మండల పార్టీ అద్యక్షులు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
-
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు విజయశాంతి, హరీష్‌రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సీబీఐ కోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. -
కేసీఆర్ రాక
20న జిల్లాలో సుడిగాలి పర్యటన తొమ్మిది నియోజకవర్గాల్లో సభలు ఒక్క చెన్నూరు మాత్రం మినహాయింపు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నారు. ఒక్క రోజులోనే తొమ్మిది నియోజకవర్గాలను చుట్టి వెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నిచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒక్క చెన్నూరు నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ మినహాయించడం గమనార్హం. అయితే సమయం సరిపోక పోవడంతోనే చెన్నూరు నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహించ లేకపోతున్నామని ఆ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ పర్యటన వివరాలను వెల్లడించారు.20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ ముథోల్ నియోజకవర్గంలోని భైంసా మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌కు చేరుకుని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈసభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3.40 గంటలకు ఆదిలాబాద్‌లోని డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఉట్నూర్‌కు చేరుకుని అక్కడ సాయంత్రం 4.40కి స్థానిక ఆర్టీసీ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు కాగజ్‌నగర్ చేరుకుని అక్కడి సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.40 గంటలకు ఆసిఫాబాద్‌లోని బాలికల పాఠశాల మైదానంలో జరుగనున్న సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బెల్లంపల్లి చేరుకుని తిలక్ స్టేడియంలో బహిరంగ సభను ముగించుకుంటారు. ఆ తర్వాత మంచిర్యాలకు చేరుకుని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో కార్యకర్తలను దిశా నిర్దేశం చేస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గురువారం అనుమతులు మంజూరు చేసింది. చెన్నూరు నియోజకవర్గంలోని కార్యకర్తలను, ప్రజలను మంచిర్యాల సభకు తరలించాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు.. అధినేత కేసీఆర్ పర్యటనల ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆ పార్టీ భావిస్తోంది. తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా జిల్లాలో ఒక్కసారి ఊపు తేవాలని యోచిస్తోంది. ఇప్పుటి వరకు ఆయా నియోజకవర్గాల ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, శ్రేణుల్లో ఆశించిన మేరకు ఉత్సాహం నింపలేకపోతున్నారు. పైగా ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడంతో ఒక్కరోజులోనే జిల్లా అంతటా చుట్టేయాలని నిర్ణయించారు. -
'సీనియర్లను డమ్మీలుగా మారుస్తున్న కేసీఆర్'
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై సుధాకర్ నిప్పులు చెరిగారు.ఆయన వైఖరిని సవాల్‌గా తీసుకుని పార్టీని వీడితున్నట్లు తెలిపారు.తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాకుండా కార్పొరేట్ స్థాయివాళ్లకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలోని సీనియర్లను కేసీఆర్ డమ్మీలుగా మారుస్తున్నారని విమర్శించారు.రానున్న ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.అయితే రానున్న ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగానైనా పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. -
కేసీఆర్... చేతికి వచ్చిన పంట నీదంటావా
తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని నీ పదవుల కోసం వాడుకుంటున్నావంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంతా తన వల్లే వచ్చిందని కేసీఆర్ ప్రచారం చేయడం పట్ల నాగం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరుగాలం కష్టపడిన వారిని వదిలేసి చేతికి వచ్చిన పంటను చూపించి అంతా తన కృషి ఫలితమే అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధించే క్రమంలో రాజకీయ ప్రక్రియలో నీ భాగస్వామ్యం ఎంత అంటూ కేసీఆర్‌ను నాగం ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ అక్కడ లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటు కేసీఆర్‌పై ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ప్రజలుకు ఏం చేశావంటు కేసీఆర్‌పై నాగం ఎదురు దాడికి దిగారు.