
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన మంత్రులు
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మంత్రులు సోమవారం నామినేషన్లు సమర్పించారు.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మంత్రులు సోమవారం నామినేషన్లు సమర్పించారు. ఈరోజు ఉదయం సీఎం
కేసీఆర్ తరపున తెలంగాణ భవన్లో ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీ హరి, మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున నామినేషన్లు వేశారు. ఈనెల 21న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 23న గడువు విధించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం, పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పెద్దపల్లి ఎంపీ (టీఆర్ఎస్) బాల్క సుమన్ అన్నారు.