టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడికి సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ | Cm Kcr Praises Australia TRS President | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడికి సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌

Published Sat, Apr 28 2018 9:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Cm Kcr Praises Australia TRS President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు అతిథిగా హాజ‌ర‌వ‌డ‌మే కాకుండా ఆ స‌మావేశాల సారాంశాన్ని ప‌లువురికి తెలియ‌జెప్పాల‌నే ప్ర‌య‌త్నం అభినంద‌నీయమ‌ని ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్‌ రావు కొనియాడారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్ల ర‌చించిన పుస్త‌కాన్ని శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో `తెలుగు భాష ప్రాచీన‌త‌- తెలంగాణ తెలుగు సౌర‌భాలు` గురించి ఎంపీ క‌విత ఉప‌న్యాసించారు.

ఈ కీల‌క ప్ర‌సంగాన్ని భ‌విష్య‌త్ త‌రాలకు అందించాల‌నే ఉద్దేశంతో నాగేంద‌ర్ రెడ్డి పుస్త‌క‌ రూపం ఇచ్చారు. శనివారం ఎన్నారైలతో జ‌రిగిన స‌మావేశం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటుగా ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల‌, వివిధ దేశాల‌కు చెందిన ఎన్నారైలు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారై నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement