
కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిశారు. తెలంగాణ పునర్నిర్మాణంలోను, విద్యుత్ సమస్యలను అధిగమించడంలోనూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా ప్రధాన కార్యాదర్శి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల విభజన నేపథ్యంలో అప్రమత్తంగా వుండి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో యూనియన్ నేతలు గోవింద్‌రావు, ఈశ్వరప్ప,లింగం, శ్రీనివాస్‌రావు, భగీరత్, శ్రీధర్ ఉన్నారు.