Division employees
-
ఉద్యోగులకు ఆప్షన్లు!
విభజనపై ప్రతి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయం కొత్తగా జాబితాలు రూపొందించాలని సీఎస్ల ఆదేశం జూన్ 1 నాటికి సీనియారిటీ పరిగణనలోకి.. హైదరాబాద్: ఆప్షన్ల ఆధారంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరుగనుంది. ఇందుకోసం కేడర్, డిప్యూటేషన్లు, దీర్ఘకాలిక సెలవులు సహా ఉద్యోగుల పూర్తి వివరాలతోపాటు జూన్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల సీనియారిటీతో జాబితాలను రూపొందించనున్నారు. కేడర్ సహా ఉద్యోగుల జాబితాను తయారుచేయడంపై వివిధ శాఖల ప్రత్యేక కార్యదర్శులు, అధిపతులతో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్ఆర్) విభాగం అధికారులు పీవీ రమేష్, రామకృష్ణారావు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రధానికి పంపించామని.. అనుమతి రాగానే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎస్‌లు సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియ రెండు నెలల్లో ముగుస్తుందని తెలిపారు. మార్గదర్శకాలకనుగుణంగా ప్రతీ ఉద్యోగికీ ఆప్షన్ పత్రాలు, ఆప్షన్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కేడర్‌లో 51 వేల పోస్టులుండగా వెయ్యి మంది ఉద్యోగుల పంపిణీకే ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. రాష్ర్టపతి ఉత్తర్వులే ప్రామాణికం.. రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని... ఎంత మంది ఉద్యోగులను నోటిఫై చేశారు? ఆర్థికశాఖ మంజూరు చేసిన పోస్టులెన్ని? ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను నివేదికలో పొందుపర్చాలని సీఎస్‌లు సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కమల్‌నాథన్ నేతృత్వంలోని సలహా మండలి దృష్టికి తేవాలని సూచించారు. ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా సమర్పించాలని చెప్పారు. కొత్తగా జాబితాలు! జూన్ 1వ తేదీ నాటికి ఉన్న వివరాలన్నింటినీ పరిగణించి జాబితాను తయారుచేయాలని.. పాత నివేదికలతో సంబంధం లేకుండా కొత్తగా జాబితాలను రూపొందించాలని అధికారులను సీఎస్‌లు, ఎస్ఆర్ అధికారులు ఆదేశించారు. ఇందుకోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభజన ప్రక్రియ ప్రారంభమైతే రెండు నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. ఎస్ఆర్ విభాగానికి పూర్తిస్థాయి అధికారి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగానికి పూర్తిస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించి, బాధ్యతలు అప్పగిస్తామని సీఎస్‌లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంట్లో ఇరు రాష్ట్రాల అధికారులూ ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ విభాగానికి సభ్య కార్యదర్శిగా పీవీ రమేష్ ఉన్నారు. కాగా... విభజనను త్వరగా పూర్తిచేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీలు పాల్గొన్నారు. -
రాజకీయాలకన్నా ఉద్యోగుల సమస్యలే మిన్న
సిద్దిపేట టౌన్ : రాజకీయాల కన్నా తనకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమని రాష్ట్ర టీఎన్జీవోల సంఘం చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తనకు టిక్కెటు ఇవ్వని అంశాన్ని రాజకీయ దురుద్దేశంతో వాడుకోవడం తగదన్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పుడే తెలంగాణలో పాలన వేగవంతమవుతుందన్నా రు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నారు. జిల్లా, జోన్ స్థాయి అధికారులను వారి ప్రాంతాలకు పంపిం చాలన్నారు. దసరా లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులను, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. బంగారు తెలంగాణలో తాము సైతం భాగస్వామ్యం అవుతామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నేతలు విక్ర మ్, శ్రీహరి, మజీద్ పాల్గొన్నారు. -
అటా...ఇటా..?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లోని ఉద్యోగులు ఎటువైపు అనే విషయం మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ విధి విధానాలను ఇంకా వెలువరించకున్నప్పటికీ, ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యేకంగా పరిగణించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు వారికి నచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా అప్షన్ కల్పించే ందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు మండలాల్లోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు వివరాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. సదరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేసే చోటనే ఉంటారా..? లేదా..? అనే అభిప్రాయాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ ఇలంబరితి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సైతం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల్లో దీనిపైనే చర్చ సాగుతోంది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారు కోరుకున్న రాష్ట్రంలోనే పనిచేసేలా అప్షన్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను చూసే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంటే ముంపులో పనిచేసే వారికి సెప్టెంబర్ నెల వేతనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి ప్పుడు ఉద్యోగులందరినీ వెనుక్కు తీసుకురావాలన్నా అనేక ఇబ్బందులు ఉంటాయి. వారందరినీ ఖమ్మం జిల్లాలో సర్దుబాటు చేయటం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఇక్కడ ఖాళీలు కూడా లేవు. దీంతో వారిని ప్రస్తుతానికి అక్కడనే పనిచేయించి, వేతనాలు ఏపీ ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి ముంపు ఉద్యోగుల జాబితాలను పంపించేలా కలెక్టర్ ఇలంబరితి చర్యలు చేపట్టారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన నివేదికలు సిద్ధమవుతున్నాయి. అయోమయంలో ముంపు ఉద్యోగులు... ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ ప్రాంత ఉద్యోగులు కొందరిలో అయోమయం నెలకొంది. ఇళ్లు, పొలాలు, బంధు వర్గాలను ముంపులో వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రావాలా..? లేక ఆ ప్రాంతంలోనే ఉండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. ముంపులోనే ఉంటే భవిష్యత్‌లో పునరావాసం కల్పించే సమయంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందేమోననే సందేహం కూడా వారిని వేధిస్తోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటి... ముంపు మండలాలైన చింతూరు, కూనవర ం, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన వారు ఉద్యోగ రీత్యా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వీరికి ఏ విధంగా ఆప్షన్లు కల్పిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అదే విధంగా జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న వారిలో కొంతమంది ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఉద్యోగుల విభజన ఏ రీతిన చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమల్‌నాథన్ కమిటీ కేవలం రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు మాత్రమే విధి విధానాలు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తే భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉద్యోగ సంఘాల వారు అంటున్నారు. ఆ దిశగా ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఆలోచించాలని వారు కోరుతున్నారు. -
18 ఎఫ్ రద్దు చేయాల్సిందే
కమలనాథన్ కమిటీకి టీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ హైదరాబాద్: ఉద్యోగుల విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉండే పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను నియమించేందుకు వీలుకల్పించే 18 ఎఫ్‌ను మార్గదర్శకాల్లోంచి తొలగించాలని తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, గెజిటెడ్ అధికారులు, వర్కర్లు, పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది. 1956 స్థానికతకు సంబంధించి సర్వీస్ పుస్తకాలను ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో కాకుండా.. స్వతంత్ర సంస్థతో పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్డర్ టు సర్వ్ పేరిట సాంక్షన్డ్ పోస్టులలో కావాలనే ఏపీ వారిని నియమించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరింది. నాలుగో తరగతి ఉద్యోగులందరినీ (జూనియర్ అసిస్టెంట్ స్కేలు కంటే తక్కువగా ఉన్నవారిని) స్థానికత ఆధారంగా వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ తెలిపారు. అంతకుముందు తమ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమై కమలనాథన్ కమిటీ సిఫార్సులు, అభ్యంతరాలపై చర్చించినట్లు ఆయన చెప్పారు. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను రద్దు చేయకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఏ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయిస్తూ ప్రొవిజినల్ అలాట్మెంట్ పూర్తి చేయాలని కోరారు. 18 ఎఫ్(జీ) ప్రకారం కేంద్ర పాలన అమల్లో ఎవరినైనా నియమిస్తామనడం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని దేవీప్రసాద్ పేర్కొన్నారు. కాగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్న సంతోషం కూడా ఉద్యోగులకు లేకుండా పోయిందని టీజీవో నేత, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కమలనాథన్ కమిటీని కీలుబొమ్మను చేసి ఏపీ ప్రభుత్వం ఆడిస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ సంఘం నేత విఠల్ మాట్లాడుతూ... మొత్తం 12 లక్షల ఉద్యోగులు ఉంటే కేవలం 56 వేల మందికే విభజనను పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు. -
14న ప్రధానికి తుది నివేదిక
-
14న ప్రధానికి తుది నివేదిక
13న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్ కమిటీ భేటీ ఇదే భేటీలో రెండు రాష్ట్రాల ఆమోదానికి నివేదిక హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల విభజనపై తుది నివేదికను వచ్చే నెల 14న ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలని కమలనాధన్ కమిటీ నిర్ణయించింది. నివేదికను ఖరారు చేసేందుకు 13వ తేదీన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానుంది. అనంతరం ప్రధానికి సమర్పించే నివేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన ఈ కమిటీ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుంచి ఆగస్టు 5 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అభ్యంతరాల పరిశీలన అనంతరం మార్గదర్శకాల్లో అవసరమైన మేరకు సవరణలు చేసి రాష్ట్రస్థాయి కేడర్‌కు చెందిన 76 వేల పోస్టులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో 23 వేల పోస్టులు ఖాళీగా ఉండగా మిగతా ఉద్యోగుల పంపిణీ కసరత్తును కమిటీ వేగవంతం చేసింది. వచ్చే నెల 13వ తేదీనాటి సమావేశంలోనే ఉద్యోగుల విభజనపై తుది నివేదికను రెండు రాష్ట్రాల ఆమోదానికి పెట్టనున్నారు. నివేదికపై అంగీకారం తెలుపుతూ రెండు రాష్ట్రాలూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం అంగీకరించకపోయినా ఉద్యోగుల పంపిణీ మరిన్ని రోజులు జాప్యం కాక తప్పదు. కమలనాధన్ కమిటీ మార్గదర్శకాల్లో కొన్నిటిని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తుంటే. మరికొన్నిటిపై ఏపీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే నెల 13వ తేదీ నాటికి తుది నివేదిక సిద్ధం చేయూలని కమిటీ భావిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏమేరకు సాధ్యమవుతుందో అన్న అనుమానం కమిటీ సభ్యుల్లోనే వ్యక్తమవుతోంది. అయితే కమిటీ తుది నివేదికను ఏ రాష్ట్రమైనా అంగీకరించని పక్షంలో తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీ చైర్మన్‌గా కమలనాధన్కు పూర్తి అధికారాలు ఉన్నాయని అంటున్నారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు
ఆంధ్ర ఉద్యోగులను పంపే కుట్ర : టీ ఉద్యోగ జేఏసీ 8 ఎఫ్‌ను తొలగించాలి స్థానికత ధ్రువపత్రాలు వెబ్సైట్లో పెట్టాలి హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆప్షన్లను తొలగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగులను పంపించే కుట్ర జరుగుతోందని జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే విభజన మార్గదర్శకాల్లో ‘18 ఎఫ్’ క్లాజును పెట్టారని మండిపడ్డారు. దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవోల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) పరిధి నుంచి తొలగించి, స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని.. లేదా తెలంగాణ రాష్ట్ర అధికారులకు అందులో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 31లోగా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని.. రాష్ట్ర స్థాయి అధికారులు, సిబ్బందితోపాటు జోనల్, మల్టీజోనల్, జిల్లా స్థాయిల్లోనూ ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరారు. ఉద్యోగుల స్థానికత తదితర వివరాలను తెలియజేసే ధ్రువపత్రాలను వెబ్సైట్లో పెట్టాలన్నారు. ఉద్యోగుల సర్వీసు బుక్ నిర్మాణమే సరిగా లేదని, అందులో స్థానికత అంశమే లేదని, ఈ విషయాన్ని కమలనాథనే చెప్పారని దేవీప్రసాద్ చెప్పారు. అనంతరం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ... కమలనాథన్ కమిటీ ఉత్సవ విగ్రహంలా మారిందని, ఆంధ్రప్రదేశ్ అధికారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. మిగులు ఉద్యోగులను ఎక్కడి వారిని అక్కడే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది: శ్రీనివాస్‌గౌడ్ కమలనాథన్ కమిటీకి ఎన్నో వినతిపత్రాలు అందజేసినా చివరకు తాము భయపడ్డ తరహాలోనే నిర్ణయం తీసుకున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ప్రభుత్వంలో పనిచేసేలా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. తాజా మార్గదర్శకాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నాయని విమర్శించారు. -
మరో పోరాటానికి సిద్ధం: దేవీప్రసాద్
హైదరాబాద్ : ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం నాంపల్లిలోని గగన్‌విహార్ భవన్లో తెలంగాణ వాణిజ్య పన్నుల నాన్గె జిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర ్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, సంఘం నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ఐఏఎస్ అధికారులకు తప్పుడు సమాచారంతోనే కేంద్రం ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు కేటాయింపులు జరుగుతున్నాయే తప్ప బదిలీలు కావనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకువచ్చేలా కృషి చే స్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ చైర్మన్ వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ రికార్డులను దిద్దారు...
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక పక్క ఉద్యోగుల విభజన జరుగుతుండగా ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి సర్వీస్ రికార్డుల్లో జన్మస్థలం ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లుయిడ్తో దిద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సర్వీస్ రికార్డుల ప్రకారం వారి స్వసస్థలాలకు పంపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లడం ఇష్టం లేని ఎన్నెస్పీలోని సీమాంధ్ర ఉద్యోగులు కొందరు వారి సర్వీస్ రిజిస్టర్లో జన్మస్థలం అని ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లూయిడ్‌తో దిద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడిని కలిసి వివరించినట్లు తెలిసింది. సీమాంధ్ర జిల్లాలకు చెందిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు ( లష్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు) గత అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపుల్లో భాగంగా వర్క్ చార్జ్డ్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలనే నిబంధన ఉంది. కానీ కొందరు తమ సర్వీస్ రికార్డులో జన్మస్థలం దగ్గర సీమాంధ్ర జిల్లాల వివరాలు ఉంటే దాన్ని వైట్ ప్లూయిడ్‌తో దిద్ది దానిపై ఖమ్మం జిల్లాలో జన్మించినట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగం మొత్తం కొంత మంది ఈ శాఖ ఉద్యోగుల ఆమోదంతోనే జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 15 మంది వరకు ఇలా దిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్ఈ ఆరోపణలు వచ్చిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తెప్పించుకుని చూసి కొంత మందిని పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఈ అప్పలనాయుడిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇద్దరు, ముగ్గురికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం అసోసియేషన్ నాయకులు చెప్పారని, వారికి సంబంధించిన అన్ని రకాలు రికార్డులు తీసుకుని రావాలని చెప్పానన్నారు. ఆ రికార్డులను పరిశీలించి అసలు ఎలా ఉంటే అలాగే పంపుతామని అన్నారు. ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగుల బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, చాలా వరకు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. -
ప్రస్తుతానికి తాత్కాలికమే!
-
ప్రస్తుతానికి తాత్కాలికమే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉద్యోగుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడివారు అక్కడే సెక్రటేరియట్ అధికారులు, హెచ్వోడీల్లో మార్పులు ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖతో కమలనాథన్, సీఎస్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతానికి తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల విభ జనకు సంబంధించి ఇరు ప్రాంతాల నుంచి వేర్వేరు డిమాండ్లు వస్తుండటం, కొద్ది రోజుల్లోనే ఏర్పడనున్న కొత్త ప్రభుత్వాలు దీనిపై తమ విధానాన్ని తెలిపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో... శాశ్వత మార్గదర్శకాల రూపకల్పనకు మరింత సమయం పట్టవచ్చని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల విభజన అంశాలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం నార్త్‌బ్లాక్‌లో సమావేశం నిర్వహించింది. దీనికి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, డీవోపీటీ కార్యదర్శి శ్యామేల్కుమార్ సర్కార్, ప్రభుత్వ సీఎస్ పీకే మహంతి, ఉద్యోగ విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ హాజరయ్యారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన కసరత్తుపై రాష్ట్ర అధికారులు నివేదికలు సమర్పించారు. ఇదే సమయంలో ఉద్యోగుల తుది పంపిణీని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక చర్చించాకే పంపిణీ చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉద్యోగుల తుది పంపిణీ సాధ్యం కాదని... అలా చేస్తే వచ్చేసమస్యలను పరిష్కరించడం కష్టతరమని రాష్ట్ర అధికారులు కేంద్ర హోంశాఖకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు జరపాలని సూచించినట్లు సమాచారం. దీంతో విభజన అనంతరం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేయాలని, దీనికోసం ప్రభుత్వం నుంచి ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు జారీచేయాలని నిర్ణయించారు. ఇక సెక్రటేరియట్ స్థాయిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, శాఖాధిపతుల్లో మాత్రం చిన్నపాటి మార్పులు చేర్పులతో కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సీఎస్ మహంతి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి తాత్కాలిక కేటాయింపులుంటాయి. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు, అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేస్తారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి శాశ్వత మార్గదర్శకాలు సిద్ధం అయ్యాక శాశ్వత కేటాయింపులు ఉంటాయి’ అని తెలిపారు. ప్రతిపాదనలు చేసిన బాబు!: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పలు ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది. బాబుతో పాటు కొందరు ఇతర పార్టీల నేతలు సైతం ప్రతిపాదనలు పంపారు. బుధవారం నాటి సమావేశంలో వీటిపైనా చర్చ జరిగినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని శాశ్వత మార్గదర్శకాలు తయారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రెండుగా ఆబ్కారీ శాఖ
జూన్ 1 నుంచే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ విధులు ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, పెట్టుబడి వాటాల విభజన, బదిలీ రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రంగుల లేబుల్స్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ కార్పొరేషన్లు రెండుగా విడిపోయాయి. రెండు ప్రాంతాలకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తిచేసిన ఎక్సైజ్ శాఖ అధికారికంగా జూన్ ఒకటి నుంచి విధులు నిర్వర్తించబోతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన లేబుల్స్(ఈఏఎల్స్) రంగులను కూడా మార్చారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ రెండు వేర్వేరు జీవోలు(నంబర్ 239, 240) జారీ చేశారు. ఈ మేరకు జూన్ 1 నుంచే విభజన అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీ పునర్నిర్మాణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సీమాంధ్రకు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాయి. {పస్తుతం మద్యం బాటిళ్లపై ప్రింట్ చేస్తున్న ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేసే బాటిళ్లపై ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’ అని ప్రింట్ చేస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే మద్యంతో పాటు ఎగుమతి, దిగుమతి, సీఎస్డీ మద్యానికి ఇస్తున్న లేబుల్స్ రంగులను తెలంగాణకు మార్చినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. {పస్తుతం మద్యం లేబుళ్లను యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ రాష్ట్రంలో తయారయ్యే మద్యానికి లేత ఆకుపచ్చ, ఎగుమతి, దిగుమతి మద్యానికి లేత పసుపు, సీఎస్డీ లేబుళ్లకు లేత గోధుమ రంగు కొనసాగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే మద్యంకు లేత గులాబీ, ఎగుమతి మద్యానికి లేత నారింజ, దిగుమతి లేబుళ్లకు లేత ఎరుపు, సీఎస్డీ లేబుల్స్‌కు లేత నలుపు రంగులను కేటాయించారు. తెలంగాణలో స్థానిక వినియోగానికి వినియోగించే మద్యం బాటిళ్లకు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు లేబుళ్లను వినియోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వ లోగో వచ్చిన తరువాత ప్రస్తుతం ఉన్న లోగో స్థానంలోకి మార్పు చేస్తారు. -
ఉద్యోగుల విభజనలో అశాస్త్రీయ విధానాలు
ఇంటర్ విద్యా డెరైక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలు అమలు చేస్తోందని విమర్శిస్తూ ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యం లో సోమవారం ఇంటర్మీడియెట్ విద్యా డెరైక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. స్థానికత ఆధారంగా కాకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా విభజన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన విషయం లో ఆంధ్రా ఉన్నతాధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని, స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మార్గదర్శకాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఒక ప్రాంతం ఉద్యోగులు మరో ప్రాంతంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టాలన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. -
కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిశారు. తెలంగాణ పునర్నిర్మాణంలోను, విద్యుత్ సమస్యలను అధిగమించడంలోనూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా ప్రధాన కార్యాదర్శి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల విభజన నేపథ్యంలో అప్రమత్తంగా వుండి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో యూనియన్ నేతలు గోవింద్రావు, ఈశ్వరప్ప,లింగం, శ్రీనివాస్‌రావు, భగీరత్, శ్రీధర్ ఉన్నారు. -
మా ఉద్యోగాలు మాక్కావాలి
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: మా ఉద్యోగాలు మాకే కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొందరు అధికారులు రూపొందించిన ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు మాకొద్దన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో శనివారం తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు డాక్టర్ పాపయ్య, అశోక్‌కుమార్, టీచర్ల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నేతలు పులిరాజు, గాలిరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మార్గదర్శకాల వల్ల 55 వేల ఉద్యోగాలకు మాత్రమే విభజన వర్తిస్తోందన్నారు. ఇది అశాస్త్రీయం, అన్యాయమన్నారు. రాజ్యాంగ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. జిల్లా జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి ఆఫీసులు, ప్రాజెక్టులలో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణకు వచ్చిన ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనన్నారు. గిర్గ్లాని కమిషన్ ఉద్యోగుల నియామకాల్లో 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించి, వీటిని సవరించాలని సిఫార్స్ చేసినప్పటికీ ఆమలు చేయలేదన్నారు. ఇప్పుడైనా అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్లు సైతం తుంగలో తొక్కార న్నారు. 58:42 నిష్పత్తిలో ఉద్యోగాలను కేటాయించాలని, ఖాళీలు ఏర్పడితే ఎక్కడి ప్రభుత్వాలు అక్కడే భర్తీ చేసుకోవాలన్నారు. నాన్‌లోకల్ ఉద్యోగుల పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రాంత పాలనలో సవరించాల్సిందేనన్నారు. స్థానిక నివాస తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి అక్రమంగా జొరబడ్డ ఉద్యోగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రభుత్వాన్ని ఇక్కడి పాలకులు, ఉద్యోగులే నడుపుకుంటారన్నారు. -
చర్చల తరువాతే నిర్ణయం: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు తీరుపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియను తిరిగి సమీక్షించాలని ఆయన భావిస్తున్నారు. ఉద్యోగులు ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న ఆఫ్షన్ వద్దని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాతే తన వైఖరి వెల్లడిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. వారితో చర్చించిన తరువాత ఉద్యోగుల ఆఫ్షన్లపై కెసిఆర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
ఆలంపల్లి, న్యూస్‌లైన్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సీ.విఠల్ అన్నారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నిర్వహించిన ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా సచివాలయంలోనే పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు పనిచేయకూడదని జేఏసీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఎన్నికల హడావుడిలో ఉండగా రెండు రాష్ట్రాల విభజనకు 21 కమిటీలు వేశారని, అందులో అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు. పనికిరాని భవనాలను తెలంగాణ కార్యాలయాలకు, అధునాతన భవనాలు ఆంధ్రా ప్రాంతం వారికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామని, వికారాబాద్ జిల్లా ఏర్పాటు, స్థానికంగా జూనియర్ కళాశాల, ఎస్ఏపీ కళాశాలలో లెక్చలర్ల నియామకం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కోసం జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. సుస్థిరపాలన అందించే పార్టీకి, ప్రజలకు సేవచేసే సమర్థవంతమైన నాయకుడికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ విధుల తర్వాత ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, టీయూటీఎఫ్ నాయకులు యూ.విఠల్, నాయకులు ప్రతాప్, మారుతీ, దేవదాస్, నందకుమార్, ప్రేం కుమార్, దుర్గప్రసాద్, నర్సింహులు, రామారావుజోషి పాల్గొన్నారు. -
ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలి
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : జూన్ 2న ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం కంటే ముందే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని సెంట్రల్ గార్డెన్లో నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యోగుల విభజన, పరిణామాలు, కింకర్తవ్యం’పై ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్‌కు వస్తూ నిర్మల్‌లోని టీఎన్జీవో సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏమాత్రం అన్యాయం జరిగినా, సచివాలయంలో మళ్లీ ఆంధ్ర పాలన వచ్చినా మలి దశ ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో పారదర్శకత లోపిస్తోందని, స్థానికత ఆధారంగానే విభజించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా రెండు గంటలు పనిచేస్తారని తెలిపారు. అమరుల కోసం రూ.200కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం వాచ్‌డాగ్‌లా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం 22 అంశాలతో కూడిన ఎజెండాను రాజకీయ పార్టీ ముందుంచామని తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో టీఎన్జీవో మహిళా చైర్పర్సన్ రేచల్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు జైరాం, విలాస్, వేణుమాధవ్, భాగ్యలక్ష్మీ, మొయినొద్దీన్, వి ద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జేఏసీ కన్వీనర్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిర్మల్‌కు వచ్చిన దేవీప్రసాద్‌ను టీఎన్జీవో నాయకులు పూలమాల, శాలువాతో సన్మానించారు. వేణుమూరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
చర్చల తర్వాతే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: వివాదాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా సమగ్ర చర్చల తర్వాతే ఉద్యోగుల విభజనకు మార్గదర్శకలు రూపొం దించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయిం చింది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కమలనాథన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు బొర్రా వెంకటేశం, రామకృష్ణారావు సమావేశమై చర్చించారు. శాఖల వారీగా సిబ్బందిని ఎలా విభజించాలి? అప్రధానంగా ఉన్న అనుబంధ విభాగాలను ఎలా కలపాలి? అనే అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటికే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలి. విభజన ప్రక్రియకు ముందే విలీనం చేయాల్సిన శాఖలను గుర్తించాలి. ఈ పని ఆయా శాఖలు, కార్పొరేషన్లకు అప్పగించాలి. శాఖలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత ఏయే శాఖలు, కార్పొరేషన్లకు ఎంత మంది సిబ్బంది అవసరమో నిర్ణయించాలని సమావేశంలో చర్చించారు.