మరో పోరాటానికి సిద్ధం: దేవీప్రసాద్
హైదరాబాద్ : ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం నాంపల్లిలోని గగన్‌విహార్ భవన్‌లో తెలంగాణ వాణిజ్య పన్నుల నాన్‌గె జిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర ్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, సంఘం నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ఐఏఎస్ అధికారులకు తప్పుడు సమాచారంతోనే కేంద్రం ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవన్నారు.
ప్రస్తుతం ఉద్యోగులకు కేటాయింపులు జరుగుతున్నాయే తప్ప బదిలీలు కావనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకువచ్చేలా కృషి చే స్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ చైర్మన్ వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.