ఏపీ ఉద్యోగుల అవసరం లేదు: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణలో నిరహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అవసరంలేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తెలంగాణ ఉద్యోగులకు ఉందని ఆయన తెలిపారు. ఈనెల 19న సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించడమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది.