హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సామాజిక, ఆర్థిక సర్వేలో ఆంధ్ర ఉద్యగోలు పాల్గొనరని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సర్వేలో పాల్గొనాలని 22 మంది ఆంధ్ర ఉద్యోగులకు జీహెచ్ఎంసీ కమిషనర్ నోటీసులు పంపారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబితేనే సర్వేలో పాల్గొంటామని చెప్పారు. ఆంధ్ర ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడు సర్వేకు హాజరు కావాలని ఎలా కోరుతారని వారు ప్రశ్నించారు. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి సంగతి తెలిసిందే.
'తెలంగాణ సర్వేలో పాల్గొనం'
Published Mon, Aug 11 2014 12:49 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement