సాక్షి, హైదరాబాద్: వివాదాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా సమగ్ర చర్చల తర్వాతే ఉద్యోగుల విభజనకు మార్గదర్శకలు రూపొం దించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయిం చింది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కమలనాథన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు బొర్రా వెంకటేశం, రామకృష్ణారావు సమావేశమై చర్చించారు.
శాఖల వారీగా సిబ్బందిని ఎలా విభజించాలి? అప్రధానంగా ఉన్న అనుబంధ విభాగాలను ఎలా కలపాలి? అనే అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటికే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలి. విభజన ప్రక్రియకు ముందే విలీనం చేయాల్సిన శాఖలను గుర్తించాలి. ఈ పని ఆయా శాఖలు, కార్పొరేషన్లకు అప్పగించాలి. శాఖలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత ఏయే శాఖలు, కార్పొరేషన్లకు ఎంత మంది సిబ్బంది అవసరమో నిర్ణయించాలని సమావేశంలో చర్చించారు.
చర్చల తర్వాతే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు
Published Wed, Mar 12 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement
Advertisement