కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల | telangana development with kcr: nomula | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల

Published Mon, May 5 2014 1:27 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల - Sakshi

కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల

నకిరేకల్, న్యూస్‌లైన్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. నకిరేకల్‌లో టీఆ ర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నోముల నర్సింహయ్యకు ఆత్మీయసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో నర్సిం హయ్య మాట్లాడుతూ తాను పదవి కోసం సీపీఎంను వీడలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు టీవీ ఛానళ్లలో చర్చించిన సందర్భంగా సీపీఎం పెద్దలు తనకు నోటీసులు పంపారని, అందులో ఒకవర్గం తనను వేధింపులకు గురిచేయడంవల్ల పార్టీని వీడి తెలంగాణ కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. తనతోపాటు జిల్లాలో 6నుంచి 7 అసెంబ్లీ స్థానాలలో, 2 పార్లమెంట్ స్థానాలలో గెలిచి టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు.

నకిరేకల్ టీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పూజర్ల శంభయ్య, నాయకులు సోమయాదగిరి, సిలివేరు ప్రభాకర్, మారం భిక్షంరెడ్డి, కనుకు సహాని, పన్నాల సావిత్రమ్మ, వీర్లపాటి రమేష్, బొజ్జ సుందర్, గార్లపాటి రవీందర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, వివిధ మండల పార్టీ అద్యక్షులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement