
మాట్లాడుతున్న మాజీ ఎంపీ మందా జగన్నాథం
శాంతినగర్ : టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో దేశ రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్ వెళ్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, యావత్తు తెలంగాణ ప్రజలు ఆమోదించారని మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందాజగన్నాథం అన్నారు. మానవపాడు మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 27న కొంపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్లీనరీ విజయవంతమైందన్నారు. దశాబ్దాల కాలంగా పాలించిన బీజీపీ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని ఫ్రంట్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్–1 పనులు పూర్తయినందున సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం కావాలంటే వెంటనే తుమ్మిళ్ల ఫేస్–2 పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ పనులు పూర్తయితే కెనాల్‌లో నీటిపారుదల నిలిచిన సమయంలో మూడు రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుందని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మానవపాడు మండల అధ్యక్షుడు రోశన్న, గ్రంథాలయ డైరెక్టర్ ఆత్మలింగారెడ్డి, సర్పంచ్ రాజశేఖర్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, ఎల్లారెడ్డి, శంకర్‌గౌడ్, రఘు, సీతారాముడు, దుబ్బన్న, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment