హైదరాబాద్ : ఖమ్మంలో ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి 4 వేల ప్రతినిధులనే ఆహ్వానిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఈటల రాజేందర్ విలేకర్లతో మాట్లాడుతూ... ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రతినిధుల సభ నిర్వహిస్తామని... సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.
పలు కీలక అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలనూ కూడా అమలు చేసిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.