సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు చర్చలు జరిపి పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీల్లో చేరకుండా ఆపగలిగానని ఈటల రాజేందర్ తెలిపారు. అయినా, వారిద్దరూ బీజేపీలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి తాను పొంగులేటితో చర్చించాననని తెలిపారు. కొంతమంది తను అనని వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను అవలీలగా మింగేస్తారని.. సీఎంకు ట్రిక్స్ బాగా తెలుసని అన్నారు. కాగా ఈటల తాజా వ్యాఖ్యలతో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
చదవండి: ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment