ponguleteli Srinivasa Reddy
-
కేటీఆర్, పొంగులేటికి మహేశ్వర్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతల మీద సీబీఐ,ఈడీ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మేము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎప్పుడో అమృత్ పథకం అవకతవలపై మాట్లాడింది.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ.కేటీఆర్,హరీష్ ఢిల్లీ వెళ్లి కేసి వేణుగోపాల్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కదా?అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చా.సుజన్‌రెడ్డి సీఎంకు బామ్మర్దో,బీఆర్ఎస్కు అల్లుడో అని రెండు పార్టీలు ఆరోపించికుంటున్నాయి.గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు కట్టబెట్టారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అధికార దుర్వినియోగమే.మంత్రిగా కొనసాగడానికి పొంగులేటికి నైతిక అర్హత లేదు.మంత్రి పొంగులేటి,కేటీఆర్‌కు నేను సవాలు చేస్తున్నా.నేను చేసిన అరోపణలు వాస్తవమని తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.లేదంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’అని మహేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్లరేషన్ కార్డులున్న వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నాలుగోసారి సమావేశమై చర్చించింది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు. అర్హతలపై పునః సమీక్ష చేస్తున్నాం.. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 21న ఇంకోసారి సమావేశమై కొత్త విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటికి 91,68,231 రేషన్‌కార్డులు, 3,38,07,794 మంది లబ్ధిదారులు ఉంటే.. గత ప్రభుత్వం పాత రేషన్‌కార్డులన్నీ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు. అప్పట్లో 89,21,907 కొత్త రేషన్‌కార్డులను జారీ చేయగా.. 2,70,36,250 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని.. 3.5 ఎకరాలు/ఆ లోపు తడి, 7.5 ఎకరాలు/ఆ లోపు మెట్ట భూములు ఉండాలని చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో అమలు చేస్తున్న ఆదాయ పరిమితులను పరిశీలించామని.. రాష్ట్రంలో లబ్ధిదారుల ఆదాయ పరిమితిని పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా? అన్న అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాయగా.. ఇప్పటివరకు 16 మంది నుంచి స్పందన వచ్చిందన్నారు. మిగతావారు ఈ నెల 19లోగా అభిప్రాయాలను పంపితే.. పరిశీలిస్తామని చెప్పారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ.. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీని జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రిసైక్లింగ్‌కు దారితీస్తోందని.. సన్న బియ్యంతో ఈ సమస్య ఉండదని వివరించారు. వానాకాలంలో పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని తెలిపారు. ఉప ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిచ్చారు: పొంగులేటి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2016–2024 మధ్య కాలంలో 6,47,479 కొత్తకార్డులు జారీ చేయగా.. 5,98,000 కార్డులను తొలగించిందని చెప్పారు. అంటే ఇచ్చినది 49,476 కార్డులేనని పేర్కొన్నారు. తాము పారదర్శకత కోసం ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వారు విలువైన సలహాలిస్తే భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం మధ్యంతర సిఫారసులివీ.. – క్యూఆర్ కోడ్/ మైక్రో చిప్/ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయాలి. – ప్రస్తుత అర్హతలను కొనసాగించాలి. – ‘పరిమితికి లోబడి భూమి ఉండడం ఒక్కటే అర్హత కాదు. భూమి ద్వారా వచ్చే ఆదాయం సైతం ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి’అనే నిబంధనను తొలగించాలి. గందరగోళానికి గురిచేసే ఈ నిబంధన అనవసరం. – సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలి. -
రేపు తెలంగాణలో అన్ని స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులకు తెలిపారు. అలాగే, అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రజలను మంత్రి హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు(సోమవారం) ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ ఇంఛార్జ్ వీసీ దానా కిషోర్ తెలిపారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ అధికారుల సమన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. స్పందించిన హర్ష.. ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్‌ను లగ్జరీ వాచ్ డీలర్‌గా, నవీన్‌కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి. కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. -
ప్రజాపాలనే అందరి ఆకాంక్ష : మంత్రి పొంగులేటి
ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని అన్నివర్గాల వారు ఆకాక్షించినట్లుగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, కొండాపురంలో ఆరోగ్య ఉప కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ప్రజాపాలన ద్వారా అధికారులు ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకున్నారని, ఇందులో అర్హులందరికీ పథకాలు అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి అప్పులను చూపి హామీలను విస్మరించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. ఆతర్వాత ఆరెంపులకు చెందిన మాజీ ఎంపీటీసీ కొండల్ కుటుంబాన్ని పరామర్శించగా, కొండాపురంలో ఉపసర్పంచ్ బెల్లం కృష్ణయ్య, మట్టా వీరభద్రం, గడ్డం శ్రీను తదితరులు కాంగ్రెస్‌లో చేరగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, కాచిరాజుగూడెంకు చెందిన పొన్నం వెంకయ్య తన భూమిని ఇతరులు ఆక్రమించుకోగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, ఎంపీడీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలం పాలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గృహప్రవేశం చేసిన మంత్రి పొంగులేటి ఆధ్వర్యాన జరిగిన సభకు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీపీలు బోడ మంగీలాల్, వజ్జా రమ్య, నాయకులు రాయల నాగేశ్వరరావు, తుంబూరు దయాకర్‌రెడ్డి, మద్ది శ్రీనివా స్‌రెడ్డి, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, విజయాబాయి, సాదు రమేష్‌రెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, రామసహాయం వెంకటరెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, జూకూరి గోపాలరావు, మట్టె గురవయ్య, కళ్లెం వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: TS MLC: ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల -
ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం
తుమ్మలకు(తుమ్మల నాగేశ్వరరావు) అపారమైన అనుభవం ఉంది. ఏ పార్టీలో ఉన్నా చిత్తశుధ్దితో పని చేస్తారు. కానీ, పొమ్మనకుండా పొగ బెట్టారు. అనేక అవమానాలకు గురి చేసి బయటకు పంపిస్తున్నారు. ముందు నన్ను అవమానించి బయటకు పంపారు. ఇప్పుడు తుమ్మలను అలాగే పంపిస్తున్నారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. ప్రజల కోరిక మేరకే తుమ్మల నిర్ణయం తీసుకుంటారు. ::మీడియాతో పొంగులేటి ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ముఖ్యనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. నిన్న(గురువారం) రేవంత్‌రెడ్డి తుమ్మల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై తుమ్మల ఖమ్మం వెళ్లిపోయారు. ఒకే పార్టీలో ఉన్నా.. అయితే ఊహించని విధంగా శుక్రవారం తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగేటి.. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆయన ఆహ్వానం పలికినట్లు స్పష్టం అవుతోంది. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. తుమ్మల కామెంట్లు.. పొంగులేటి నా శ్రేయోభిలాషి. నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు. నా రాజకీయాలు ప్రజల కోసమే. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నా. అభిమానుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటా. ఇదీ చదవండి: తుమ్మలగారు.. మా పార్టీలోకి రండి -
ఖమ్మంలో కాంగ్రెస్ సభ.. అదే రోజు భట్టికి రాహుల్‌తో సత్కారం
సాక్షి, ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు బుధవారం ఖమ్మంలో పర్యటించారు. జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ గురించి ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా ఆసక్తికరంగా చర్చలు జరిపారు. అనంతరం రాహుల్‌గాంధీ విచ్చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని మాణిక్‌రావు ఠాక్రే పరిశీలించారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. జూలై 2న లక్ష మందితో ఖమ్మంలో కాంగ్రెస్ జన గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు కూడా అదే రోజు ఉంటుందని పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టిని ఆ సభలో రాహుల్ గాంధీ ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. అదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. భట్టి పాదయాత్ర సక్సెస్ అయ్యిందని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పీపుల్స్ మార్చ్ ముగించుకొచ్చే ముగించుకొచ్చే భట్టి విక్రమార్కకు స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు. చదవండి: కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు -
పొంగులేటి అనుచరులకు షాక్.. పాత కేసులపై పోలీసుల నోటీసులు!
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్ విజయ్ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి నేడు(ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్ఎస్ పార్టీ అలర్డ్ అయ్యింది. సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
ఈనెల 12న పొంగులేటి ప్రకటన ఉండొచ్చు!: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్షారావు కలిశారు. కాగా, వీరి భేటీ అనంతరం మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగాయి. నాగర్ కర్నూల్లో నాగం జనార్ధన్ రెడ్డితో చర్చిస్తాం. నాగంతో ఇప్పటికే జనారెడ్డి చర్చించారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించాం. ఈనెల 12న పొంగులేటి శ్రీనివాస్ నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మల్లు రవి నివాసానికి వనపర్తి నియోజకవర్గానికి చెందిన పెద్ద మందాడి బీఆర్ఎస్ ఎంపీపీ మేఘా రెడ్డి చేరుకున్నారు. మల్లు రవితో మేఘారెడ్డి భేటీ అయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితమే మేఘారెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్ -
పొంగులేటి దారెటు.. రేపు ముఖ్య నేతలతో కీలక భేటీ
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో పొంగులేటి రేపు(శుక్రవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. దీంతో, ఆయన నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, పొంగులేటి రేపు ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉభయ జిలాల్లోని మండలానికి ఐదుగురు చొప్పున ముఖ్య నాయకులకు పొంగులేటి నుంచి పిలుపు అందినట్టు సమాచారం. నియోజక వర్గానికి 30 నుంచి 50 మంది చొప్పున నాయకులకు సమావేశానికి రావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై ముఖ్య నాయకులకు తెలుపనున్నట్టు సమాచారం. కాగా, రేపటి సమావేశంలో పార్టీ మార్పుపై పొంగులేటి కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ మార్పుపై రోజుకో ప్రచారం జరుగుతున్నది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తథ్యమని విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. పొంగులేటితో భేటీ అయ్యారనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఎమోషనల్ ట్వీట్ -
పొంగులేటి, తుమ్మల బీజేపీలో చేరికపై ఈటల సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చర్చలు జరిపి పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీల్లో చేరకుండా ఆపగలిగానని ఈటల రాజేందర్ తెలిపారు. అయినా, వారిద్దరూ బీజేపీలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈటల సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి తాను పొంగులేటితో చర్చించాననని తెలిపారు. కొంతమంది తను అనని వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను అవలీలగా మింగేస్తారని.. సీఎంకు ట్రిక్స్ బాగా తెలుసని అన్నారు. కాగా ఈటల తాజా వ్యాఖ్యలతో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. చదవండి: ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు -
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి
సాక్షి,ఖమ్మం: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న పూల కుండీలను పగలకొట్టి, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే దీన్ని గమనించిన అక్కడి స్థానికులు వారించటంతో ఆ దుండగులు పరారయ్యారు. కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పొంగలేటి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది? -
ఖమ్మం వైపు చూస్తున్న రాష్ట్ర రాజకీయాలు
-
దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆతీ్మయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘నా మద్దతుదారులను సస్పెండ్ చేస్తున్నారు. ఈరోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను. దమ్ము, ఖలేజా ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి’అంటూ సభావేదిక నుంచి సవాల్ చేశారు. ‘‘పొంగులేటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా?’అని అడు గుతున్న నేతలు గత డిసెంబర్ వరకు పార్టీ స భలు, సమావేశాలకు నాకు ఎందుకు ఆహ్వా నం పంపారు? ఫ్లెక్సీల్లో నా ఫొటోలు ఎందు కు ఉపయోగించారు? ఎన్నికలప్పుడు నా సా యం ఎందుకు కోరారు’అని శ్రీనివాస్‌రెడ్డి ప్ర శ్నించారు. ‘ఏ పారీ్టలో చేరినా ఇప్పుడు నేను ప్రకటించిన అభ్యర్థులే, ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల బరిలో ఉంటారు. అలా చేయగలిగే ద మ్ము, ధైర్యం నాకు ఉంది’అని పేర్కొన్నారు. ఎవరో ఇబ్బంది పెట్టారని, మరెవరో పిలుస్తున్నారని తొందరపడి పార్టీ మారే ఉద్దేశం తన కు లేదని స్పష్టం చేశారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి త మ బృందం అభ్యర్థి జారె ఆదినారాయణ ఉంటారని తెలిపారు. కాగా, పొంగులేటి ఆతీ్మయసభలకు వెళ్లొద్దని హెచ్చరికగా ఆదివారం పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సోమ వారంనాటి సమావేశానికి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతోపాటు నలభై మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండల, జి ల్లాస్థాయి నేతలు హాజరుకావడం గమనార్హం. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. -
మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు
-
ప్రస్తుతం గులాబీ తోటలోనే..
తిరుమలాయపాలెం: ‘ప్రస్తుతం గులాబీ తోటలోనే ప్రయాణం చేస్తున్నా.. ముళ్లు గుచ్చుకుంటున్నా బాధ అనిపించడం లేదు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పు కోరతా..’అని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంతోపాటు పిండిప్రోలు, గోల్‌తండా, సుబ్లేడు, కాకరవాయి, రఘునాథపాలెంలోని పలు కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సుబ్లేడులో మామిడి తోటలో శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకముందని చెప్పారు. ఒకవేళ తనను విస్మరించినా..ఎంపీ లేదా ఎమ్మెల్యేగా జిల్లాలోని ఏదో ఒక ప్రాం తం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల నుండి పోటీ విషయమై ఆదేశాలు రాలేదని చెప్పారు. తానేమీ బలప్రదర్శనలు చేయ డం లేదని, ప్రజలతో మమేకమవుతూ అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తనతో సంప్రదింపులు జరుపుతున్నాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు షర వేగంగా మారుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్లోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని, తాను ప్రజాప్రతినిధి నీ కాదని ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. (సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి) ఇలాంటి సమయంలో హడావుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన భేటీ కావడం పార్టీలో మరో చర్చ కు తెరలేపింది. అసలు ఖమ్మం టీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పదవులు ఎవరి సొత్తు కాదు.. ‘కొందరు మూడేళ్లు, కొందరు నాలుగేళ్లు.. మరికొందరు ఐదేళ్లు.. మంచిగా పరిపాలిస్తే తిరిగి పదవి దక్కుతుంది. అంతే తప్ప పదవులు ఎవడబ్బ సొత్తు కాదు’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే మన సొత్తు అని ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని ఆయన వివరించారు. ఆదివారం మండలంలోని జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, కుంచపర్తి గ్రామాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలు కార్యక్రమాల్లో ఒకే పార్టీలో ఉంటూ కక్ష సాధిస్తున్నారని అభిమానులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం సంస్కారం కాదని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని.. కష్టపెట్టిన వాడు ఒక్కడే వడ్డీతో సహా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగవని, పోయేటప్పుడు ఎక్కడా ఉన్నా పోతాయని, ప్రజాభిమానమే శాశ్వతమని చెప్పారు. అధికారం ఉంది కదా అని పొంగులేటి, దయానంద్, మువ్వా.. కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అభిమానం ఉన్న దగ్గరికే వస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. -
టీఆర్ఎస్లో ‘రాజ్యసభ’ లెక్కలు
రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు, (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు వచ్చే నెల 26న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదలైంది. అయితే అసెంబ్లీలో సంఖ్యా పరంగా టీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులుండగా, ఐదుగురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలలో జరిగే ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన ఏడు స్థానాలు టీఆర్ఎస్కు దక్కనున్నాయి. వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థిత్వం ఎవరికి? శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యా బలం ఉండటంతో పలువురు ఆశావహులు టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్య ర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మరోమారు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే సంఖ్యా పరంగా పార్టీ తరఫున ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులుండటం కేశవరావు అభ్యర్థిత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకదానికి మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెండో స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. 2014లో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై న కడియం ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నా సామాజిక సమీకరణాలతో రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కడియంను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటు ఎస్టీ కోటాలో మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
సత్తుపల్లి నుంచి ముగ్గురు
సత్తుపల్లి: సత్తుపల్లి కేంద్రంగానే ఖమ్మం జిల్లా రాజకీయాలు నెరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతం నుంచి ముగ్గురు ఎంపీగా పోటీ చేసి గెలుపొందటం కూడా విశేషం. జలగం కొండలరావు(1977–1984), జలగం వెంగళరావు(1984–1991 వరకు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(2014–2019 వరకు) ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జలగం కొండలరావు, జలగం వెంగళరావు వరుసగా రెండు సార్లు ఖమ్మం ఎంపీగా పని చేశారు. జలగం వెంగళరావు, జలగం కొండలరావుల స్వగ్రామం పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురం స్వగ్రామం. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రిగా జలగం వెంగళరావు పని చేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పని చేసిన విషయం పాఠకులకు విదితమే. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేశారు. జలగం కుటుంబానిది ప్రత్యేకస్థానం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. జలగం వెంగళరావు అంటే ఠక్కున గుర్తుకువచ్చేది నాగార్జునసాగర్ ఎడమకాలువ నిర్మాణం. నక్సలైట్ల ఉద్యమాన్ని కఠినంగా అణచివేశారని విమర్శలు కూడా ఉన్నాయి. పాల్వంచ, భద్రాచలంలో పరిశ్రమల స్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అదీగాక జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ లాంటి ప్రధాన కార్యాలయాన్ని జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించారు. జలగం వెంగళరావుతో పాటు ఆయన తమ్ముడు జలగం కొండలరావు, కుమారులిద్దరు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రస్తుతం జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బంగారు పళ్లెంలో.. జలగం వెంగళరావు బహిరంగ సభలంటే ఈ ప్రాంతంలో ఒక జోష్ ఉంటుంది. ఆయన మాటతీరు.. వాగ్బాణాలతో ఆకట్టుకుంటారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డిపై చేసిన విమర్శ ఇప్పటికీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గానే ఉంది. ‘ఎన్టీఆర్‌కు బంగారు పళ్లెం’లో అధికారాన్ని అప్పగిస్తారని ఖమ్మం బహిరంగ సభలో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్య రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కుకుండా పోవటంతో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు. జగనన్న మనిషిగా వచ్చా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో వేగంగా వచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లినా ‘నేనమ్మా.. జగనన్న మనిషిని’ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అంటూ ప్రజల్లోకి దూసుకొచ్చారు. తొలి ప్రయత్నంలోనే వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అయ్యారు. మారిన రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు కన్పించినా.. చేతులెత్తి నమస్కారం చేయటం ఆయన మేనరిజంగా చెప్పుకుంటారు. -
ఎన్ని పార్టీలు ఏకమైనా కారుదే జోరు
సాక్షి,ఎర్రుపాలెం: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టే శక్తి ఏ కూటమికీ లేదని, ఈ ఎన్నికల్లో 100 సీట్లల్లో గెలుపొందడం ఖాయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి మధిర టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపు కాంక్షిస్తూ అభ్యర్థితో పాటు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి మండలంలోని కొత్తగోపరం, గుంటుపల్లి గోపవరం, భీమవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో రోడ్‌షోలు చేస్తూనే పలువురిని పలకరించి తనదైన శైలిలో ఓట్లడిగారు. ఎంపీ పొంగులేటి పర్యటనకు మంచి స్పందన వచ్చింది. మహిళలు నీరాజనం పట్టారు. కొత్తగోపవరం గ్రామంలో 30 కుటుంబాలు పార్టీలోకి చేరాయి. వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బలమైన పార్టీగా టీఆర్ఎస్ ఉందని, జిల్లాలో ఓటమి బెంగతోనే ప్రతిపక్షాలు కుట్ర పన్ని తానేదో పార్టీ మారుతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని , అలా చేసేవారు పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలో 10 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందనే అక్కసుతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మధిర నియోజవర్గంలో అన్ని మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు మంచి ఆదరణ వస్తుందని, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. భట్టికి ఓటేస్తే అభివృద్ది జరగదని, ఆయన అందుబాటులోనే ఉండరని, దళిత అహంకారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, భద్రాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, గూడూరు రమణారెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి నర్సిరెడ్డి తదితరులున్నారు. -
భట్టికి ఓటమి తప్పదు
ముదిగొండ: నిరంకుశత్వం, నియంత పోకడలు కలిగిన భట్టి విక్రమార్కకు ఓటమి తప్పదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కమల్‌రాజ్‌ను గెలిపించాలని కోరారు. మండలంలోని దనియాలగూడెం, మేడేపల్లి, యడవల్లి, యడవల్లి లక్ష్మీపురం గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండే కమల్‌రాజును ఆదరించాలన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకం చేయకుండా భట్టి విక్రమార్క పేదలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మధిరలో భట్టి గెలిచే అవకాశం లేదని నూటికి నూరు శాతం లేదన్నారు. ఆయన మాజీగానే మిగిలిపోతారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయన్నారు. లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ఏనాడూ పేదల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆయన ఈ ప్రాంత ప్రజలను పట్టించున్న దాఖలాలు లేవన్నారు. యడవల్లిలో కాంగ్రెస్ నుంచి 45 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, విజయాడైరి జిల్లా చైర్మన్ సామినేని హరిప్రసాద్, మండల రైతు కన్వీనర్ పోట్ల వెంకటప్రసాద్రావు, ఎర్ర వెంకన్న, మోర్తాల నాగార్జునరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ఆదర్శం
సాక్షి,మధిర: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్టణంలోని 18, 19 వార్డుల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాలను కొన్ని రాష్ట్రాల వారు అమలుచేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కమల్‌రాజ్‌ను గెలిపిస్తే ప్రజలకు ఉత్తమ సేవలందిస్తారని తెలిపారు. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, వైవీఅప్పారావు, వేముల శ్రీను, రంగిశెట్టి కోటేశ్వరరావు, మేకల లక్ష్మి, కూనా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో కలకలం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస గృహాలు, వ్యాపార సంస్థల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన సంస్థ ద్వారా సబ్ కాంట్రాక్టు పనులు చేపట్టిన వారి ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఉదయం 9 గంటల వరకు ఆయా ప్రాంతాలకు చేరుకున్న అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. తొలుత ఖమ్మంలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్న అధికారులు తాము ఐటీ అధికారులమని పరిచయం చేసుకుని.. తనిఖీల విషయాన్ని వివరించారు. తాము చేసే సోదాలకు సంబంధించి కొందరు వ్యక్తిగత సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించలేదు. రాఘవ సంస్థకు చెందిన ముఖ్యులను మాత్రమే అనుమతించారు. సోదాలు ప్రారంభించగానే ఆదాయ పన్ను శాఖ అధికారులతో వచ్చిన పోలీసులు, సిబ్బంది.. సోదాల సమయంలో కార్యాలయ సిబ్బంది ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాలని కోరారు. ఆదాయ పన్నుకు సంబంధించి తమకున్న సమాచారానికి అనుగుణంగా అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోదాలు జరిగాయి. ఐటీ అధికారుల మరో బృందం నగరంలోని రాఘవ సంస్థ కార్యాలయంలోకి వెళ్లి సోదాలు చేపట్టింది. అక్కడ సైతం సంస్థ నిర్వహిస్తున్న కాంట్రాక్టు పనులు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐటీ అధికారులు మీడియాను కూడా అనుమతించలేదు. ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. వారికి కావాల్సిన పత్రాలను అడిగి తీసుకుని.. పరిశీలించినట్లు సమాచారం. ఉదయం వచ్చిన అధికారులు సాయంత్రం వరకు అక్కడ సైతం పరిశీలన జరిపారు. సబ్ కాంట్రాక్టర్ల ఇళ్లల్లోనూ.. రాఘవ సంస్థ తరఫున పలు కాంట్రాక్టు పనులను సబ్ కాంట్రాక్టర్లు నిర్వహించిన అశ్వారావుపేటకు చెందిన జూపల్లి రమేష్ ఇంటి వద్ద సైతం ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. తమకు కావాల్సిన పత్రాలను ఇవ్వాల్సిందిగా కోరి.. వాటిని పరిశీలించారు. ఇక సత్తుపల్లిలోనూ తోట గణేష్, వంగర రాకేష్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. వారి వృత్తి, కాంట్రాక్టు రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? రాఘవ సంస్థ తరఫున ఏమేమి పనులు చేశారు? అనే అంశాలను ఐటీ అధికారుల బృందం వారిని అడిగి తెలుసుకుంది. వారికి సంబంధించిన సూపర్ మార్కెట్, ఫైనాన్స్ సంస్థలకు వెళ్లి పలు పత్రాలను పరిశీలించారు. కాగా.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారంటూ మంగళవారం ఉదయం నుంచి నగరంలో ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇవి సాధారణ తనిఖీలేనని, వ్యాపార సంస్థల్లో ఇటువంటివి సహజమేనని అక్కడి వారు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. కార్యాలయాల్లో, రాఘవ సంస్థ ద్వారా కాంట్రాక్టు పనులు నిర్వహించిన వారి ఇళ్లల్లోనూ గంటలతరబడి సోదాలు నిర్వహించిన అధికారులు ఏమేమి పత్రాలను పరిశీలించారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యాపార నిర్వహణకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు లభించాల్సిన పన్నుకు సంబంధించి ప్రధానంగా పరిశీలించినట్లు తెలిసింది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆకస్మిక సోదాలు నిర్వహించడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు, పలు అనుమానాలు తలెత్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి సోదాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే అంశంపై కార్యకర్తలు చర్చించుకున్నారు. కల్లూరులో... కల్లూరురూరల్: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న అధికారులు సాయంత్రం పొద్దుపోయే వరకు పలు పత్రాలను పరిశీలించారు. ఇంట్లో ఉన్న వివిధ డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించగా.. అధికారులు అందుకు అనుమతించలేదు. -
గాలింపు చర్యలపై కేంద్రంతో సంప్రదింపులు
ఖమ్మం: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన విద్యార్థులు కిరణ్‌కుమార్, ఉపేందర్ కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. గాలింపు చర్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ లో బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో వనస్థలిపురంకు చెందిన అరవింద్ గల్లంతయ్యాడు. అతని కోసం కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు.