ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ పొంగులేటి
సాక్షి,మధిర: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్టణంలోని 18, 19 వార్డుల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాలను కొన్ని రాష్ట్రాల వారు అమలుచేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కమల్‌రాజ్‌ను గెలిపిస్తే ప్రజలకు ఉత్తమ సేవలందిస్తారని తెలిపారు.
డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, వైవీఅప్పారావు, వేముల శ్రీను, రంగిశెట్టి కోటేశ్వరరావు, మేకల లక్ష్మి, కూనా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment