సాక్షి,హైదరాబాద్:బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్‌ఎస్ నేతల మీద సీబీఐ,ఈడీ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.
‘కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మేము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎప్పుడో అమృత్ పథకం అవకతవలపై మాట్లాడింది.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ.కేటీఆర్,హరీష్ ఢిల్లీ వెళ్లి కేసి వేణుగోపాల్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా?
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కదా?అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చా.సుజన్‌రెడ్డి సీఎంకు బామ్మర్దో,బీఆర్‌ఎస్‌కు అల్లుడో అని రెండు పార్టీలు ఆరోపించికుంటున్నాయి.గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు కట్టబెట్టారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అధికార దుర్వినియోగమే.మంత్రిగా కొనసాగడానికి పొంగులేటికి నైతిక అర్హత లేదు.మంత్రి పొంగులేటి,కేటీఆర్‌కు నేను సవాలు చేస్తున్నా.నేను చేసిన అరోపణలు వాస్తవమని తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.లేదంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’అని మహేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.
ఇదీ చదవండి: ఎల్‌వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్
Comments
Please login to add a commentAdd a comment