Aleti Maheshwar Reddy
-
కేటీఆర్, పొంగులేటికి మహేశ్వర్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతల మీద సీబీఐ,ఈడీ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మేము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎప్పుడో అమృత్ పథకం అవకతవలపై మాట్లాడింది.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ.కేటీఆర్,హరీష్ ఢిల్లీ వెళ్లి కేసి వేణుగోపాల్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కదా?అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చా.సుజన్‌రెడ్డి సీఎంకు బామ్మర్దో,బీఆర్ఎస్కు అల్లుడో అని రెండు పార్టీలు ఆరోపించికుంటున్నాయి.గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు కట్టబెట్టారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అధికార దుర్వినియోగమే.మంత్రిగా కొనసాగడానికి పొంగులేటికి నైతిక అర్హత లేదు.మంత్రి పొంగులేటి,కేటీఆర్‌కు నేను సవాలు చేస్తున్నా.నేను చేసిన అరోపణలు వాస్తవమని తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.లేదంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’అని మహేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
అభివృద్ధి కోసమే ‘జమిలి’: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్ -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్‌లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్‌లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్ళేవని అన్నారు. కేంద్రం చేసిన పనికి తెలంగాణ కేంద్రానికి పాలాభిషేకం చేయాలని చెప్పారు.విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తానని విభజన చట్టంలో ఉందన్నారు. ఫీజిబిలిటీ లేదని అధికారులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.‘మొదటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్. ఆనాడు తెలంగాణను ఆంధ్రావాలతో విలీనం చేసింది నెహ్రూ. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర వాళ్ళతో తెలంగాణను విడదీసింది. విభజన చట్టంలో సరైన అంశాలను చేర్చలేదు అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో వేలమంది అమరులు అయ్యారు. ఉద్యమాన్ని తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రం అన్యాయం చేసింది అని కాంగ్రెస్ భావిస్తే 8 మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.బీఆర్ఎస్ కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టి కమిషన్లు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మూసి నది లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానంటుంది. ఎవరికోసం ఎవరికీ కమిషన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి లక్ష కోట్లతో మూసీ నది అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో బీజేపీని భాగస్వామ్యం రమ్మంటున్నారు’ అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముందు బీజేపీకి చెందిన 8 మందినెంపీలు రాజీనామా చేసి తమ దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని తెలిపారు.బీజేపీ వారు తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు -
గత ప్రభుత్వంకంటే ఇప్పుడే ఎక్కువ అవినీతి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఎక్కువ అవినీతి, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రహస్య జీవోలతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఓ బడా కాంట్రాక్టర్‌కు రూ.1,100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకం అమృత్ స్కీమ్‌లో కూడా రూ.3 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బావమరిదికి చెందిన ఓ కంపెనీకి రూ.400 వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చా రని తెలిపారు. ఆయా పనులను 30 నుంచి 35 శాతం తక్కువకు చేసేందుకు ఇతర కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఇష్టారీతిన అంచనాలు పెంచి, కావాల్సిన వారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు. ఇటీవల వివిధ పనుల్లో రూ.1,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముడు, బావమరిది భాగస్వామ్యంతో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ధారాదత్తం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే కరీంనగర్లో వివిధ కాంట్రాక్ట్‌లలో సీఎం తమ్ముడు భాగస్వామిగా ఉన్నట్టు చెబుతున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో త్వరలో పిలిచే టెండర్లలో కూడా ఓ బడా కంపెనీకి పెద్దపీట వేయబోతున్నారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి వ్యవహారాలపై ఈడీ, సీబీఐ విచారణ కోరతామని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తేమ పేరుతో క్వింటాల్‌కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎ వరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ (U) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు?. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మా పార్టీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
శాసనసభ బీజేపీ పక్షనేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.మహేశ్వర్‌రెడ్డిని బీజేపీఎల్పీ నేతగా నియమిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డిని నియామకం అయ్యారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విదితమే. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించించగా ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. -
‘రేవంత్ పోషించాల్సింది పెద్ద కొడుకు పాత్ర.. కోడలు పాత్ర కాదు’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పోషించాల్సింది కోడలు పాత్ర కాదని, పెద్ద కొడుకు పాత్ర అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడల కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని, అవసరమైతే పార్టీ కోసం ఆయన ఓ మెట్టు దిగిరావాలని అన్నారు. సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పదవుల్లో ఉన్న నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటే అపార్థాలుండవని, కానీ పార్టీ విభేదాలను కోడళ్ల పంచాయితీతో పోలిస్తే మాత్రం పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందేనని, పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీ కోవర్టుల గురించి ప్రతిసారీ చర్చకు రావడం బాధాకరంగా ఉందని, ఈ విషయంలో సీనియర్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. ప్రతి నాయకుడు కోరుకునేది ఆత్మగౌరవమేనని, ఆత్మాభిమానానికి మించింది ఏమీ ఉండదని చెప్పారు. రానున్నది ఎన్నికల సమయమని, ఈ సమయంలో చేయాల్సింది పార్టీ కమిటీల్లో బలప్రదర్శన కాదని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తమ ఆవేదన చెప్పుకుంటామని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
రామారావు పార్టీ మారితే నేను మారతానా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నానని ప్రచారం జరిగిన ప్రతిసారీ తాను ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్‌తో మాట్లాడి పరిష్కరించుకునే చనువు, అవకాశం తనకున్నాయని అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పార్టీ మారితే నాపై కూడా అదే ప్రచారం చేయడం సమంజసంగా లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావుకు సీనియర్ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించారు. అయినా వారిద్దరూ పార్టీ మారారు. అలా అని జానారెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మారుతారని అనుమానిస్తారా?’అని ఏలేటి ప్రశ్నించారు. కాంగ్రెస్ పారీ్టలోకి ఎల్లో, పింక్, ఆరెంజ్ పారీ్టల నుంచి వచి్చనవారు ఉన్నారని, వారిలో ఎవరు తనపై కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పారీ్టనేనని, పార్టీ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడబోనని ఏలేటి స్పష్టం చేశారు. -
రైతుల ప్రథమ శత్రువు సీఎం కేసీఆర్
నేరడిగొండ(బోథ్) ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ప్రథమ శత్రువని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని వడూర్‌లో గురువారం ఆత్మహత్య చేసుకున్న రైతు గాదె రవి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి పోరాడేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను వీడకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 2015 నుంచి నేటివరకు అతివృష్టి, అనావృష్టితో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ రైతుబంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల ఉసురు తగలక మానదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షలు రైతు రుణమఫీని ఏకకాలంలో చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా ప్రణాళికలు రూపొందించి రైతుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్‌కుమార్, బోథ్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మల్లెపూల సత్యనారాయణ, నాయకులు షబ్బీర్ అహ్మద్, ఆదుముల్ల భూషన్, ఫయ్యాజ్, సుభాష్‌గౌడ్, భీంరెడ్డి, సదానందం, రాజశేఖర్‌రెడ్డి, ఎండి సద్దాం, తదితరులు ఉన్నారు. -
2019లో కాంగ్రెస్‌దే అధికారం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ విధానాలపై పోరాడతాం నేరడిగొండ : 2019లో రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం లింగట్ల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకేసారి రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని సీఎం కేసీఆర్ చెప్తున్నాడని, తను మాత్రం ఎడెకరాల స్థలంలో రూ. 50 కోట్లతో ఇళ్లు కట్టుకుంటున్నాడని విమర్శించారు. పింఛన్లు ఇవ్వడం గొప్పకాదు, లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో బలోపేతం చేస్తామని తెలిపారు. ఆ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అధికసంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గారడీ మాటాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మండల నాయకులు ఆడే వసంత్, బాబులాల్, రాజశేఖర్‌రెడ్డి, సాబ్లే ప్రతాప్‌సింగ్, ఆదుముల్ల భూషన్, లచ్చన్న, గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారు'
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌టౌన్ : నిర్మల్ పట్టణంలో, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాస భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ నేతలను అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్‌లోని పురాతన చారిత్రక కట్టడాలు, గొలుసు కట్టు చెరువులు, కోట బురుజులను మంత్రి తన సోదరులతో కలిసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ధర్మసాగర్ చెరువును సైతం మంత్రి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోనే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అవసర మయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నుట్ల తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. -
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఖానాపూర్ : ఎన్నికల్లో బూటకపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాశాన్ని కోల్పోయింద ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు నిర ంతర కరెంటుతోపాటు అర్హుల పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలోని జగన్నాథ్చౌరస్తాలో కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్‌తోపాటు అర్హులందరికీ రూ.1000, రూ.1500లతో పింఛన్, డబుల్ బెడ్రూమ్తో ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి చివరకు బడ్జెట్లోనూ ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా చేతులెత్తాశారని ఎద్దేవా చేశారు. తీ వ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంట పోయి రైతులు ఆత్మహ త్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, లేదంటే ప్ర జాదర్బార్లో నిలబెడతామన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఏఎంకే ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభం 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కోరారు. స్థానిక ఏఎంకే ఫంక్షన్హాల్ల్లో పార్టీ జెండా ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీలు సి.రాచంద్రారెడ్డి, రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకర్గ ఇన్చార్జీలు హరినాయక్, భార్గవ్దేశ్పాండె, అనిల్‌జాదవ్, కాాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.గంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అలెగ్జాండర్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుర్గ భవానీ, జిల్లా ప్లానింగ్‌బోర్డు మెంబర్ ఎంఏ వకిల్, నాయకులు విశ్వప్రసాద్, ముజాఫర్, ఇసాక్, మజీద్, వెంకటేశ్, బాలరాజు, చంద్రయ్య, అర్క కమ్ము, శంకర్, సురేశ్, సత్యం, దయానంద్, రమేశ్ పాల్గొన్నారు. ప్రొటోకాల్ వివాదం స్థానిక ఏఎంకే ఫంక్షన్ హాల్ల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొందరు నాయకులు ప్రొటోకా ల్ పాటించడం లేదంటు బాహాబాహీకి దిగారు. దీంతో పలువురు సీనియర్ నాయకులతో పాటు పోలీసులు చొరవతీసుకోవడంతో వివాదం సమసిపోయింది.