
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.
శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు.
నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment