ఖానాపూర్ : ఎన్నికల్లో బూటకపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాశాన్ని కోల్పోయింద ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు నిర ంతర కరెంటుతోపాటు అర్హుల పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలోని జగన్నాథ్‌చౌరస్తాలో కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.
రైతులకు నిరంతర విద్యుత్‌తోపాటు అర్హులందరికీ రూ.1000, రూ.1500లతో పింఛన్, డబుల్ బెడ్‌రూమ్‌తో ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి చివరకు బడ్జెట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా చేతులెత్తాశారని ఎద్దేవా చేశారు. తీ వ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంట పోయి రైతులు ఆత్మహ త్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, లేదంటే ప్ర జాదర్బార్‌లో నిలబెడతామన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఏఎంకే ఫంక్షన్ హాల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లారు.
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కోరారు. స్థానిక ఏఎంకే ఫంక్షన్‌హాల్‌ల్లో పార్టీ జెండా ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీలు సి.రాచంద్రారెడ్డి, రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకర్గ ఇన్‌చార్జీలు హరినాయక్, భార్గవ్‌దేశ్‌పాండె, అనిల్‌జాదవ్, కాాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.గంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అలెగ్జాండర్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుర్గ భవానీ, జిల్లా ప్లానింగ్‌బోర్డు మెంబర్ ఎంఏ వకిల్, నాయకులు విశ్వప్రసాద్, ముజాఫర్, ఇసాక్, మజీద్, వెంకటేశ్, బాలరాజు, చంద్రయ్య, అర్క కమ్ము, శంకర్, సురేశ్, సత్యం, దయానంద్, రమేశ్ పాల్గొన్నారు.
ప్రొటోకాల్ వివాదం
స్థానిక ఏఎంకే ఫంక్షన్ హాల్‌ల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొందరు నాయకులు ప్రొటోకా ల్ పాటించడం లేదంటు బాహాబాహీకి దిగారు. దీంతో పలువురు సీనియర్ నాయకులతో పాటు పోలీసులు చొరవతీసుకోవడంతో వివాదం సమసిపోయింది.
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
Published Thu, Nov 20 2014 2:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement