public confidence
-
ప్రజా విశ్వాసమే మా బలం
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సెంట్రల్ యూనివర్సిటీ: ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వాలలో తెలంగాణ సర్కార్ ముందంజలో ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుబంధ క్యాంపస్ గోల్డెన్ త్రెషోల్డ్లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. హెచ్‌సీయూ, రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ‘తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలన’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేకే మాట్లాడుతూ 67 శాతం ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వివిధ సంస్థల సర్వేల్లో సైతం ప్రభుత్వానికి మంచి మార్కులు లభించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పన, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీపీఎస్సీ సభ్యులు సి.విఠల్, హెచ్‌సీయూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ఆర్.పి శర్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ వి. కృష్ణ, మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ వెంకట రమణ, దూర విద్యా కేంద్రం డెరైక్టర్ ఎస్.జిలాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జర్నలిజం, కళలు, సంస్కృతి, విద్య, ఉపాధి వంటి అంశాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు పరిశోధక విద్యార్థి వెంకటేష్ చౌహాన్ ఆలపించిన తెలంగాణ గీతాలు ఆలోచింపజేశాయి. నాంపల్లి కోర్టులో ఆవిర్భావ వేడుకలు... సాక్షి, సిటిబ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజ్‌కుమార్, సాయికళ్యాణ్ చక్రవర్తి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి, ఉద్యోగ సంఘం నేతలు నయీముద్దీన్, జి.బాలస్వామి, వనం శ్రీధర్, వీకే రమణమూర్తి, ఎ.వెంకటేశ్వర్లు, టి.సంజయ్‌రెడ్డి, ఖాజా మెయినుద్దీన్, సతీష్‌గౌడ్, సీహెచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలి సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. -
ఆరు నెలల్లోనే వ్యతిరేకత
రుణమాఫీపై అనేక ఆంక్షలు ఎన్నికల హామీలకు తిలోదకాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరు : ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింద ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవా రం పీలేరు మండలం పెద్దిరెడ్డిగారిపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ చంద్రబాబు మాటలకు, చేతల కు పొంతన ఉండదని దుయ్యబట్టారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ పై ఆంక్షలు, నియమ, నిబంధనలు విధించడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. రుణమాఫీలో ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రూ.50 వేలు లోపు పూర్తిగా మాఫీ కాలేదన్నారు. ఎన్నికల సమయంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయని తెలిపారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు చొప్పు న ఇస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరా రు. ఎంపీపీ కే.మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, ఎంపీటీసీ భానుప్రకాష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, కేవీపల్లె జెడ్పీటీసీ జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే మృతికి సంతాపం.. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకట్రమణ మృతికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచి వ్యక్తి మన నుంచి దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఖానాపూర్ : ఎన్నికల్లో బూటకపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాశాన్ని కోల్పోయింద ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు నిర ంతర కరెంటుతోపాటు అర్హుల పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలోని జగన్నాథ్చౌరస్తాలో కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్‌తోపాటు అర్హులందరికీ రూ.1000, రూ.1500లతో పింఛన్, డబుల్ బెడ్రూమ్తో ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి చివరకు బడ్జెట్లోనూ ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా చేతులెత్తాశారని ఎద్దేవా చేశారు. తీ వ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంట పోయి రైతులు ఆత్మహ త్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, లేదంటే ప్ర జాదర్బార్లో నిలబెడతామన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఏఎంకే ఫంక్షన్ హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభం 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కోరారు. స్థానిక ఏఎంకే ఫంక్షన్హాల్ల్లో పార్టీ జెండా ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీలు సి.రాచంద్రారెడ్డి, రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకర్గ ఇన్చార్జీలు హరినాయక్, భార్గవ్దేశ్పాండె, అనిల్‌జాదవ్, కాాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.గంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అలెగ్జాండర్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుర్గ భవానీ, జిల్లా ప్లానింగ్‌బోర్డు మెంబర్ ఎంఏ వకిల్, నాయకులు విశ్వప్రసాద్, ముజాఫర్, ఇసాక్, మజీద్, వెంకటేశ్, బాలరాజు, చంద్రయ్య, అర్క కమ్ము, శంకర్, సురేశ్, సత్యం, దయానంద్, రమేశ్ పాల్గొన్నారు. ప్రొటోకాల్ వివాదం స్థానిక ఏఎంకే ఫంక్షన్ హాల్ల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొందరు నాయకులు ప్రొటోకా ల్ పాటించడం లేదంటు బాహాబాహీకి దిగారు. దీంతో పలువురు సీనియర్ నాయకులతో పాటు పోలీసులు చొరవతీసుకోవడంతో వివాదం సమసిపోయింది. -
శింగనమలలో ‘ఫ్యాన్’ హోరు
బరిలో ఉన్నత విద్యావంతులు రెంటికీ చెడ్డ రేవడైన శైలజానాథ్ తల్లి ఇమేజ్‌పై యామినిబాల దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి పద్మావతి సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ శాసనసభ పదవికి జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఉన్నత విద్యావంతులే. వీరిలో ఒకరు తాజా మాజీ మంత్రి కాగా, మరొకరు మాజీ మంత్రి కుమార్తె. మరొకరు ఉన్నత విద్యా సంస్థకు అధిపతి. విభజన నేపథ్యంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నామమాత్రమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా వైఎస్సార్సీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ నుంచి యామిని బాల బరిలో ఉంటారన్నది స్పష్టం అవుతోంది. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి అందరికన్నా ముందున్నారు. ఆమె ఇంజినీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంతోపాటు, స్థానికురాలు కావడం నియోజకవర్గంలో ఆమెకు లాభించే అంశాలు. పైగా వైఎస్సార్సీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉండడం కూడా కలిసివస్తోంది. భర్త ఆలూరు సాంబశివారెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో ఆమె ఇప్పటికే గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం పూర్తిచేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పద్మావతి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆమె నియోజకవరంపై దృషి ్టసారించి ప్రతి గ్రామంలో పర్యటించి, అక్కడి సమస్యలను అవగతం చేసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలతో మాట్లాడుతూ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రజలనుంచి ఆమెకు మంచి స్పందన లభిస్తోంది కూడా. అయోమయంలో శైలూ టీడీపీ అభ్యర్థి యామిని బాల, కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పవచ్చు. టీడీపీ టిక్కెట్ కోసం వీరిద్దరూ పోటీ పడినప్పటికీ శైలజానాథ్‌కు టీడీపీ మొండిచేయి చూపడంతో గత్యంతరం లేక ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీలో నిలవాల్సి వచ్చింది. పైగా జేసీ సోదరులు ఆడిన నాటకంలో శైలజానాథ్ బలిపశువయ్యారని ఆయన అనుచరులంటున్నారు. టిక్కెట్ విషయంలో నియోజకవర్గంలో శైలజానాథ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారింది. కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేక కార్యకర్తలూ అయోమయంలో పడ్డారు. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర జేఏసీ ఫోరం కన్వీనర్‌గా ఉన్న శైలజానాథ్ ప్రజలను న మ్మించి మోసం చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. దీనికి తోడు మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన కోటరిలోని కొంత మందిని మాత్రకే దగ్గరకు తీసుకున్న ఆయన మిగిలిన వారిని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. గోడమీద పిల్లలా వ్యవహరించి మాజీ మంత్రి చివరకు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసినా ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని నియోజకవర్గ ప్రజలంటున్నారు. తల్లి ఇమేజ్‌తో టీడీపీ అభ్యర్థి యామినిబాల.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు శమంతకమణి ఇమేజ్‌తో ఆమె కూతురు యామిని బాల ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే శమంతకమణికి నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత యామినిబాలపై పడనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో శైలజానాథ్, రఘువీరారెడ్డి ఇద్దరి వద్ద సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు అభివృద్ధి నిధులను విడుదల చేయించుకుని.. ఆ పనులను గుడ్‌విల్‌కు అమ్ముకున్నారని ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను పెంచి మండల నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టేశారని అపవాదు ఉంది. గత సింగిల్‌విండో ఎన్నికల్లో బుక్కరాయసముద్రం సింగిల్‌విండో డెరైక్టర్‌గా టీడీపీ అభ్యర్థి విజయం సాధించినా..ముందుగా కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు శమంతకమణి ఆ డెరైక్టర్‌ను కాంగ్రెస్ ఖాతాలో కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్లే బుక్కరాయసముద్రం సొసైటీని కోల్పోయామని టీడీపీలోని మరో వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. యామిని బాలకు టికెట్టు ఇప్పించినా ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు లేవు. దీనికితోడు ఈమె స్థానికేతరురాలన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏమేరకు సక్సెస్ అవుతారో తెలియని పరిస్థితి. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ హవా.. కాంగ్రెస్, టీడీపీ నాయకులతో విసిగి వేసారి పోయిన నియోజకవర్గ ప్రజలకు పంచాయతీ, సింగిల్ విండో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. నియోజకవర్గంలో మొత్తం116 పంచాయతీలు ఉండగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 68, టీడీపీ 46, కాంగ్రెస్ రెండు పంచాయతీలు దక్కించుకుంది. అలాగే నియోజకవర్గంలో ఏదు సొసైటీలు ఉండగా ఐదు సొసైటీలు వైఎస్సార్సీపీ పరంగా కాగా, టీడీపీ, కాంగ్రెస్‌లు చెరో సొసైటీని దక్కించుకున్నారు. -
నేడు రాహుల్ రాక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనం మెచ్చే విధంగా మేనిఫెస్టోను రూపొందించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి కసరత్తు ప్రారంభించనున్నారు. ప్రజా విశ్వాసం చూరగొనే కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యల ప్రస్తావనతో కూడిన మేనిఫెస్టోను రూపొందించడానికి రచయితలు, మేధావులు, వివిధ రంగాల్లో విజయాలను సాధించిన యువత అభిప్రాయాలను సేకరించాలని ఆయన నిర్ణయించారు. అందులో భాగంగా ప్యాలెస్ మైదానంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు చెందిన యువత ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఆహ్వానితులు మినహా ఇతరులకు ప్రవేశం లేదు. యువ ఓటర్లపై దృష్టి సారించిన కాంగ్రెస్, యువకులైన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ ఈ సమావేశానికి పంపనుంది. ఉదయం నుంచే వారు యువ సాధకుల అభిప్రాయాలను సేకరిస్తారు. రాహుల్ మధ్యాహ్నానికి చేరుకుంటారు. గ్రామీణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించాలని రాహుల్ భావిస్తున్నారు.