రుణమాఫీపై అనేక ఆంక్షలు
ఎన్నికల హామీలకు తిలోదకాలు
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పీలేరు : ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింద ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవా రం పీలేరు మండలం పెద్దిరెడ్డిగారిపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ చంద్రబాబు మాటలకు, చేతల కు పొంతన ఉండదని దుయ్యబట్టారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ పై ఆంక్షలు, నియమ, నిబంధనలు విధించడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. రుణమాఫీలో ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రూ.50 వేలు లోపు పూర్తిగా మాఫీ కాలేదన్నారు. ఎన్నికల సమయంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయని తెలిపారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు చొప్పు న ఇస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరా రు. ఎంపీపీ కే.మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, ఎంపీటీసీ భానుప్రకాష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, కేవీపల్లె జెడ్పీటీసీ జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే మృతికి సంతాపం..
తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకట్రమణ మృతికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచి వ్యక్తి మన నుంచి దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఆరు నెలల్లోనే వ్యతిరేకత
Published Tue, Dec 16 2014 2:17 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement