సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనం మెచ్చే విధంగా మేనిఫెస్టోను రూపొందించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి కసరత్తు ప్రారంభించనున్నారు. ప్రజా విశ్వాసం చూరగొనే కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యల ప్రస్తావనతో కూడిన మేనిఫెస్టోను రూపొందించడానికి రచయితలు, మేధావులు, వివిధ రంగాల్లో విజయాలను సాధించిన యువత అభిప్రాయాలను సేకరించాలని ఆయన నిర్ణయించారు.
అందులో భాగంగా ప్యాలెస్ మైదానంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు చెందిన యువత ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఆహ్వానితులు మినహా ఇతరులకు ప్రవేశం లేదు. యువ ఓటర్లపై దృష్టి సారించిన కాంగ్రెస్, యువకులైన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ ఈ సమావేశానికి పంపనుంది. ఉదయం నుంచే వారు యువ సాధకుల అభిప్రాయాలను సేకరిస్తారు. రాహుల్ మధ్యాహ్నానికి చేరుకుంటారు. గ్రామీణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించాలని రాహుల్ భావిస్తున్నారు.
నేడు రాహుల్ రాక
Published Sat, Jan 11 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement