పని ఒత్తిడితో వెళ్లలేదు | Stressful work, but did not | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితో వెళ్లలేదు

Published Tue, May 27 2014 2:41 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

పని ఒత్తిడితో  వెళ్లలేదు - Sakshi

పని ఒత్తిడితో వెళ్లలేదు

  •  రాజకీయ కారణాలేమీ లేవు
  •  మోడీ ప్రమాణ స్వీకారానికి గైర్హాజర్‌పై సిద్ధు  
  •  సాక్షి, బెంగళూరు : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకపోవడానికి ఎలాంటి రాజకీయ కార ణాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తాను పని ఒత్తిడిలో ఉన్న కారణంగానే  వెళ్లలేక పోయానని చెప్పారు. నగరంలో బీబీఎంపీ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని సిద్ధరామయ్య చెప్పారు. అయితే ఇంతకుముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తాను ఢిల్లీ వెళ్లలేకపోయాయని తెలిపారు.

    కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు అనేక మంది నేతలు మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారని, అలాంటి సందర్భంలో తాను మాత్రం రాజకీయ కారణాలతోనే హాజరుకాలేదని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను లేఖ పంపానని వెల్లడించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement