సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి.
దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్‌లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్‌లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్
Comments
Please login to add a commentAdd a comment