parilament
-
అభివృద్ధి కోసమే ‘జమిలి’: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్ -
Cash for query scam: ‘మహువా’కు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలడిగిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన దర్శన్ హీరానందాని, ఇతర వ్యక్తులతో కలిసి మహువా కుట్ర పన్నారని, పార్లమెంటు కల్పించిన ప్రత్యేక హక్కులను సొంతానికి వాడుకుని జాతి భద్రతను ప్రమాదంలో పడేశారని కేసు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. లోక్‌పాల్ ఆదేశాల మేరకు మార్చ్ 21నే సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసులో మహువాతో పాటు చేర్చిన ఇతర నిందితుల పేర్లు, సెక్షన్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణలో సీబీఐ ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని మహువా ఇళ్లపై ఇటీవల సీబీఐ సోదాలు కూడా జరిపింది. కాగా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని వద్ద డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లక్ష్యంగా మహువా ప్రశ్నలడిగారన్న ఆరోపణలపై లోక్‌సభ నుంచి ఆమె సభ్యత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 8న స్పీకర్ రద్దు చేశారు. అంతకుముందు ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఆమె స్నేహితుడు హీరానందాని స్వయంగా లేఖ రాశారు. మహువా తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తనకు ఇచ్చారని దీని ద్వారా తాను ప్రశ్నలను నేరుగా పోస్ట్ చేయగలిగానని లేఖలో తెలిపారు. ఇది మోదీ రాయించిన లేఖ అని అప్పట్లో మహువా మండిపడ్డారు. కాగా, తాజాగా కేసులో మహువాతో పాటు హీరానందానిని కూడా ప్రధాన నిందితునిగా చేర్చడం గమనార్హం. ఇదీ చదవండి.. సునీత మరో రబ్డీ అయ్యేనా -
పార్లమెంట్ భవనంలో భద్రతా సమస్యలు: కేంద్రం
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం చాలా పురాతనమైందని, దీని స్థానంలో కొత్త భవనం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 100 సంవత్సరాలకు పైబడిన ప్లారమెంట్ భవనం భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో పాటు అగ్రిప్రమాదాలు తలెత్తితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత పార్లమెంటు భవానాన్ని కూల్చి కొత్తది నిర్మిస్తామని సుప్రీంకు వివరించింది. '1921లో చేపట్టిన పార్లమెంట్ భవన నిర్మాణం 1937లో పూర్తైంది. ఇప్పటికే వందేళ్లు గడిచిపోయాయి. కాలక్రమేణా పార్లమెంటరీ కార్యకలాపాలు కూడా పెరిగాయి. అందువల్ల ప్రస్తుత పార్లమెంట్ భవనం సౌకర్యాలు, సాంకేతిక అవసరాలను తీర్చలేకపోతుంది. 1956లోనూ రెండు కొత్త అంతస్తులు కట్టారు. అయితే అగ్ని మాపక నిబందనలకు తగ్గట్లు ఏమాత్రం లేదు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా భవనాన్ని కూల్చి కొత్తది నిర్మిస్తాం' అంటూ కేంద్రం విన్నవించింది. (మందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు) -
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
-
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
* వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి * పబ్లిసిటీ ఫిలిం షూటింగ్ కోసం 29 ప్రాణాలు బలిగొన్న * బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదే * ఇదే విషయాన్ని పార్లమెంటుకు వివరిస్తాం * ప్రత్యేక హోదాతోపాటు ‘ఓటుకు కోట్లు’ అంశాన్నీ లేవనెత్తుతాం * మార్పులు చేయకపోతే భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదు * వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎంపీల భేటీ * పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ (లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి) సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో భక్తుల ప్రాణాలు బలిగొన్న తొక్కిసలాట ఘటనను పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తేవాలని ప్రయత్నిస్తున్న భూసేకరణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు గుమ్మరించిన చంద్రబాబుకు సంబంధించిన ‘ఓటుకు కోట్లు’ కేసును కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని తీర్మానించింది. ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం సహచర ఎంపీలతో కలసి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రచారంకోసం ఒక డాక్యుమెంటరీ తీయడానికి రాజమండ్రి పుష్కరాలను వేదికగా చేసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణానికి కారణమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనకు పూర్తిబాధ్యత చంద్రబాబుదేనంటూ.. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ పదవిని గెలవాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారాన్నీ పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. ఇందులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరతామన్నారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపైనా.. ధాన్యం రైతులకు మద్దతుధరను ప్రభుత్వం కేవలం రూ.50 మాత్రమే పెంచిందని, దీనిని మరింత పెంచాలని కోరతామని మేకపాటి చెప్పారు. ఎంఎస్పీ ధర పెంపుతోపాటు ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణను ఏడాదికేడాది తగ్గిస్తున్న వైనంపైనా సభలో చర్చ కోరతామన్నారు. 2013-14లోకన్నా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గిపోయిందని, ఈ ఏడాది మరింత తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఇలాంటి చర్యలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికోసం ఎక్కువగా నీటి వృ థా చేయడంవల్ల రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూ రు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ చర్యకు వై ఎస్సార్సీపీ వ్యతిరేకమని ఆయన చెప్పా రు. తప్పనిసరిగా శ్రీశైలంలో నిర్ణీతస్థాయిలో నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పార్లమెం ట్లోనూ ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిందని.. రెండుసార్లు ఈ అంశాన్ని జీరోఅవర్‌లో ప్రస్తావించామని ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్లకార్డులతో సభలో ఆం దోళన చేయడాన్నీ గుర్తుచేశారు. సమావేశంలో మేకపాటితోపాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, పెద్దిరెడ్డి మి థున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలున్నందున హాజరవలేదు. విభజన బిల్లులోని అంశాల అమలుకు పోరాటం.. ప్రస్తుత ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని మేకపాటి స్పష్టం చేశారు. మూడు.. నాలుగు పంటలు పండే భూముల్ని తీసుకోవడం, సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) చేయకుండా, రైతుల అంగీకారం లేకుండానే భూములు లాక్కోవడం వంటి ప్రక్రియలకు తమ పార్టీ మొదటినుంచీ వ్యతిరేకమని చెప్పారు. ఆ మూడంశాల్లో రైతులకు ఆమోదయోగ్యంగా మార్పులు చేసినట్లయితే బిల్లుకు తాము మద్దతిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు అంశాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుతోపాటు విభజన బిల్లులో పేర్కొన్న అన్నిఅంశాల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. -
పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీని పరిచయం చేశారు. ఫుడ్ కమిటీ ఛైర్మన్‌గా టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి నియమితులైన తరువాత.. ఇక్కడి వంట వారిని నలుగురిని హైదరాబాద్ తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. మంగళవారం నుంచి ఈ వంటకాన్ని పార్లమెంటులో అందిస్తున్నారు. -
తెలుగువారి పరువు తీయొద్దు: సుజనా
సాక్షి, న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో చిన్నచిన్న సమస్యలు తప్పవని, వాటిని ఇరువురు సీఎంలు పరిష్కరించుకోవాలి తప్ప పార్లమెంట్‌లోకి తెచ్చి తెలుగువారి పరువు తీయొద్దని టీడీపీ పార్లమెంటరీ నేత వై.సుజనాచౌదరి టి. ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ దగ్గరుండి బిల్లును పాస్ చేయించాయని, ప్రస్తుతం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల్ని అమలు చేసే సమయంలో అడ్డుకోవడం సరికాదన్నారు. టి సర్కారు 19న చేపట్టిన సమగ్ర సర్వే రాజ్యాంగానికి విరుద్ధమని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. -
ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
* ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం * రికార్డు స్థాయిలో లోక్‌సభ సభ్యుల ప్రమాణం * సంప్రదాయ దుస్తులు, పలకరింపులు, అభినందనలతో ఉల్లాస వాతావరణం * మోడీ సహా 300 మందికిపైగా తొలిసారి ఎన్నికైన వారే * నేడు మిగతా వారితో ప్రమాణం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక గురువారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక న్యూఢిల్లీ: ప్రధానితో సహా రికార్డు స్థాయిలో 510 మంది కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు, నేతల పలకరింపులు, పరస్పర శుభాకాంక్షలతో 16వ లోక్‌సభ సమావేశాల రెండో రోజు పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 300 మందికిపైగా ఎంపీలు తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన వారే కావడం విశేషం. దీంతో సభలో ఏకత్వంలో భిన్నత్వం ప్రస్ఫుటించింది. ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారం భారీ సంఖ్యలో ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక్క రోజులోనే 510 మంది ప్రమాణం చేయడం మరో విశేషం. చాలా మంది తమ మాతృభాషలోనే ప్రమాణం చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. తెల్లటి కుర్తా పైజామాలో సభకు వచ్చిన ప్రధాని మోడీ సభ్యుల హర్షధ్వానాల మధ్య తొట్టతొలిగా దేవునిసాక్షిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రమాణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మరో మంత్రి హర్షవర్ధన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, సిద్ధేశ్వర కన్నడలో... సర్వానంద సోనోవాల్ అస్సామీలో.. జుయల్ ఓరం ఒడియాలో ప్రమాణ పత్రాన్ని చదివారు. వరుసకు సోదరులైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కూడా ఒకరి తర్వాత మరొకరు హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక వరుణ్ తన సీటు వద్దకు వెళ్తూ సోనియాకు వందనం చేశారు. అయితే ఆయన రిజిస్టర్లో సంతకం చేయకపోవడంతో సోనియా ఆ విషయాన్ని గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌తో పాటు ఆయన కోడలు డింపుల్, ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అన్నాడీఎంకే సభ్యుల్లో అత్యధికులు తమిళంలో.. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషల్లోనే ప్రమాణం చేశారు. కొత్త రాష్ర్టం తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన మొదటి ఎంపీగా జి. నగేశ్ (టీఆర్ఎస్) ప్రత్యేకంగా నిలిచారు. మొత్తానికి అధికార, విపక్ష సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకోవడంతో లోక్‌సభలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. శుక్రవారం మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఎన్నిక జరగ నుంది. రెండో రోజు దాదాపు 30 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణకు చెందిన మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 37 మంది ప్రమాణం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ సభ్యులు కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలకు గాను తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ హాజరుకాలేదు. తెలంగాణలో 17 స్థానాలుండగా.. మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 16 మంది ఎంపీల్లో ఇద్దరు గైర్హాజరయ్యారు. ముందుగా కేంద్ర మంత్రులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజు హిందీలో ప్రమాణం చేశారు. తర్వాత మధ్యాహ్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలు కొత్తపల్లి గీత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డాక్టర్ రవీంద్రబాబు, గోకరాజు గంగరాజు, మాగంటి వెంకటేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్, జయదేవ్ గల్లా, మాల్యాద్రి శ్రీరాం, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, వి.వరప్రసాద్‌రావు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా.. డాక్టర్ కంభంపాటి హరిబాబు, తోట నర్సింహం, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావు, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె..ఎస్.అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. ఇక కింజారపు రామ్మోహన్నాయుడు, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.25 గంటలకు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బాల్క సుమన్, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత , కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.పి.జితేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి ఆంగ్లంలో ప్రమాణం చేయగా సి.హెచ్.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగులో.. జి.నగేశ్, బండారు దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హిందీలో.. అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. -
సీఎంగా రేపే ఆఖరి రోజు: కిరణ్!
హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా రేపే ఆఖరి రోజు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వేదాంతం మొదలుపెట్టారు. శాసనసభ వాయిదా అనంతరం ఆయన విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ సీఎంగా రేపే అఖరి రోజు అనగా...రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకు అసెంబ్లీ గురువారంతో ముగుస్తుందంటూ నవ్వుతూ చెప్పారు. నేడు చుట్టీ..... రేపు చాట్ (ముచ్చట) అంటూ ముందుకు కదిలారు. మొదటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొత్త పార్టీ కూడా పెడతారని వార్తలు వచ్చిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా సీఎం కిరణ్ తమ పదవికి రాజీనామా చేస్తారని, ఈరోజు, రేపంటూ వదంతులు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సీఎంకు పార్టీ పెద్దలు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానని సీఎం ఇంతకు ముందు ప్రకటన చేయడం తెలిసిందే. ఆ మేరకే ఆయన తో రాజీనామా చేయించేలా పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారు. ఈ మేరకే కిరణ్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
అటు బిల్లు.. ఇటు రాజీనామా !
-
నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే
-
నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఖర్గే న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంటులో తన మొట్టమొదటి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రైల్వే చార్జీల భారం పెద్దగా మోపకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో లోటు బడ్జెట్‌లా కాకుండా, దీన్ని అభివృద్ధి దాయక బడ్జెట్‌లా రూపొందించారని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే, 2013 ఏప్రిల్, డిసెంబర్ నెలల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణా ఆదాయం భారీగా తగ్గినందువల్ల ప్రయాణికుల చార్జీల తగ్గింపు ఉండకపోవచ్చని తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రయాణ చార్జీల ఆదాయంలో రూ. 4 వేల కోట్లు, సరకుల రవాణా ఆదాయంలో రూ. 850 కోట్ల తగ్గుదల కనిపించింది. రైల్వే వర్గాలు తెలిపిన ఇతర వివరాలు.. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక ప్రకటనలు ఉండకపోవచ్చు. మరిన్ని రైళ్లు, రైల్వే లైన్లు, ప్రయాణికుల సౌకర్యాలను ప్రకటించవచ్చు. {పయాణికుల భద్రతకు సంబంధించిన పలు చర్యలను ప్రకటించవచ్చు. ఎంపీల డిమాండ్ మేరకు పలు లైన్ల పొడిగింపు, కొత్త లైన్ల కొరకు సర్వే తదితర ప్రకటనలు ఉండొచ్చు. మరో 1500 కిమీల రైల్వేలైన్ విద్యుదీకరణకు నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం 65 వేల కి.మీ.ల రైల్వేలైన్‌లో ఇప్పటివరకు కేవలం 24 వేల కి.మీ.ల లైన్‌ను మాత్రమే విద్యుదీకరించారు. రద్దీ అధికంగా ఉండే మార్గాల్లోని 20 ప్రధాన రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేసి.. ఆదాయ లోటును తగ్గించుకునే దిశగా ఒక ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. 2009 ఎన్నికల సంవత్సరం నాటి బడ్జెట్లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయాణికుల చార్జీలను 2 శాతం తగ్గించారు. అయితే, ఈ సారి ఆశించిన ఆదాయం లేకపోవడంతో తగ్గుదల నిర్ణయం ఉండకపోవచ్చు. {పయాణికులపై భారం తగ్గించే దిశలో ఇంధన సర్దుబాటు చార్జీలో మార్పులు చేయొచ్చు. పలు రైళ్లలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలను కూడా రైల్వేమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. ముఖ్యమైన రైళ్లలో అగ్నిప్రమాదాల నిరోధానికి చేపట్టిన చర్యలను వివరించే అవకాశముంది. అన్ని స్టేషన్లలో ఆధునీకరించిన రైల్వే సమాచార వ్యవస్థ ఏర్పాటు, ప్రధానస్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ఏర్పాటుపై ప్రకటన చేయొచ్చు. సంస్కరణలు కోరుకునే మంత్రిగా పేరున్న ఖర్గే.. రైల్వే ఆదాయాన్ని పెంచే దిశగా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలు, దురంతో ట్రైన్ల చార్జీల్లో పెంపు మొదలైనవి అందులో ఉన్నాయి. అలాగే, ఢిల్లీ- ముంబై మార్గంలో ప్రత్యేక రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేయడం వల్ల దాదాపు 35 శాతం అధిక ఆదాయం లభించింది. తప్పుడు నిర్ణయాలతో రైల్వేకు రూ. 2,486 కోట్ల నష్టం: కాగ్ న్యూఢిల్లీ: సరుకుల రవాణాలో ద్వంద్వ చార్జీల విధానానికి సంబంధించి అవకతవక నిర్ణయాల వల్ల రైల్వేశాఖకు 2008-12 మధ్యకాలంలో రూ. 2486.68 కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వెల్లడించింది. ముడి ఇనుము ఖనిజ రవాణాకు తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల ఈ నష్టం జరిగినట్లు పేర్కొం ది. కాగ్ పేర్కొన్న వివరాలు.. 2008 మేలో రైల్వే శాఖలో ద్వంద్వ చార్జీల విధానాన్ని ప్రారంభిం చారు. దీనివల్ల ముడి ఇనుము ఖనిజం ఎగుమతి రవాణా చార్జీలు.. దేశీయ అవసరాల కోసం జరిపే రవాణా చార్జీల కన్నా 3 రెట్లు ఎక్కువ. దేశీయ రేట్ల వర్తింపునకు అర్హత కల్పించే ఎలాంటి పత్రాలను సమర్పించకపోయినా.. 358 సంస్థలకు దేశీయ రేట్లను వర్తింపజేశారు. వాటిలో 153 సంస్థలు అసలే పత్రాలను అందించలేదు. వీటికి తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల 2008-12 మధ్య రూ.258.38 కోట్లను రైల్వేశాఖ నష్టపోయింది. 205 సంస్థలు కొన్ని డాక్యుమెంట్లను అందించాయి. వీటికి దేశీయ రేట్లను అంగీకరించడంతో రూ.2,228.30 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ‘ప్లాన్ హాలిడే’: దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ గుంతకల్లు, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్‌కోసం ఆర్థిక అంశాలతో ముడిపడిన ఏ కొత్త ప్రతిపాదనను పంపలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి గుంతకల్లులో విలేకరులతో మాట్లాడారు. 15 రోజులక్రితం న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు కార్యాలయంలో జనరల్ మేనేజర్ల సమావేశంలో గత ప్రతిపాదనలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యతివ్వాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే భారీగా నిధులు అవసరమవుతాయని, అందువల్ల ఆ ప్రయత్నాన్ని ఈ ఏడాది విరమించామని చెప్పారు. ఈ ఏడాది రైల్వేలో పరోక్షంగా ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో కోచ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి అవసరమైన రూ.250 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశముం దన్నారు. డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో రైల్వేపై భారం పడుతోందని, దీంతో విద్యుదీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. -
అటు బిల్లు.. ఇటు రాజీనామా !
ఎంపీల బహిష్కరణతో పార్టీకి మరికొందరు రాజీనామాలు చేయొచ్చు వారికి నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం చే స్తూ సీఎంతో రాజీనామా అసెంబ్లీలో గందరగోళం రేకెత్తించి, ఆపై సభలోనే రాజీనామా ప్రకటన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్న మరో 50 మంది ఎమ్మెల్యేలు బహిష్కృత ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో సీఎం ధర్నా! రెండు ప్రాంతాల్లో సీఎం పీఠం కోసం అప్పుడే మొదలైన లాబీయింగ్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అటు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సీఎంకు పార్టీ పెద్దలు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానని సీఎం ఇంతకు ముందు ప్రకటన చేయడం తెలిసిందే. ఆ మేరకే ఆయన తో రాజీనామా చేయించేలా పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీల బహిష్కరణపై గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ... ఇది దురదృష్టకరమనీ, సోనియాగాంధీ ఆదేశిస్తేనే సీఎం రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీలపై బహిష్కరణ చర్యలతో మరింత మంది పార్టీ నుంచి రాజీనామాలు చేయవచ్చని, ఆ సమయంలోనే వారందరికీ నాయకత్వం వహించేలా సీఎంతో కూడా రాజీనామా చేయించాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా స్పష్టమవుతోంది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అవకాశం లభిస్తే సభలోనే ఆయనతో రాజీనామా ప్రకటన చేయించాలని భావిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సభలో తీవ్ర గందరగోళం రేకెత్తించి ఆపై సీఎంతో రాజీనామా ప్రకటన చేయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ గందరగోళంలోనే ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించి సభను ముగించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి ఇదివరకే రూపొందించిన రోడ్‌మ్యాప్‌పై హైకమాండ్ పెద్దలు మంగళవారం నాటి కోర్‌కమిటీ భేటీలో చర్చించారు. సీఎం, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్య వాదనను వినిపించేందుకు వీలు లేకుండా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సభను స్తంభింపచేస్తారని, ఆ సమయంలో సీఎం అక్కడ్నుంచి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించేలా కార్యాచరణను నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో సీఎం రాజీనామా చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదిస్తారా? లేక తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కూడా కోర్ కమిటీలో చర్చించారు. రాజీనామాలకు 50 మంది ఎమ్మెల్యేలు సిద్ధం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంతోపాటే రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఈ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు... దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పదవికి, పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుండటం, అదే సమయంలో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవనే నిర్ణయానికి రావడంతో ఇక పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే అంచనాకు వచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కొత్త పార్టీ పెడతారని ఇదివరకే ప్రచారం సాగుతున్నందున వారంతా సీఎం వెంటే నడిచేలా వ్యూహం రూపొందించినట్టు ఆ నేతలు పేర్కొంటున్నారు. హస్తినలో ధర్నా యోచన: రాజీనామా అనంతరం రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులందరితోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిరణ్ ఢిల్లీలో ధర్నా చేయనున్నారని సీఎం సన్నిహిత మంత్రి ఒకరు చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు వేలాది మందిని తరలించనున్నట్లు తెలిసింది. జనాన్ని తరలించే బాధ్యతను లగడపాటి రాజగోపాల్‌తో సహా కొందరు ఎంపీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈనెల 15న వేలాది మందిని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు 7 ప్రత్యేక రైళ్లను బుక్ చేయించే పనిలో లగడపాటి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. సీఎం పీఠం కోసం లాబీయింగ్: తెలంగాణ, సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు సీఎం పీఠం కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు సీఎం పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య రేసులో ఉంటారు. వీరిలో డిప్యూటీ సీఎం, డీఎస్, సర్వే ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. గత రెండ్రోజులుగా డీఎస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలిశారు. తాజాగా డిప్యూటీ సీఎం మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్‌తోపాటు దిగ్విజయ్‌సింగ్‌ను దామోదర కలిసినట్లు తెలిసింది. మేం సైతం అంటున్న ఆనం, రఘువీరా, కన్నా.. సీమాంధ్ర విషయానికొస్తే సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు జోరుగా విన్పిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీఎం పీఠం కోసం యత్నిస్తున్నప్పటికీ ఆయనకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే కన్నా గత రెండ్రోజులుగా హస్తినలో మకాం వేశారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వచ్చిన కన్నా పనిలో పనిగా సీఎం సీటు కోసం లాబీయింగ్ తీవ్రతరం చేశారు. సోమవారం సాయంత్రం కన్నా.. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసినట్టు తెలిసింది. ఆ తర్వాత దిగ్విజయ్‌సింగ్ స్వయంగా కన్నా లక్ష్మీనారాయణను వెంటబెట్టుకుని టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రపతి పాలన వైపు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన త ర్వాత రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ సంక్షోభ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే రచించిన వ్యూహాన్ని నడిపించడంలో భాగంగా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించడంపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మంత్రులతో సీఎం భేటీ..: కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలపై బహిష్కరణ వేటుపై చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. మంత్రులు పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, కొండ్రు మురళీ మోహన్, కాసు కృష్ణారెడ్డి తదితరులు సీఎంతో భేటీ అయిన వారిలో ఉన్నారు. -
టీ-బిల్లు తేవడంతో జాప్యం!: కోదండరాం
రెండు నెలలు గడుస్తున్నా కేబినెట్ భేటీ కాలేదు: కోదండరాం సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణపై నోట్ తయారుచేసి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ కేబినెట్ భేటీ కాలేదన్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన దీక్షాదివస్‌లో, తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ కమిటీ హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధనా సదస్సు లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ 2009లో చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలేపిందన్నారు. అన్నివర్గాల మద్దతు, ప్రజల పోరాటంతో తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం కదిలిందన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ బద్ధంగా నడవకపోతే బేడీలు వేసి జైలుకు పంపాల్సిందేనని హెచ్చరించారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కిరణ్ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేకుండా తుపాకీ రామునిలాగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రసాధనలో చూపిన ఐక్యతనే విభజన అనంతరం జరిగే పునర్నిర్మాణంలోనూ కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో నిషేధానికి గురైన తెలంగాణపదం నిత్యం పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు కేసీఆర్ కృషే కారణమని చెప్పారు. ‘టీఆర్ఎస్ను ఏ పార్టీలోనూ కలపొద్దు’ అని 99శాతం మంది తెలంగాణ ప్రజలు తమను కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని టీఆర్ఎస్ గౌరవిస్తుందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, కుటుంబానికి 5-10లక్షల పరిహారం అందించేందుకు కృషిచేస్తామన్నారు. టీఆర్ఎస్ అగ్రనేత కే. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం సాగినంత సుదీర్ఘ ప్రక్రియ మరే రాష్ర్టం ఏర్పాటులోనూ జరగలేదన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటుకాకుంటే మలిదశ పోరాటానికి సిద్ధంకావాలని జేఏసీ నేత విఠల్ సూచించారు. మరోనేత శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిస్తూ హైదరాబాద్, మునగాల, భద్రాచలం వంటి ప్రాంతాలపై ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణపై అన్నివర్గాల అభిప్రాయం తీసుకున్న తర్వాత కేంద్రం ముందుకు వెళుతున్నప్పటికీ కొన్నిపార్టీలు వైఖరి మార్చుకున్నాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్, నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడారు. టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ టీవీవీ అధ్యక్షుడు శ్రీధర్ దేశ్‌పాండే రాసిన బట్వారా (వ్యాసాల సంకలనం)ను కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య ఆవిష్కరించారు. పదిజిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ఏర్పాటుచేయాలంటూ సదస్సులో తీర్మానించారు. -
కాంగ్రెస్‌నేతలకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్: ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సొంతూరులోనే చుక్కెదురైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ బెజవాడలో ఆర్టీసీ కార్మికులు నిలదీశారు. బుధవారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఏపీ ఎన్జీవోల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీని చూడగానే ఆర్టీసీ కార్మికుల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమైక్యం కోసం తాము జీతాలు, ఉద్యోగాలు కూడా పణంగా పెట్టి ఉద్యమం చేస్తుంటే రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడతారా అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ మోహరించిన పోలీసులు ఎంపీని సురక్షితంగా శిబిరం నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో నిరాహార దీక్ష కోసం ఏర్పాటు చేసిన షామియానాలు కుప్పకూలిపోయాయి. కాగా, మంత్రి కొలుసు పార్ధసారథిని సైతం మహిళలు కృష్ణలంకలో చుట్టుముట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తులసిరెడ్డిపై చెప్పు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటైన సమావేశానికి వచ్చిన రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డికి పరాభవం ఎదురైంది. ఆయన సమైక్యవాదుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా, రాజీనామాలు ఆమోదించుకుని వచ్చి మాట్లాడాలని జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు యత్నించగా అక్కడా అడ్డుకున్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి కారుపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొడగొట్టి మీసం తిప్పారు. కాగా, కేంద్ర సహాయమంత్రి పనబాకలక్ష్మి గత 50రోజుల నుంచి కనబడటం లేదంటూ గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గుడుపూడి గ్రామానికి చెందిన సమాచార హక్కుచట్టం రాష్ట్ర కార్యదర్శి నలజాల వేదవ్యాస్ ఫిర్యాదు చేశారు. -
ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్:టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఆహార భద్రత బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగితే అందుకు అనుకూలంగా ఓటు వేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు పొడిగించే అవకాశాలున్నాయనే కారణంతో ఢిల్లీకి రెండుమూడ్రోజుల తర్వాత వెళ్లాలని అనుకున్నారు. అయితే యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లుపై పార్లమెంట్లో సోమవారం ఓటింగ్ జరిగే అవకాశముందని ఆదివారం ఉదయమే కేసీఆర్‌కు సమాచారం అందినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటేయకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, జి.జగదీశ్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లడానికి ముందు ఆయన నివాసం వద్ద నిరీక్షించిన మీడియాతో కేసీఆర్ మాట్లాడకుండా నేరుగా కారెక్కి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఆహార భద్రతపై ఉన్నట్టుగానే తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం అంతే కచ్చితంగా ఉందని, ఆహార భద్రత బిల్లుపై యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎవరైనా కేసీఆర్‌ను పిలిచారా? అందుకే ఢిల్లీ వెళ్తున్నారా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ టీఆర్ఎస్ విలీనం విషయంపైనా మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చేసిన ప్రకటనను ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత విలీనానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎలాంటి సంకేతాలు టీఆర్ఎస్కు రాలేదని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆంటోని నేతృత్వంలో కమిటీ వేసినా, తాజాగా మరో అధికారిక కమిటీ వేస్తున్నట్టు సోనియాగాంధీ చెప్పిన విషయాలపై టీఆర్ఎస్ స్పందించలేదు. అయినప్పటికీ కాంగ్రెస్‌తో సానుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆహార భద్రత బిల్లు విషయంలో మద్దతునివ్వాలని నిర్ణయించి ఢిల్లీ బయలుదేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కాంగ్రెస్ ముఖ్యులను కలిసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ సందర్భంగా పార్టీ విలీనం అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు విలీనం విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం తొందరపాటుతో లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు విజయశాంతి, విజయరామారావు, చంద్రశేఖర్ తదితర నేతలను చేర్చుకోవడం ద్వారా విలీనం విషయంలో కాంగ్రెస్ తొందరపడటం లేదన్న విషయం కేసీఆర్‌కు అర్థమైందని అంటున్నారు. -
లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలు