తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం | will raise a question about Godavari puskaras stampede in Rajamandry | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 19 2015 6:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఈ నెల 21 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం సహచర ఎంపీలతో కలసి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రచారంకోసం ఒక డాక్యుమెంటరీ తీయడానికి రాజమండ్రి పుష్కరాలను వేదికగా చేసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణానికి కారణమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనకు పూర్తిబాధ్యత చంద్రబాబుదేనంటూ.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ పదవిని గెలవాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారాన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. ఇందులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరతామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement