Godavari puskaralu
-
పరిహారం... పరిహాసం
- ‘పుష్కర’ తొక్కిసలాట బాధితులకు ఇంకా అందని పరిహారం - గాయపడింది 51 మంది,, పరిహారం ఇచ్చింది 30 మందికే - బాధితులు, న్యాయవాదుల విజ్ఞప్తులు పట్టించుకోని ప్రభుత్వం - రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు - పొంతన లేని పోలీసు, రెవెన్యూ అధికారుల లెక్కలు - ఆరుగురికే అందిన కేంద్ర సాయం సాక్షి, రాజమహేంద్రవరం: తన ప్రచార యావ కోసం 28 మంది మృతికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. గోదావరి పుష్కరాల మొదటి రోజు 2015 జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటనలో పోలీసులు లెక్కల ప్రకారం 51 మంది గాయపడ్డారు. వీరిలో మొదటగా 28 మందికి రూ.25 వేల చొప్పున 2015లో ప్రభుత్వం నష్ట పరిహారం అందించింది. న్యాయవాదులు, ప్రజాప్రతినిధుల పోరాటం చేయడంతో మరో ఇద్దరికి ఇచ్చారు. ఇంకా మిగిలిన 21 మందికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. దీనిపై బాధితులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వ పెద్దలు కరుణించడం లేదు. బాధితుల తరఫున రాష్ట్ర మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు.. జిల్లా కలెక్టర్‌ను పలుమార్లు కలసినా, లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆయన రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయంచారు. గోదావరి పుష్కరాల సమయంలో పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిలో 21 మందికి నష్టపరిహారం ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన మానవ హక్కుల సంఘం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. తాజాగా పుష్కరాల నుంచి ఉన్న జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కు మార్ బదిలీపై వెళ్లిపోయారు. కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా వచ్చారు. అధికారుల మధ్య సమన్వయలోపం...: గాయపడ్డవారిని లెక్కించడంలో పోలీసు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పోలీసుల లెక్కల ప్రకారం గాయపడ్డవారు 51 మంది, వీరిలో ఇప్పటికి 30 మందికి నష్టపరిహారం చెల్లించారు. ఇక రెవెన్యూ అధికారులు గాయపడ్డవారు ఆరుగురే అంటూ కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు పంపించారు. కేంద్రం ఆ ఆరుగురికే రూ.50 వేల చొప్పన పరిహారం అందజేసింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గాయపడ్డవారిలో 45 మంది కేంద్రం నుంచి వచ్చే రూ.50 వేల నష్టపరిహారం కోల్పోయారు. సమన్వయలోపం స్పష్టమవుతోంది...: పుష్కరాల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనపడుతోంది. పోలీసు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో గాయపడ్డవారికి తీవ్ర నష్టం జరిగింది. ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏమిటన్న వివరాలు సేకరించలేకపోతే ఎలా? ఈ ఒక్క ఘటనతో పుష్కరాలు ఎలా నిర్వహించారో తెలుస్తోంది. ఇప్పటికైనా గాయపడ్డవారికి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్రప్రభుత్వ సాయం అందేలా చూడాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకులకు బుద్ధి లేదు: చంద్రబాబునాయడు ప్రచారార్భాటం వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది గాయపడ్డారు. తన తప్పు వల్ల ఇన్ని కుటుంబాలు నష్టపోయాయి. ఎంత నగదు ఇచ్చినా వారిని తీసుకురాలేము. గాయపడ్డవారు ఎలా ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోలేదు. కనీసం వారందరికీ పరిహారం ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకపోవడం సిగ్గుచేటు. పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గాయపడ్డవారికి నష్ట పరిహారం ఇవ్వాలి. – జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాది, బాధితుల తరఫు అఫిడవిట్‌దారు ప్రభుత్వ లెక్కల ప్రకారం గాయపడ్డవారిలో ఇంకా పరిహారం అందని బాధితులు 1. హనుమన్శెట్టి అనంతరావు, సింహాచల్‌నగర్, రాజమహేంద్రవరం 2. హనుమన్శెట్టి సత్యవతి, సింహాచల్‌నగర్, రాజమహేంద్రవరం 3. నడిమిపల్లి బుచ్చి వెంకాయమ్మ, అల్లవరం,తూర్పుగోదావరిజిల్లా 4. పల్లప్రోలు విజయలక్ష్మి, కొండుబట్లపాలెం, గుంటూరు జిల్లా 5. బి.సత్యవతి, పెందుర్తి, విజయనగరం 6. కె.జానకి, శ్రీకాకుళం 7. ఎం.తులసి, రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా 8. బి.సూర్యవతి, రాజమహేంద్రవరం 9. వి.భాగ్యవతి, ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా 10. బి.సింహాచలం, పెందుర్తి, విజయనగరం జిల్లా 11. ఎం.పాపమ్మ, విశాఖపట్నం 12. జి.ఇందిరా కుమారి, ప్రకాశం 13. పి.రమాదేవి, రాజాం 14. వీరప్పరెడ్డి 15. బి.ఇందిర 16. బి.లక్ష్మి, విశాఖపట్నం 17. రమణమ్మ, నెల్లూరు 18. పి.కృష్ణమూర్తి, హైదరాబాద్ 19. కె. అబ్బులు, అన్నదేవరపేట 20. సీహెచ్,దుర్గారావు, కొవ్వూరు 21. పి.భద్రరావు, రాజమహేంద్రవరం. -
పుష్కర సంబరం..
ముగిసిన అంత్యపుష్కరాలు చివరిరోజు భక్తుల తాకిడి ధర్మపురి 40వేలు, కాళేశ్వరంలో 10వేల మంది పుష్కరస్నానం ధర్మపురి/కాళేశ్వరం/ ౖయెటింక్లయిన్‌కాలనీ: 12 రోజులపాటు జరిగిన అత్యపుష్కరాలు వైభంగా ముగిశాయి. కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల, మంథని, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. చివరిరోజు మహాహారతి వైభంగా నిర్వహించి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ధర్మపురి గోదావరిలో గురువారం 40వేలమంది పుణ్యస్నానం చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ఐదువేల మందికి అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఆంధ్రాబ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శివానందశేషగిరి రావు, సీసీఎల్ఏ కార్యదర్శి కె. కష్ణ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో నిర్వహించిన ప్రత్యేక గంగాహారతి కార్యక్రమానికి చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో అంత్యపుష్కరాలు వైభవంగా జరిగాయి. 12 రోజులపాటు వివిధ ప్రాంతాలనుంచి లక్షా 50వేలమంది పుష్కర స్నానాలు ఆచరించారు. చివరి రోజు 10వేలకు పైగా స్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక శ్రావణమాసపు పూజలు నిర్వహించారు. మహిళలు గోదావరిమాతకు మహిళలు దీపారాధన, లక్షవత్తులు వెలిగించారు. శుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. చివరిరోజు పూజల్లో మంథని ఆర్డీవో బాల శ్రీనివాస్, సర్పంచ్ మాధవి, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనభాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు పాల్గొన్నారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహించారు. 12రోజులకు కాళేశ్వరం దేవస్థానానికి రూ.11.20లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో డి.హరిప్రకాశ్‌రావు తెలిపారు. కమాన్‌పూర్ మండలం సుందిళ్ల గ్రామ పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది. -
పులకించిన గోదావరి
భక్తజన సంద్రం పుష్కర స్నానానికి పోటెత్తిన జనం ధర్మపురిలో 50 వేల మంది స్నానాలు ధర్మపురి/కాళేశ్వరం/మంథని : గోదావరి పులకించింది. శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది పుష్కరస్నానం చేసి పుణీతులయ్యారు. ఒక్క ధర్మపురిలోనే సుమారు 50 వేల మంది స్నానాలు ఆచరించారు. కాళేశ్వరంలో 8 వేలు, మంథనిలో ఐదు వేల మంది స్నానాలు చేశారు. అనంతరం గోదావరిలో పిండ్ర ప్రదానాలు, మొంటెల వాయినాలు, బ్రాహ్మనులకు దానధర్మాలు చేశారు. గోదావరి మాతకు దీపారాధనలు చేశారు. సాయంత్రం మహాహారతి ఘనంగా నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. తహశీల్దార్ మహేశ్వర్, సర్పంచ్ సంగి సత్తమ్మ, ఈవో రాజరెడ్డి పర్యవేక్షణ చేశారు. కాళేశ్వరంలో మహిళలు గోదావరిలో పూలు, పండ్లు, వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. శుభానందదేవి ఆలయంలో శ్రావణ పూజలు కొనసాగాయి. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. సాయంత్రం గోదావరి మాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరంలో కరీంనగర్,ఆదిలాబాద్ జోనల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి పుష్కరస్నానం చేశారు. కార్యక్రమంలో సర్పంచి మెంగాని మాధవి, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, ఎండోమెంట్ డీఈ రాజేష్, ఆలయ మాజీ ధర్మకర్త అశోక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, అర్చకులు కష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ఫణీంద్రశర్మ, రామన్నశర్మ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మంథనిలో భక్తుల తాకిడి కనిపించింది. -
పుష్కరాల ఘోరానికి ఇంకా తేలని బాధ్యులు
-
ముగిసిన గోదావరి పుష్కర మహాసరంభం
-
పుష్కర స్నానం చేసిన శివచేన ఎంపీ భావన
-
బాసరలో కొనసాగుతున్న పుష్కరరద్దీ
-
’నేను ఏషార్ట్ ఫిలిం తీయలేదు’
-
పుష్కర స్నానం చేసిన బోయపాటి
-
బాసరలో ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి
-
రాజమండ్రిలో వరుస అపశృతులు
-
'3 నిమిషాల్లోనే స్నానాలు ముగించండి'
-
పదోరోజు కొనసాగుతున్న పుష్కరాలు
-
వానలోనూ భక్తుల పుష్కరస్నానాలు
-
రాజమండ్రిలో విశేషరీతిలో అన్నదానాలు
-
బాసరలో పుష్కరస్నానం చేసిన అంధులు
-
బస్సులోనుంచి జారిపడి వ్యక్తిమృతి
-
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
-
(గో)దారీ తెన్నూ లేదు
-
హారతి కనిపించేలా తీయమన్నారు
-
కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం
-
పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్
భద్రాచలం : గోదావరి పుష్కరాలకు వచ్చే దిగంబర సాధువుల కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోతే పుష్కర ఘాట్‌ను ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఐ కార్యాలయంలో పుష్కర పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 15 నాటికి పుష్కరాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఇందకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమన్వయంతో అందరూ కలసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. -
మీ సేవ ద్వారా పుష్కర దర్శనం టికెట్లు
భద్రాచలం చిత్రకూటమండపంలో సువర్ణ పుష్ప పూజలు భద్రాచలం: గోదావరి పుష్కరాల సమయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వైదిక కమిటీ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది సమావేశమై దీనిపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కర భక్తులకు ఆర్జిత సేవలు కల్పించాలనే లక్ష్యంతో సువర్ణ పుష్ప పూజలను గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలన చేస్తున్నట్లుగా తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనంనకు రూ. 200, శీఘ్ర దర్శనానికి రూ.50 టికెట్టుగా నిర్ణయించే విషయమై చర్చించారు. గోదావరి పుష్కరకాలంలో మీ సేవ కేంద్రాల ద్వారా టికెట్లను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. పుష్కరాల సమయంలో పురోహితులకు దేవస్థానం ద్వారా గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లుగా ఈవో చెప్పారు. ఆలయ వేళల్లో మార్పు.. సాధారణ రోజుల్లో ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి రాత్రి 9గంటలకు ఆలయం తలుపులు వేస్తారు. గోదావరి పుష్కరాలు జరిగే జులై 14 నుంచి 25 వరకూ తెల్లవారు ఝా మున 4గంటల నుంచి 12 గంటల వరకూ ఆల యం తలుపులు తెరిచి ఉంచుతారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ ఆల యాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. -
గోదావరి పుష్కరాలకు 500 కోట్లు : మంత్రి