ఒక మహాసంరంభానికి తెరపడింది. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద పండగగా నిలిచిన.. పన్నెండు రోజులపాటు సాగిన.. గోదావరి పుష్కర మహాపర్వం శనివారం సాయంత్రం 6.38 గంటలకు అట్టహాసంగా ముగిసింది. మానవాళితోపాటు సమస్త జీవజాలానికీ జీవనాడిగా మారిన తల్లి గోదావరి మాత రుణం తీర్చుకునేందుకు ఈ జిల్లా జిల్లావాసులతోపాటు.. రాష్ట్రం నలుమూలల నుంచి.. దేశ విదేశాల నుంచి యాత్రికులు కోట్లాదిగా ఈ మహాపర్వం సందర్భంగా పోటెత్తారు. గోదారి మాత ముందు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లారు. వెల్లువెత్తిన భక్తులను చూసి గోదావరి తల్లి కూడా పులకించిపోయింది. పుష్కరాల తొలి రోజే జరిగిన తొక్కిసలాటలో 29 మంది, పుష్కరాలకు వస్తూ ఇంకా అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలింది. మరోపక్క పుష్కర పనులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క ప్రభుత్వం అరకొర సౌకర్యాలు మాత్రమే కల్పించడం యాత్రికులను ఇబ్బందులకు గురి చేసింది. ఏది ఎలా ఉన్నా ఈ మహాపర్వానికి కోట్లాదిగా భక్తులు తరలివచ్చి, విజయవంతం చేశారు.
Published Sun, Jul 26 2015 11:33 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement