మీ సేవ ద్వారా పుష్కర దర్శనం టికెట్లు
- భద్రాచలం చిత్రకూటమండపంలో సువర్ణ పుష్ప పూజలు
భద్రాచలం: గోదావరి పుష్కరాల సమయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో వైదిక కమిటీ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది సమావేశమై దీనిపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కర భక్తులకు ఆర్జిత సేవలు కల్పించాలనే లక్ష్యంతో సువర్ణ పుష్ప పూజలను గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలన చేస్తున్నట్లుగా తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనంనకు రూ. 200, శీఘ్ర దర్శనానికి రూ.50 టికెట్టుగా నిర్ణయించే విషయమై చర్చించారు. గోదావరి పుష్కరకాలంలో మీ సేవ కేంద్రాల ద్వారా టికెట్లను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. పుష్కరాల సమయంలో పురోహితులకు దేవస్థానం ద్వారా గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్లుగా ఈవో చెప్పారు.
ఆలయ వేళల్లో మార్పు..
సాధారణ రోజుల్లో ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి రాత్రి 9గంటలకు ఆలయం తలుపులు వేస్తారు. గోదావరి పుష్కరాలు జరిగే జులై 14 నుంచి 25 వరకూ తెల్లవారు ఝా మున 4గంటల నుంచి 12 గంటల వరకూ ఆల యం తలుపులు తెరిచి ఉంచుతారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ ఆల యాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు.